సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఆ హార్మోన్ విడుదలవుతుంది, అందుకే అలా ప్రవర్తిస్తారు #mystory249

సెక్స్ లో పాల్గొంటే కూడా సెరెటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోతారు. నేను ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఈ హర్మోన్స్

By

నేను కూడా అందరిలాగే ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డాక ఏవేవో మార్పులు వచ్చాయి. సరిగ్గా ఆకలయ్యేది కాదు. నిద్ర వచ్చేది కాదు. బాడీలోకి ఏదో కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఉండేది. ఒక్క క్షణం నా ప్రేయసితో మాట్లాడుకుంటే ఏమీ తోచేది కాదు. అనుక్షణం తన గురించే తపించేవాణ్ని.
నాలో నేనే మాట్లాడుకునేవాణ్ని.

ప్రేమలో ఉన్నప్పుడు నేను ఎలా ప్రవర్తించేవాడినో నాకే తెలియదు. అంత తిక్కతిక్కగా చేసేవాణ్ని. బెడ్రూమ్ లో ఫుల్ వ్యాల్యూమ్ తో సాంగ్స్ పెట్టుకుని పిచ్చివాడిలా డ్యాన్స్ చేసేవాణ్ని. ప్రేమ సఫలం అయ్యింది.. పెళ్లి చేసుకున్నా. పెళ్లాంతో రోజూ తగాదా పడుతూ అలా కాలం గడిపేస్తున్నా.

నువ్వే కాదు బాబూ

నువ్వే కాదు బాబూ

అసలు నేను ప్రేమలో పడ్డప్పుడు ఎందుకలా చేశానని ఒక సైకాలజిస్ట్ ని అడిగాను. నువ్వే కాదు బాబూ ఎవరైనా సరే అలాగే పిచ్చిపిచ్చిగా చేస్తారన్నాడు. ఎందుకంటే నీ మెదడులో కొన్ని రకాల రసాయనాలు ప్రేమలో ఉండే సమయంలో ఎక్కువగా విడుదల అవుతాయన్నారు.

వింతవింతగా ప్రవర్తించి

వింతవింతగా ప్రవర్తించి

విపరీతమైన సంతోషంలో ఉన్నప్పుడు మోతాదుకంటే ఎక్కువగా రసాయనాలు విడుదలవుతాయని చెప్పాడు. దాని వల్ల వింతవింతగా ప్రవర్తించి ఉంటావన్నాడు. ఇంకా ఆయన చెప్పాడంటే..

ఎడ్రిలిన్ ఎక్కువగా

ఎడ్రిలిన్ ఎక్కువగా

ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఎడ్రిలిన్ ఎక్కువగా ఉత్తత్తి అవుతుంది. దీంతో ఒళ్లంతా చెమలు ఎక్కువగా వస్తాయి. హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది. నిమిషానికొకసారి నోరు తడారిపోయి దాహం వేసినట్లు అనిపిస్తుంది. అందువల్లే ప్రేమలో ఉన్నవారు ఎప్పడూ ఏదో ఆందోళన చెందుతున్నట్లుగా ఉంటారు.

డోపమైన్ కూడా విడుదలవుతుంది

డోపమైన్ కూడా విడుదలవుతుంది

అలాగే డోపమైన్ కూడా విడుదలవుతుంది. దీంతో ఎక్కడలేని హ్యాపీనెస్ వస్తుంది. అందుకే ప్రేమలో ఉన్నవారు ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీలవుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే

సరిగ్గా తినాలని కూడా అనిపించదు. అయినా కూడా బాడీలో ఎనర్జీ ఉంటుంది. అందుకే ప్రేమలో ఉన్నవారు ఎక్కువగా తినకున్నా కూడా నీరసానికి గురికారు. ఎప్పుడూ స్మైలింగ్ తో కనిపిస్తారు.

సెరెటోనిన్ అనే హార్మోన్ కూడా

సెరెటోనిన్ అనే హార్మోన్ కూడా

ప్రేమలో ఉన్న వారిలో సెరెటోనిన్ అనే హార్మోన్ కూడా విడుదలవుతుంది. దీంతో వారికి ఏ ఇతర ఆలోచనలు రావు. వారు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి గురించే ఆలోచనలన్నీ ఉంటాయి. అంటే ప్రియురాలు తప్ప ఇంకెవ్వరూ గుర్తు రారు. ఎప్పుడూ ఆమెనే పరితపిస్తుంటారు. చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు. నిత్యం ఇష్టపడ్డ వారి గురించే ఆలోచిస్తూ ఆ ధ్యాసలోనే ఉంటారు.

సెక్స్ లో పాల్గొంటే కూడా

సెక్స్ లో పాల్గొంటే కూడా

అలాగే సెక్స్ లో పాల్గొంటే కూడా సెరెటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోతారు. నేను ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఈ హర్మోన్స్ అన్నీ విడుదల కావడం వల్లే అలా తిక్కతిక్కగా.. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి ఉంటానని సైకాలజిస్ట్ చెప్పారు.

మీరు కూడా ప్రేమలో ఉన్నప్పుడు అలాగే ప్రవరిస్తున్నారంటే మీ బాడీలోనూ అలాంటి హార్మోన్స్ విడుదల అవుతున్నాయన్నమాట.

Desktop Bottom Promotion