Latest Updates
-
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
మీ రాశిని బట్టి మీ భాగస్వామి ఇతరులతో రిలేషన్ లో ఉన్నారా లేదా తెలుసుకోవచ్చు!
మీ రాశిచక్రాలను బట్టి మీరు మోసం చేస్తారా? చేయబడతారా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి చేసుకున్న ప్రతీ జంట లేదా ప్రేమలో ఉన్న వారు శృంగారాన్ని చాలా ఉత్తేజంగా ప్రారంభించాలని భావిస్తారు. అలాంటి సందర్భాల్లో వారికి ప్రతిదీ మధురానుభూతిని ఇస్తుంది.

అయితే ఇది ప్రేమించడం మరియు ప్రేమించడం యొక్క అనుభవం కంటే గొప్ప థ్రిల్ గా ఏమీ అనిపించదు. కానీ ఇదే సందర్భంలో చాలా మందిలో భావాలు.. భావోద్వేగాలు అనేవి మారుతూ ఉంటాయి.

ఈ సందర్భంలోనే చాలా మంది జంట్లో ఉత్సాహం, ఊపు అనేవి తగ్గిపోతుంటాయి. దీని వల్ల కొందరు భాగస్వాములు కోపానికి గురవుతుంటారు. కొందరు ఈ పరిస్థితిని భరించినప్పటికీ.. మరికొందరు మాత్రం తమ ప్రేమ జీవితాన్ని పెంచడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తారు లేదా వారి భాగస్వాములను మోసం చేసేంత వరకైనా వెళ్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే, ఓ వ్యక్తిగా ఇతరులతో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి జ్యోతిష్యశాస్త్రం చాలా వరకు సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు.

మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం. అందువల్ల మీ రాశిచక్రం ఆధారంగా మీ భాగస్వామి మోసం చేయగల కొన్ని మార్గాలను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో మీరే చూడండి...

మేషరాశి..
ఈ రాశి వారు సాధారణ శక్తితో నిండి ఉంటారు. వీరు భాగస్వామితో సంబంధంలో సక్రమంగా లేకపోతే, వేరొకరిని ఆకర్షించేందుకు లేదా మీ వైపు ఎవరైనా మొగ్గు చూపినా.. అందులో అవలీలగా వెళ్లే అవకాశం ఉంది. దీన్ని వీరు మోసం చేసినట్లుగా భావించకపోయినా.. వీరికి బాధ్యతా రాహిత్యం కారణంగా ఇలాంటి ఆలోచన సహజంగానే రావచ్చు.

వృషభ రాశి..
ఈ రాశి వారు చాలా మొండి పట్టుదల గలవారు. వీరు జీవితంలోకి ఎవరు వచ్చినా.. ఎక్కువరోజులు ఉండకుండా వెళ్లిపోతారనే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీరు మోసం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే వీరు ఎవరితో అయినా ప్రేమలో ఉంటే వీరు మోసం చేయొచ్చు.

మిధున రాశి..
ఈ రాశి వారికి సాహసం చేయడం అంటే ఇష్టం. వీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కూడా ఇతరులతో అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. వీరు కొత్త విషయాలను మరియు కొత్త వ్యక్తులను అన్వేషించడాన్ని బాగా ఇష్టపడతారు. అందువల్ల మీరు మీ భాగస్వామిని మోసం చేస్తారు. అయితే మీరు నమ్మకద్రోహి అని చెప్పలేము.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వీరు ఇతరులతో సంబంధం పెట్టుకోవాలని భావించరు. కానీ, వీరి సంబంధంలో ప్రేమ లేని సమయంలో వీరు ఇతరులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా మీరు మీ భాగస్వామిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారి అభిరుచులు చాలా భిన్నంగా ఉంటాయి. వీరు ఎవరికైనా రిలేషన్ షిప్ లో ఓకే చెప్పడానికైనా.. వీరు ఎవరినైనా మోసం చేయడానికైనా ఏ మాత్రం ఆలోచించరు. వీరు స్పాట్ లో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే వీరు కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు భాగస్వామిని తీవ్రంగా విమర్శించొచ్చు. అంతేకాదు భాగస్వామిలో చిన్న లోపాలను కూడా భూతద్దంలో చూసే స్వభావం కలవారు. అందువల్ల వీరు ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉంటారో.. అలాంటి వారితో రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీరు చేసేవన్నీ కరెక్టే అనే భావనలో ఉంటారు.

తుల రాశి..
ఈ రాశి వారికి రొమాన్స్ అంటే చాలా ఇష్టం. వీరు సరసాలాడటం.. చిలిపి పనులు చేయడం వంటివి ఎక్కువగా చేస్తారు. ఇలాంటి చేష్టల వల్ల ఇతరులను వీరి వైపు సులభంగా ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అయితే వీరి ప్రలోభాలను ప్రతిఘటించడం అనేది కొంత కష్టమైన పనిగా అనిపిస్తుంది.

వృశ్చికరాశి..
ఈ రాశి వారికి శారీరక సాన్నిహిత్యం చాలా ముఖ్యమైనది. వీరు ఎప్పటికప్పుడు భాగస్వామితో గొడవలు పడి, ప్రేమ మరియు ఇతర సంబంధాలకు దూరమవుతారు. దీని వల్ల వీరు నిరాశ చెందుతారు. ఇలాంటి వాటి కారణంగా వీరు భాగస్వామిని మోసం చేయాలని భావిస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సాహసం చేయడమంటే ఇష్టం. వీరు ఇతరులను ప్రలోభపెట్టడాన్ని బాగా ఇష్టపడతారు. వీరు ప్రపంచాన్ని అన్వేషించడంలో ఎప్పుడూ బిజీగా ఉంటారు. వీరు కొత్త వ్యక్తులను కలిసేందుకు ఇష్టపడతారు. వీరు ఇంట్లో భాగస్వామి ఉన్నారనే విషయాన్నే మర్చిపోతారు. కొన్నిసార్లు భాగస్వామి దూరంగా ఉన్నందున, వారిని మోసం చేయడం సరైందేనని భావిస్తారు.

మకర రాశి..
ఈ రాశి వారు తమ భాగస్వాములను మోసం చేయాలని ఎప్పుడూ భావించరు. కానీ పొరపాటున మోసం చేస్తే వీరు చాలా పశ్చాత్తాపడతారు. వీరు సంబంధం విషయంలో చాలా హేతుబద్ధతతో వ్యవహరిస్తారు. ఒకవేళ భాగస్వామిని మోసం చేస్తే దాని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా మరోసారి జరగకుండా చూసుకుంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు తమ స్నేహితులలోనే ఒకరి భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంది. వీరు ఇలా రిలేషన్ షిప్ కొనసాగించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే మీ స్నేహితుడు రహస్య ప్రేమికుడిగా మారితే మీరు ఎప్పటికీ గ్రహించలేరు.

మీన రాశి..
ఈ రాశి వారు చాలా సున్నితమైన మనసు కలవారు. అయితే వీరిని తక్కువగా అంచనా వేయలేం. వీరు కూడా భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంది. మీరు ఎల్లప్పుడూ అందమైన ప్రేమ వ్యవహారాలలో ఉన్నందున, మీ కోసం ఏవైనా అవకాశాలు మీ తలుపు తడితేనే మీరు అలాంటి ఆలోచనలు చేస్తారు.



Click it and Unblock the Notifications