ఆ అమ్మాయి నన్ను ఆ విషయంలో చాలా తక్కువ అంచనా వేసింది - mystory#116

Written By:
Subscribe to Boldsky

మా నాన్న నా చిన్నప్పుడే యాక్సిండెంట్ లో చనిపోయాడు. నేను అమ్మా మాత్రమే ఉంటాం. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాణ్ని. అలా హ్యాపీగా సాగిపోతున్న నా జీవితంలోకి సాగిపోతున్న నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది.

మనసుపడ్డాను

మనసుపడ్డాను

ఆ అమ్మాయిపై నేను మనసుపడ్డాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె మా బంధువుల అమ్మాయే. ఆమె పేరు శ్వేత. వాళ్లతల్లిండ్రులిద్దరూ బాగా ఆస్తిపరులు. అందుకే బలుపు ఎక్కువ. శ్వేత నాకు వరుసకు మరదలు అవుతుంది. నేను తనని బేబీ అనే వాణ్ని.

చాటింగ్

చాటింగ్

శ్వేత కొంతకాలం పాటు నాతో చాటింగ్ చేసింది. నాతో ఫోన్లో మాట్లాడేది. దాంతో ఆమె నన్ను లవ్ చేస్తుందనుకున్నాను. కానీ నేను అనుకున్నది పొరపాటు.

రిప్లై ఇచ్చేది

రిప్లై ఇచ్చేది

బేబీ ఎలా ఉన్నావ్‌? ఏం చేస్తున్నావ్‌? అంటూ ప్రతి క్షణం మెసేజ్ లు పంపేవాణ్ని. తను కూడా నాకు రిప్లై ఇచ్చేది. అలా తనపై ప్రేమ పుట్టింది.

మెసేజ్ తోనే నాకు తెల్లారేది

మెసేజ్ తోనే నాకు తెల్లారేది

ఉదయం ఆమె మెసేజ్ తోనే నాకు తెల్లారేది. రాత్రి ఆమె మెసేజ్ తోనే నాకు రోజు గడిచిపోయేది. ఒక రోజూ నువ్వుంటే నాకిష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని శ్వేతకు నేను ప్రపోజ్ చేశాను.

బ్లాక్ చేసింది

బ్లాక్ చేసింది

శ్వేత వెంటనే నన్ను వాట్సాప్ లో బ్లాక్ చేసింది. తర్వాత నేను ఆమె కాలేజీకి నేరుగా వెళ్లాను. ఏమైంది.. శ్వేత అని అడిగాను. నిన్నెందుకు ప్రేమించాలి. నీకేమి ఆస్తి ఉందని ప్రేమించాలి అని అంది. నాకు చాలా కోపం వచ్చింది.

నాకేమి తక్కువ

నాకేమి తక్కువ

బైక్ ను వంద స్పీడ్ లో నడుపుతూ ఇంటికొచ్చాను. అయినా నాకేమి తక్కువ అని నా ఫీలింగ్. నీలో ప్రేమించడానికి ఏం ఉంది.. ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ బతికేవాడివి అంటూ నన్ను కరివేపాకులా తీసి పారేసింది.

గవర్నమెంట్ ఉద్యోగం

గవర్నమెంట్ ఉద్యోగం

తర్వాత ఇంటికొచ్చి చాలా సేపు ఆలోచించాను. కచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకున్నాను. అంతే గట్టిగా అనుకున్నాను. రెండేళ్లపాటు చదువు తప్ప మరో ధ్యాస లేకుండా గడిపాను.

ప్రైవేట్ జాబ్ లోనే

ప్రైవేట్ జాబ్ లోనే

అయినా ఫలితం లేకపోయింది. నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. కుటుంబం గడవడానికి మళ్లీ ప్రైవేట్ జాబ్ లోనే జాయిన్ కావాలని అనుకున్నాను. నేను గతంలో పని చేసిన ఆఫీస్ కు వెళ్తే పెద్ద పోటుగాడిలా వెళ్లిపోయావ్ కదా.. మళ్లీ ఎందుకొచ్చావ్ అని ఛీదరించుకున్నారు.

శ్వేత మాటలే గుర్తొచ్చేవి

శ్వేత మాటలే గుర్తొచ్చేవి

అయినా కాళ్లావేళ్లాపడి మళ్లీ అదే ఉద్యోగంలో చేరాను. కానీ ప్రతిక్షణం శ్వేత మాటలే గుర్తొచ్చేవి. జాబ్ లో ఉండే ఈసారి కోచింగ్ లో జాయినయ్యాను. సాయంత్రం నుంచి రాత్రి పన్నెండు దాకా చదవడమే. ఈసారి కచ్చితంగా సాధిస్తానని నా మనస్సులో అనిపించింది.

ఎస్సై పోస్ట్ వచ్చింది

ఎస్సై పోస్ట్ వచ్చింది

గ్రూప్ 2 ట్రై చేశాను రాలేదు. తర్వాత ఎస్సై పోస్ట్ వచ్చింది. నా ఆనందానికి అవధుల్లేవు. నేను గెలిచాను అనే ఆనందంలో నన్ను నేనే మరిచిపోయాను.

సొసైటీలో ఒక పేరుంది

సొసైటీలో ఒక పేరుంది

తర్వాత వాళ్ల ఇంటికి డైరెక్ట్ గా వెళ్లాను. శ్వేత ఆ రోజు నన్ను ఎగతాలి చేశావ్.. ఈ రోజు నాకంటూ సొసైటీలో ఒక పేరుందని చెప్పి వచ్చాను.

అలా మాట్లాడినందుకే కదా

అలా మాట్లాడినందుకే కదా

తర్వాత నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. శ్వేత ఆ రోజు నన్ను అలా మాట్లాడినందుకే కదా నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది. ఒక రకంగా శ్వేత నన్ను మంచి మార్గంలోనే నడిపించింది.

English summary

the selfish girl changed my life

the selfish girl changed my life