Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
గుండెపై ఈటెలతో పొడిచినట్లుగా నీ మాటలతో పొడిచావు, వాడుకుని వదిలేశావు, ఎంతైనా నా పిల్లవే #mystory210
నీ పై నాకు ఇంకా నమ్మకం ఉంది. నీకు మాత్రం నాపై నా ప్రేమపై అస్సలు నమ్మకం లేదు. కానీ నీ మీద ఉండే ఇష్టం నా కట్టెకాలేదాకా అలాగే ఉంటుంది. గుండెపై ఈటెలతో పొడిచినట్లుగా నీ మాటలతో పొడిచావు, వాడుకుని వదిలేశావు,
అవి మనం పదో తరగతి చదువుకుంటున్న రోజులు. నీకు గుర్తుందో లేదో ఆ రోజు మనమిద్దరం ట్యూషన్ కు లేట్ గా వెళ్తున్నాం. ఆలస్యం అయ్యిందని నువ్వు ఆయాసం వచ్చేలా పరుగెడుతున్నావ్. సార్ కొడతాడామోనని నేను కూడా సైకిల్ ను చస్తూ బతుకుతూ తొక్కుతూ వెళ్తున్నా.
నీ పరుగును చూసి నా చేతులు సడన్ గా సైకిల్ రెండు బ్రేక్ లను గట్టిగా నొక్కేశాయి. స్పోర్ట్స్ బైక్ మాదిరిగా ఒక్కసారిగా బుజ్ మంటూ ఆగిపోయింది. సైకిల్ ఎక్కుతావా అంటూ నా కళ్లు నిన్ను చూశాయి. నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎక్కేశావు.

ఒక్కసారి మాట్లాడితే చాలు
అప్పటి వరకు నీతో జీవితంలో ఒక్కసారైనా మాట్లాడితే చాలు అనుకున్న నాకు ఆ రోజు మాత్రం ఇది చాలురా జీవితానికి అనిపించింది. రోజూ నిన్ను చూస్తే చాలు ఏదో సాధించానన్నంత ఆనందం కలిగేది నాకు. ఫేర్ వెల్ పార్టీ రోజు నా మనస్సులోని మాటను నీకు చెబితే నువ్వు నవ్విన నవ్వు నాకింకా గుర్తు.

ప్రేమాయాణం నాకు జ్ఞాపకమే
టెన్త్ పబ్లిక్ పరీక్షలప్పుడు మనమిద్దరం నడిపిన ప్రేమాయాణం నాకు జ్ఞాపకమే. ఆ వయస్సులో మన మధ్య ఉన్నది ప్రేమో ఆకర్షణో నాకు తెలియదు. కానీ నువ్వుంటే చచ్చేంత ఇష్టం అప్పుడూ ఉంది.. ఇప్పుడూ ఉంది. నా డొక్కు సైకిల్ పైనే రోజూ నువ్వు పదో తరగతి పబ్లిక్ సెంటర్ కు వచ్చేదానివి.

ప్రేమ ఆ పరీక్షల వరకే పరిమితమా?
ఎగ్జామ్ హాల్ లోనూ నా వెనకాలే నువ్వు కూర్చొనేదానివి.
కానీ ప్రేమ ఆ పరీక్షల వరకే పరిమితం అవుతుందని అనుకోలేదు. టెన్త్ రిజల్ట్స్ లో నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు. నేను ఒక సబ్జెక్ట్ ఫెయిలయ్యాను. తర్వాత నువ్వు సిటీలో కాలేజీలో జాయిన్ అయ్యావు. నేను కొన్నాళ్లు ఊర్లోనే ఉపాధి పనులు చేసుకుంటూ బతికాను.

మూతి ముడుచుకుని వెళ్లిపోయావు
నువ్వు ఎప్పుడు ఊరికి వస్తావోనని కళ్లు కాయలు కాసేలా చూసేవాణ్ని. దసరా సెలవులకు నువ్వు ఊరికి వచ్చావు. నేను అసలు నీకు తెలియనట్లుగా నీకు నేను పరిచయం లేనట్లుగా నటించావు. మాట్లాడడానికి ప్రయత్నిస్తే కూడా మూతి ముడుచుకుని వెళ్లిపోయావు. మొదట నాకు అర్థం కాలేదు. తర్వాత తెలిసింది. నువ్వు కేవలం నన్ను వాడుకున్నావని.

