For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొట్టమొదటిసారి డేటింగ్ వెళ్తున్నారా? ఈ ఐడియాలు మీ “డేటింగ్” ను పెళ్లిదాకా తీసుకుని వెళ్ళగలవు. అసలు “ప్లెంటీ ఆఫ్ ఫిష్” సర్వే ఏం చెప్పింది?

|

మొట్టమొదటి డేటింగ్ ఐడియాల విషయానికి వస్తే, ప్రామాణికంగా విందు మరియు మూవీ వంటివే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ వీటి నుండి మరింత వైవిధ్యపూరితమైన ఆలోచనలను ఎంచుకోవడం ద్వారా మీ డేటింగ్ మరింత సంతోషంగా సాగేలా తోడ్పాటుని అందిస్తుంది. ఒకవేళ ఈ సంబంధాన్ని దీర్ఘకాలం కొనసాగించాలి అన్న ఆలోచన చేస్తే, కొన్ని విధానాలను అనుసరించక తప్పదు మరి. ఈ ఐడియాలకు, బంధం బలపడడానికి మద్య సంబంధం ఉందా? అని అనిపిస్తుంది కదూ. అంతేకాకుండా మీరు వేసవిలో చేసే ఐడియాలు శీతాకాలంలో వర్తించవు, అదేవిధంగా శీతాకాలంలో ఐడియాలు వేసవి కాలంలో వర్తించవు. కావున డేటింగ్, పెళ్లిదాకా రావాలి అని కోరుకునేవారికి టాప్ బెస్ట్ ఐడియాలు ఇచ్చేందుకు ఈ వ్యాసం సహాయపడగలదు.

ఆగష్టు,16-20, 2018 మధ్య కాలంలో, అమెరికాలోని “ప్లెంటీ ఆఫ్ ఫిష్” అనే సంస్థ, 400 మంది కన్నా ఎక్కువ మంది డేటింగ్ అప్లికేషన్స్ ద్వారా వివాహం చేసుకున్న వారి మీద సర్వే చేసింది. క్రమంగా వారు పాటించిన విధానాలను పరిశీలించడం ద్వారా ఒక నివేదికని రూపొందించింది.

The Top First-Date Ideas That Lead To Marriage, According to PlentyOfFish

“ప్లెంటీ ఆఫ్ ఫిష్” డేటింగ్ అనలైజింగ్ నిపుణుడైన కేట్ మాక్లీన్ చెప్పిన ప్రకారం, "డేటింగ్లో సంభాషణలను ప్రోత్సహించేలా మొట్టమొదటగా లొకేషన్ ఎంచుకోవడం ముఖ్యం". క్రమంగా వ్యక్తుల గురించిన ఒక అవగాహన వచ్చేందుకు ఈ చర్యే ప్రధమంగా దోహదం చేస్తుందని, క్రమంగా భవిష్యత్ కార్యాచరణలపై ఒక ఆలోచన తీసుకుని రాగలదని చెప్పబడింది. అంతేకాకుండా ఎంచుకునే స్థలాలు ఎటువంటి అసౌకర్యాలకు గురవకుండా, పరిసరాలు మీకు సుపరిచితం అయిఉండేలా చూసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. క్రమంగా సంభాషణలు జోరందుకుంటాయి. ఆవిధంగా, డేటింగ్లో మొదటిసారిగా వ్యక్తులను కలుసుకునేటప్పుడు, మంచిస్థలాల ఎంపిక కూడా కీలకపాత్ర పోషిస్తుందని అని మెక్లీన్ అభిప్రాయం.

మొట్టమొదటి డేటింగ్ లొకేషన్స్ గురించిన ఆలోచనలు చేస్తున్నవారైతే, లొకేషన్ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందా? వంటి అనేక ప్రశ్నలు కూడా తలెత్తడం సహజం. కావున ఇక్కడ ఈవ్యాసంలో చెప్పబడిన అంశాలను ఒకసారి నోట్ చేసుకోవడం మంచిది.

1. రెస్టారెంట్ వెళ్ళండి భోజనానికి

1. రెస్టారెంట్ వెళ్ళండి భోజనానికి

ఒక మంచి రెస్టారెంట్లో భోజనానికి వెళ్ళడంద్వారా, మొట్టమొదటి డేటింగ్ పరిచయం కూడా, వివాహానికి దారితీసే పరిస్థితులు 55.1శాతం వరకూ ఉన్నాయి. అవును, మీరు ఆన్లైన్లో, ఏదైనా డేటింగ్ అనువర్తనంద్వారా ఒకరిని కలిసినప్పుడు, మీరు ఎంచుకునే డిన్నర్ డేట్, మీ జీవితాన్ని మలుపుతిప్పే అవకాశాలు లేకపోలేదు. కేవలం కలుసుకోవడం మాత్రమే కాకుండా, ఏదైనా రెస్టారెంట్లో లంచ్ లేదా డిన్నర్ ఎంచుకోవడం ఉత్తమం.

