Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉన్నా చేయలేను, అబ్బాయితో బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారు #mystory388
లోపల గదిలో కూర్చొన్న నా స్నేహితులంతా బయటకు రమ్మంటూ పట్టుబట్టారు. అందరం ఫుల్ హ్యాపీగా ఉంటే నువ్వొక్కదానివే ఎందుకలా ఉన్నావంటూ అందరూ అడిగారు. థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలనినాకూ అందరిలా థర్టి ఫస్ట్ న
అది డిసెంబర్ ముప్పై ఒకటి. నాతోటి అమ్మాయిలంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. నేను మాత్రం కాలేజీ హాస్టల్ లో నుంచి బయటకు రాలేదు. హాస్టల్ బయట పెద్దపెద్ద మంటలు వేసుకుని చలిగాచుకుంటున్నారు.
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కేకలు వేస్తున్నారు. ఎప్పుడూ లేని ఆనందం అందరి ముఖాల్లో నాకు కనపడుతోంది. ఏదో సాధించామన్నా సంతోషం... ఏదో జరగబోతుందన్నట్లుగా అందరి మోములో చిరునవ్వు ఎగిసిపడుతోంది.

బయటకు రమ్మన్నారు
లోపల గదిలో కూర్చొన్న నా స్నేహితులంతా బయటకు రమ్మంటూ పట్టుబట్టారు. అందరం ఫుల్ హ్యాపీగా ఉంటే నువ్వొక్కదానివే ఎందుకలా ఉన్నావంటూ అందరూ అడిగారు.

థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని
నాకూ అందరిలా థర్టి ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేయాలని ఉంది. కానీ నా గతం గుర్తొచ్చి ఒంటరిగానే ఉండాలనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్ థర్టి ఫస్ట్ నైట్ రోజు వసంత్ తన ప్రేమను వ్యక్తపరిచాడు.

మా మధ్య ఏమీ లేకున్నా
తను ఎన్నో రోజులుగా నన్ను ప్రేమిస్తున్నాడని నా మనస్సుకు తెలుసు. ఇద్దరిదీ ఒకే యూనివర్సీటి. ఇద్దరమూ వర్సిటీలో ఎమ్మెస్సీలో టాఫర్లం. మా మధ్య ఏమీ లేకున్నా క్యాంపస్ మొత్తం మా పేర్లు మారుమోగిపోయేవి.

ఎవరైనా అమ్మాయితో ఇవ్వు
తను వర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో లో ఫ్రెషర్స్ పార్టీకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మా క్లాస్ వాళ్లంతా తనను చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో కొందరు అయినా.. సోలో ఫర్ఫామెన్స్ ఏమి ఇస్తావు మామ.. బోర్ గా ఉంటుంది.. గ్రూప్ గానీ, లేదంటే ఎవరైనా అమ్మాయితోగానీ ఇవ్వు అంటూ అతన్ని రెచ్చగొట్టారు.

ఒక్క అమ్మాయి కూడా లేదా
మిగతా బ్యాచ్ ల వారంతా అమ్మాయి, అబ్బాయి కలిసి ఫర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఏం మనదాంట్లో ఒక్క అమ్మాయి కూడా లేదా అంటూ కొందరు అబ్బాయిలు గోల చేశారు. నాకు డ్యాన్స్ వస్తుందని, నేను బాగా చేస్తానని కొందరు అమ్మాయిలకు తెలుసు.

బలవంతంగా డ్యాన్స్ చేసేలా
వాళ్లంతా కలిసి నన్ను బలవంతంగా డ్యాన్స్ చేసేలా చేశారు. దాంతో వసంత్ తో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను. అలా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. యూనివర్సిటీలో సాయంత్రం చాలా లేట్ అయ్యేది.

వసంత్ తన బైక్ పై
నా ఫ్రెండ్స్ మొత్తం త్వరగా హాస్టల్ కు వెళ్లేవారు. దాంతో వసంత్ తన బైక్ పై నన్ను హాస్టల్ లో డ్రాప్ చేసేవాడు. ఇక ఫ్రెషర్స్ డే వెల్ కమ్ పార్టీ రోజు స్టేజీపై మొత్తం మా హంగామానే.

ఏదో మిస్ అవుతున్నట్లు
ఇక ఆ రోజు నుంచే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. కానీ ఆ విషయం ఇద్దరం ఎప్పుడూ చెప్పుకోలేదు. తను ఒక్క రోజు క్లాస్ కు రాకున్నా కూడా నాకు ఏదో మిస్ అవుతున్నట్లు అనిపించేది.



Click it and Unblock the Notifications
