For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంబంధం మరియు నాపట్ల నిజాయితీతో ఉన్నాడా అసలు?

|

ప్రతి స్త్రీ తనకు కాబోయే భాగస్వామి లేదా బాయ్ ఫ్రెండ్ గురించిన అభద్రతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా తనపట్ల ఎంత వరకు నిజాయితీ కలిగి ఉన్నాడు? మరియు సంబంధంపట్ల ఎంత నిబద్దతను ప్రదర్శిస్తున్నాడు? అన్న ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటుంది. కొందరి జీవితాలలో మాత్రమే ఇటువంటి ప్రశ్నలకు తావులేకుండా అభద్రతా భావాలకు చోటివ్వకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కానీ ఎక్కువ శాతం నమ్మకం అనే అంశం మీదనే మదనపడుతూ ఉంటారు. అపోహలకు, భావోద్వేగాలకు సగం ఇవే కారణం కూడా కావొచ్చు.

ప్రతి సంబంధం ఒక భిన్నమైన కధనాన్ని కలిగి ఉంటుంది. ఈ అంశాలు స్త్రీ యొక్క మానసిక స్థితుల మీద ప్రభావం చూపుతాయి అని చెప్పడం లేదు కానీ, మనం తరచుగా చూసే ప్రతి సంబంధంలోనూ, స్త్రీ తన మనసులో ఏదో ఒకమూలన ఈ ప్రశ్నలను కలిగి ఉంటుంది. పరిస్థితులను బట్టి, క్రమంగా సంబంధంలో సురక్షితమైన భావనను కోల్పోతుంది, మరియు మానసిక కలవరానికి లోనవుతుంటుంది.

WILL HE BE TRUE TO ME AND TO THIS RELATIONSHIP?

ముఖ్యంగా, అసలెందుకు పురుషులు సంబంధాలపట్ల నిబద్దతను కలిగి ఉండరు? నిజాయితీకి ఎందుకు అంత దూరంగా ఉంటారు? సంబంధాలలో నీతినిజాయితీలు కలిగి ఉండడం అంత కష్టమైన అంశమా వీళ్ళకు? ఇటువంటి ప్రశ్నలు సంబంధాలలో తలెత్తుతున్నాయి అంటేనే, ఖచ్చితంగా వీటిని పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇటువంటి మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి అన్న ఆలోచన వచ్చినప్పుడు, పరిష్కరించాల్సిందిపోయి నిర్లక్ష్యం వహించి, సంబంధాలను నాశనం చేసుకుంటున్న అనేకమందిని ఉదాహరణలుగా మనం చూస్తూనే ఉంటాం.

ఇటువంటి ప్రశ్నకు సాధారణంగా సమాధానాలు దొరకడం కష్టంగా ఉంటుంది. దీనికి కారణం ప్రతి సంబంధం అనేక భిన్నమైన అంశాల మేళవింపులతో అర్ధం చేసుకోడానికి క్లిష్టతరంగా ఉంటుంది. కేవలం సంబంధంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తప్ప వారి భావాలు ఇతరులకు అర్ధం కావు, కానీ వీరిద్దరి మధ్యే సమస్యలు తలెత్తితే, ఆ పరిస్థితి వర్ణింపశక్యంకానిదిగా ఉంటుంది. మరియు కొన్ని ప్రశ్నలు మరియు అనుమానాలు సరైనవే అయితే, కొన్ని మాత్రం అపోహలుగా మిగిలిపోతుంటాయి.

ముఖ్యంగా వివాహం సందర్భంగా వ్యక్తి గురింన పూర్తి అవగాహన లేక, ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అనేకమందిని మనం చూస్తుంటాం కూడా. కానీ కొందరు పరిస్థితులు మరియు కాలానుగుణంగా తమ ఆలోచనా విధానాలలో మార్పులు పొందుతూ, చివరికి ఒక అభిప్రాయానికి వస్తుంటారు. కొందరు మాత్రం, అనుమానాలు, కలహాలు వంటి సమస్యలతో జీవితాంతం కాలం వెళ్ళదీస్తుంటారు. ఒక కోడిగుడ్డు ఆమ్లెట్ అవుతుందో, కోడిపిల్ల అవుతుందో తెలీని చందంలా.

కావున, పురుషులలో సంబంధంపట్లగల విశ్వాసం గురించిన ప్రశ్నలతో సతమతమయ్యే మహిళలకు ఈ వ్యాసం ఒక ఆలోచన ఇవ్వగలదు. ముఖ్యంగా ఈ వ్యాసం కొన్ని నిర్దిష్టమైన ప్రవర్తనా పద్ధతులు మరియు పరిశీలనల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పొందుపరచబడిన సంకేతాల గురించిన ప్రశ్నలు ఉన్నాయేమో చూసుకోండి.

అతను సంబంధం పట్ల విశ్వసనీయతను కలిగి ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి?