2. రొమాంటిక్ వాక్

2. రొమాంటిక్ వాక్

మొట్టమొదటి డేటింగ్ కలయికలో, రెస్టారెంట్ తర్వాతి ఆలోచనగా, రొమాంటిక్ వాక్ రెండవ స్థానంలో ఉంది. సర్వేలో 29.9 శాతం మంది తమ మొదటి డేట్ రోజున, ఈ అంశాన్ని అనుసరించారని చెప్పబడింది. పైగా వారు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు, కాబట్టి, ఇది కూడా బాగానే పనిచేస్తుంది!

ఏదైనా మంచి చోటును ఎంపిక చేసుకుని, కొండ ప్రాంతాలు, మంచు పర్వతాలు, లోకేషన్స్, బీచ్, లేదా మైదానాలలో కాసేపు మాటలు కలుపుతూ నడవడం ద్వారా మీ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్చని ఇరుపక్కలా పొందగలరు. ఈ సమయంలో మద్యానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిదని చెప్పబడింది.

3. బార్లో డ్రింక్

3. బార్లో డ్రింక్

నిజానికి మనదేశంలో ఇది ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేము కానీ, సర్వే బట్టి చెప్తున్నాము. 27.7శాతం మంది ప్రజలు, వారి మొదటి డేట్, బార్లో జరిపినట్లుగా నిర్ధారించారు. ఇష్టమైన డ్రింక్ బహుమతిగా ఇవ్వడం, వారితో కొద్దిమోతాదులో మద్యాన్ని స్వీకరించడం మొదలైన చర్యలలో, తమ భావాలను పంచుకోవడం, ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఇవ్వడంలో సహాయం చేయగలదని చెప్పబడింది. అంతేకాకుండా రూఫ్ టాప్ బార్స్ వైపే వారు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.

4. మంచి సినిమా

4. మంచి సినిమా

ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ ప్రయోజనం ఎక్కువగా ఉండాలి అనుకునే వారికి ఉత్తమమైన చాయిస్ వలె, సినిమా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఈ పద్దతిని మనదేశంలో అధికంగానే ఫాలో అవుతుంటారు. సర్వే ప్రకారం కూడా 18 శాతం మంది, ఈ చర్యకే ఎక్కువ మొగ్గు చూపారని తేలింది. క్రమంగా సినిమా నుండి జీవితాల వరకు సంభాషణ చేపట్టడం జరుగుతూ వస్తుందని చెప్పారంతా.

5. కాఫీ కూడా

5. కాఫీ కూడా

5 వ ఉత్తమమైన డేటింగ్ ఐడియాగా, కాఫీ ఉంది. ఈ ప్రపంచంలో కొన్ని అనివార్య జీవనశైలి కార్యాలు ఉంటాయి అనేకమందికి, అందులో కాఫీ కూడా ఒకటి. సర్వేలో 15 శాతం మంది కాఫీ షాప్ వైపుకే మొగ్గు చూపడం జరిగింది. క్రమంగా డిన్నర్, డిసర్ట్ జోడించడం మంచిది.

6. బీచ్

6. బీచ్

వేసవిలో అనుసరించదగిన మంచి డేటింగ్ ప్లాన్లలో మొదటి 9లో బీచ్ కూడా ఒకటి. సర్వేలో 10.3శాతం మంది, తమ భావాలను వ్యక్తపరచుటకు బీచ్ ఉత్తమమైన ప్రదేశంగా పేర్కొన్నారు. అద్దెకు చైర్స్ తీసుకుని లోన్లీ ప్రదేశానికి వెళ్లి సమయాన్ని వెచ్చించడం. లేదా బీచ్లో డిన్నర్ ప్లాన్ చేయడం మొదలైనవి ఎంతగానో సహాయం చేస్తాయి.

7. మ్యూజిక్ ఫెస్టివల్ లేదా కాన్సర్ట్

7. మ్యూజిక్ ఫెస్టివల్ లేదా కాన్సర్ట్

అనేకమంది సంగీత ప్రియులు ఉంటారు. రాక్ స్టార్లకు అభిమానులుగా కూడా ఉంటారు. వారి అభిరుచులకు తగినట్లుగా, వారిని ఆ ఫెస్టివల్లో భాగం చేయడం ద్వారా వారి మనసులో స్థానాన్ని సంపాదించగలరని చెప్పబడింది. సర్వేలో 5.6 శాతం మంది ఈ డేటింగ్ ఐడియాను అనుసరించారని తెలిపారు. చలనచిత్రాల విడుదల తేదీల వలె, కొన్ని మొబైల్ అప్లికేషన్లలో ఈ సంగీత విభావరి, మ్యూజిక్ ఫెస్టివల్ లేదా కాన్సర్ట్ సంబంధిత వివరాలు ఉంటాయి.