ఎంతైనా ఇది నా పిల్లే
నీ మీద కోపంతో.. నువ్వు చదివే కాలేజీలో జాయిన్ అవ్వాలని మళ్లీ బుక్స్ ముందు పెట్టుకున్నా. టెన్త్ పాసయ్యాను. నీ జూనియర్ గా మీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ కాలేజీ ఫస్ట్ గా నిలిచాను. మళ్లీ అప్పుడు నువ్వు నాకు దగ్గరయ్యావు. ఎంతైనా ఇది నా పిల్లే కదా అని నీతో చనువుగా గడిపాను. నీట్ కోసం నువ్వు వన్ ఇయర్ కోచింగ్ తీసుకున్నావ్.. నేను డైరెక్ట్ గా ర్యాంక్ కొట్టేశాను.

మెడికల్ కాలేజీలో జాయిన్
ఇద్దరం మళ్లీ ఒకే మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాం. అక్కడ మాంచి రిచ్ పర్సన్ దొరికేసరికి మళ్లీ నాకు హ్యాండ్ ఇచ్చావు. ఇక జీవితంలో నీ ముఖం చూడకూడదనుకున్నాను. నేను జాబ్ లో సెటిల్డ్ అయ్యాక మళ్లీ నా దగ్గరికే వచ్చావు. ఎవడో నిన్ను మోసం చేశాడని నీ స్టోరీ మొత్తం నాకు చెప్పావు.

ఎన్నోసార్లు గాయపరిచావు
నీపై అంత ప్రేమ చూపించాను. కానీ నువ్వే నన్ను చాలా సార్లు మోసం చేశావు. నా గుండెను ఎన్నోసార్లు గాయపరిచావు. నేను కోలుకోవడం కోసం ప్రతి సారి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. నీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నా మనస్సును కుంగదీసింది.

ఈటెలతో పొడిచినట్లుగా పొడిచావు
నువ్వు నా విషయంలో తెలిసో.. తెలియకో తప్పు చేశావుగానీ.. నా గుండెపై ఈటెలతో పొడిచినట్లుగా నీ మాటలతో పొడిచావు.. ఆ గాయాలు ఇంకా మానలేదు. అలాంటి నిన్ను మళ్లీ నమ్మాలంటే నా మనస్సు ఒప్పుకోవడం లేదు. కానీ ద్రోహం చేసినా నిన్నే మళ్లీ ఇప్పుడు నమ్ముతున్నాను.

కట్టెకాలేదాకా ఉంటుంది
నీ పై నాకు ఇంకా నమ్మకం ఉంది. నీకు మాత్రం నాపై నా ప్రేమపై అస్సలు నమ్మకం లేదు. కానీ నీ మీద ఉండే ఇష్టం నా కట్టెకాలేదాకా అలాగే ఉంటుంది. ఎందుకంటే నీ కోసం నా గుండెల్లో నిర్మించిన ప్రేమాలయం ఇసుక తిన్నెలపై లేదు. నా గుండెల్లో లోతుల్లో పాతుకుని ఉంది.
అందులో నిన్ను దేవతలా ఉంచుకుని ఆరాధిస్తున్నాను.

నా మనస్సుకు ఎన్ని గాయాలు చేసినా
నువ్వు నా మనస్సుకు ఎన్ని గాయాలు చేసినా నేను మాత్రం నా ప్రాణం ఉన్నంత క్షమిస్తూనే ఉంటాను. నువ్వు నాకు చేసిన ద్రోహం ఏమిటో నీకు తెలుసు. ఆ బాధ కూడా నిన్ను కుంగదీయకూడదని కోరుకునే మనస్సున్న వాణ్ని నేను.

ఎంతైనా నువ్వు నా పిల్లవే కదా
నా మదిని నువ్వు ఎంత కష్టపెట్టినా, నువ్వు నాతో ప్రేమగా మాట్లాడితే అవన్నీ మర్చిపోయే మనస్సే నాది. ఇప్పుడు మళ్లీ నిన్ను నమ్ముతున్నాను. చివరిదాకా ఉంటావో.. మధ్యలో మళ్లీ నన్ను ఒంటిరి చేసి వెళ్తావో నీ ఇష్టం. నీపై నాకున్న ప్రేమ మాత్రం అజరామరం. ఎంతైనా నువ్వు నా పిల్లవే కదా.



Click it and Unblock the Notifications