1. అతనిలోని నిజాయితీ:

1. అతనిలోని నిజాయితీ:

ఒక వ్యక్తి నిజాయితీపరుడు అని చెప్పడానికి, అతను మాట్లాడే విధానం ప్రధానంగా దోహదపడుతుంది. దాపరికాలులేని స్వభావాలు, ప్రతి చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలన్న ఆరాటం, ఆలోచనలు మొదలైనవి అతనిలోని నిజాయితీని బయటపెడుతాయి. రోజులో తాను ఎదుర్కొన్న ప్రతి ఒక్క పరిస్థితిని మీతో పంచుకోవాలని భావిస్తుంటాడు. ఈ స్వభావం జీవితంలో అనేక సమస్యలకు చెక్ పెట్టేలా ఉంటుంది. ఎప్పుడు కూడా మనతో తమ భావాలను పంచుకునేలా భాగస్వామి ఉన్న ఎడల, ఆ సంబంధంలో నిజాయితీ ఉందనే అర్ధం.

2. అతని మనసులో మీ స్థానం

2. అతని మనసులో మీ స్థానం

కొందరు తాము ఎక్కడికెళ్ళినా, ఎటువంటి తీరికలేని కార్యక్రమాలలో మునిగి ఉన్నా, మీకంటూ ఒక సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు, ఫోన్ ద్వారా లేదా వేరే ఇతర మార్గాల ద్వారా తన క్షేమ సమాచారాలను అందిస్తూ ఉంటాడు. ఈ పద్దతి, భాగస్వామిలో నమ్మకాన్ని పెంచడమే కాకుండా, వ్యక్తి క్షేమం గురించిన ఆందోళనలు లేకుండా స్వేచ్చగా ఉండగలుగుతుంది. మీరు అతని క్షేమం గురించి విచారణ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే, అతను మీకు ఆ అవకాశాన్ని ఇవ్వడు కాబట్టి. ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మనసులో మీస్థానం ఎన్నటికీ పదిలంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.

3. అతని ఆలోచనల నిండా...

3. అతని ఆలోచనల నిండా...

కుటుంబ సంక్షేమానికి, మరియు వృత్తిపరమైన అంశాలకు తప్ప ఏ ఇతర ప్రాధాన్యతలను, వ్యసనాలకు తావివ్వని వ్యక్తి ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అనే చెప్పాలి. స్నేహితులు, పార్టీలు వంటివి ఎన్ని ఇతరత్రా వ్యవహారాలు ఉన్నా కూడా, ముందు వరసలో తన కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చేవారు తక్కువగానే ఉంటారు. మరియు ఎటువంటి సమస్యలు ఉన్నా, తమ భాగస్వామితో స్వేచ్చగా పంచుకుంటూ, పరిస్థితులకు, భావాలకు విలువనిచ్చి నడుచుకునేలా ఉంటారు.

4. పాతజ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాడా

4. పాతజ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నాడా

కొంతమంది తమ గత జ్ఞాపకాలలోని పరిచయాలను గుర్తుపెట్టుకుని, ప్రస్తుత సంబంధాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ కొందరు వాటి గురించిన పూర్తి వివరాలను భాగస్వామికి తెలియజేసి, పరిష్కరించుకుని, లేదా ఆ జ్ఞాపకాలను పూర్తిగా పక్కన పెట్టి, వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్ ప్రణాళికలు చేస్తుంటారు. ఎప్పుడైనా గతజ్ఞాపకాలు మనసులో స్ఫురించినా, మీమీద ఉన్న ప్రేమ, ఆ జ్ఞాపకాలను తుడిచివేస్తుంటుంది. ఇటువంటి వ్యక్తులు అత్యంత అరుదైన వారిగా ఉంటారు. పాత పరిచయాలున్నాయని అనుమాన పడకుండా, ప్రస్తుత ఆలోచనా విధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. క్రమంగా మంచి ఫలితాలను పొందగలరు.

5. ఎల్లప్పుడూ ప్రేమతో మీవద్దకు వస్తున్నాడా

5. ఎల్లప్పుడూ ప్రేమతో మీవద్దకు వస్తున్నాడా

జీవితమన్నాక చిరాకులూ, పరాకులూ సర్వసాధారణంగానే ఉంటాయి. కానీ కోపాలు తాపాలు ఎంతసేపు చెప్పండి. మీ ఇద్దరి మద్య ప్రేమ, ఆ కోపాలను ఎక్కువసేపు నిలబడనీయదు. కొందరైతే, గొడవ పడ్డ 5 నిమిషాలకే అన్యోన్యతను ప్రదర్శిస్తుంటారు. మద్యలో పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నించిన వారు, చివరికి ఏ పరిస్థితిలో ఉన్నారో అర్ధంకాని విధంగా ఉంటాయి. ఎటువంటి సందర్భంలోనైనా మిమ్ములను ప్రేమగా దగ్గరకు తీసుకునే వ్యక్తిగా ఉంటే, అంతకన్నా సంతోషం మరొకటి లేదు. అలాకాకుండా, ఎక్కువకాలం ప్రేమ అనే పదానికే అర్ధం లేదన్నట్లు వ్యవహరిస్తుంటే, సమస్య జఠిలమైనదే అని చెప్పాలి.

English summary

WILL HE BE TRUE TO ME AND TO THIS RELATIONSHIP?

If you see these signs in your partner, then be certain that he is loyal and committed to you. If you see these traits missing in your partner then be certain he isn"t loyal. It is natural for every woman in love to be concerned with this question, “will he be true to me and to this relationship?" Read the article to get an in-depth idea about your partner.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more