8. స్పోర్టింగ్ ఈవెంట్ & బైక్ రైడ్

8. స్పోర్టింగ్ ఈవెంట్ & బైక్ రైడ్

ఒక క్రీడా కార్యక్రమం చూడటం మరియు బైక్ రైడ్ కోసం వెళ్లడం వంటివి కూడా ఉత్తమమైన డేటింగ్ ప్లాన్లలో ఒకటిగా ఉంది. సర్వేలో 4.7 శాతం మంది తాము పెళ్లి చేసుకోడానికి దారి తీసిన డేటింగ్ ఐడియాలుగా వీటిని ఎంచుకున్నారు.

కొందరు వ్యక్తులు క్రీడల పట్ల మక్కువ ఎక్కువను ప్రదర్శిస్తుంటారు. బేస్బాల్, క్రికెట్, ఫుట్ బాల్, కబడ్డీ మొదలైన వాటి మీద ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు. క్రమంగా క్రీడలు జరిగే మైదానానికి తీసుకుని వెళ్ళడమే కాకుండా, ఏదైనా ఫుడ్ లేదా డ్రింక్స్ ఆఫర్ చేయడం కూడా బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు.

కొందరికి బైక్ రైడ్స్ అంటే మక్కువగా ఉంటుంది, మీ వద్ద సరైన బైక్ లేదని అనిపిస్తే, బైక్స్ అద్దెకి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. కానీ, బైక్లో మీరు ఎంత స్పీడ్ వెళ్ళారు అన్నది ఎవరూ పట్టించుకోరు, తమ పట్ల ఎంత జాగ్రత్తను ప్రదర్శిస్తున్నాడు అన్నది ఎక్కువగా గమనిస్తారు. అనగా, మీకే కాకుండా వారికి కూడా శిరస్త్రాణాలు ఇవ్వడం, పరిమితి దాటని మరియు ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వేగాన్ని అనుసరించడం, మద్యానికి దూరంగా ఉండడం, బ్రేకింగ్ సిస్టం సరిగ్గా ఉండేలా మరియు బండిమీద సరైన అవగాహన కలిగి ఉండడం, మీ మెయింటనెన్స్ మొదలైనవి కూడా వీరు గమనించే అంశాలుగా ఉంటాయి.

9. అమ్యూజ్మెంట్ పార్క్ లేదా కార్నివాల్

9. అమ్యూజ్మెంట్ పార్క్ లేదా కార్నివాల్

ఈ ప్రపంచంలో అమ్యూజ్మెంట్ పార్క్లను, కార్నివాల్ వంటి వాటిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. వారి అభిరుచులకు తగినట్లుగా, వారిని ఇలా తరచుగా పార్కులు లేదా కార్నివాల్ వంటి వాటికి తీసుకుని వెళ్ళడం కూడా ఉత్తమమైన ఆలోచనగా ఉంటుందని, సర్వేలో 1.9 శాతం మంది చెప్పారు. ఈదేశంలో అనేక జూలాజికల్ పార్కులు, స్నేక్ పార్కులు, మొసళ్ళ పార్కులు, ప్లానిటోరియాలు వంటి స్థలాలు అనేకం ఉన్నాయి. మీకు అందుబాటులో ఉండేలా ఎంచుకుని వెళ్ళడం ద్వారా, వారి సంతోషాలలో పాలుపంచుకోవచ్చు. సఫారీలు, పారాచూట్ గ్లైడింగ్, బోట్ షికార్ మొదలైనవి కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి. క్రమంగా ఉత్తమమైన రోజుగా మలచండి.

మీరు నివసించే ప్రాంతాన్ని ఉద్దేశించి మీ ప్రణాళికలు ఉండాలి, మరియు ఇద్దరికీ సౌకర్యవంతముగా, మీకు పూర్తి అవగాహన ఉండే ప్రదేశంగా ఉంటే మరీ మంచిది. పైగా మీ భావాలను వారితో పంచుకోవడంకోసం మాత్రమే కాకుండా, వారి భావాలకు కూడా విలువిచ్చేలా మీ పద్దతి ఉందని నిర్ధారించుకోండి. ఒక్కోసారి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వ్యక్తుల మీద దురభిప్రాయానికి కారణాలుగా మారవచ్చు. కాబట్టి, వాగ్వాదాలకు తావులేకుండా జాగ్రత్తగా నడుచుకోవలసి ఉంటుంది. డేటింగ్ వెళ్ళడం, యుద్దానికి సన్నద్దమవుతున్నట్లే, ఏమాత్రం బెడిసినా మొత్తానికే చెడిపోతుంది. పైన చెప్పిన ఈ ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని మీ డేటింగ్, వివాహానికి దారితీసేలా ప్రణాళిక చేసుకోండి మరి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

The Top First-Date Ideas That Lead To Marriage, According to PlentyOfFish

When it comes to first-date ideas, there’s a lot of options out there, from the standard dinner-and-a-movie to more atypical ideas, like going for a walk or hike. And you may wonder what the best first-date idea is if you want a long-term relationship. Is there a correlation between the two? Plus, then there’s different seasons to take into account — some first dates you go on in the summer may not apply to winter. Well, one dating platform found out the top first dates that lead to marriage.
Story first published: Friday, August 31, 2018, 17:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more