For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశంలో మొట్టమొదటి వేశ్య ఎవరు? ఆమెకు ఎంత డిమాండో తెలుసా?

ఇంతకీ ఈ ఆమ్రపాలి అంటే ఎవరు? ఈమె పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? ఆమె ఎందుకు వేశ్యగా మారింది? బుద్ధుని కాలంలో ఆమె గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

|

గమనిక : ఇక్కడ మాకు దొరికిన కొన్ని కథల ఆధారంగా, ఇంటర్నెట్ లో దొరికిన సమాచారాన్ని బట్టి, మాకు ఉన్న పరిజ్ణానాన్ని బట్టి జోడించి రాసినది. ఇందులో ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశ్యంతో రాసినవి మాత్రం కాదు.

మన భారతదేశ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే ఎందరో అందగత్తెలు ఉన్నారు. పురాణాల ప్రకారం అందగత్తెలు అంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. అయితే అదంతా స్వర్గలోకంలో అని చెప్పుకునేవారు.

Amrapali - A Journey from Concubine to Celibate

మరి భూలోకంలో అయితే ఆమ్రపాలి పేరు ప్రముఖంగా వినిపించేది. ఈమె అందానికి అప్పటి రాజులు, యువరాజులు ఫిదా అయ్యేవారట. ఆమెను ఎలాగైనా పొందడానికి, ఆమె అందాన్ని సొంతం చేసుకునేందుకు ఆరోజుల్లో ఎందరో రాజులు పరితపిస్తూ ఉండేవారట.

Amrapali - A Journey from Concubine to Celibate

అలా ఓ రాజు బలవంతంగా ఆమెను వేశ్యగా మార్చేశాడంట. అయితే ఆమె అందులో నుండి విముక్తి పొంది.. మరో రాజును పెళ్లి చేసుకుందట. అయితే ఆమె అకస్మాత్తుగా సన్యాసినిగా మారిపోయిందట. అది కూడా బుద్ధుని ఉపదేశంతోనే జరిగిందట. బుద్ధుడు ఏంటి? వేశ్య అయిన ఆమ్రపాలికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ స్టోరీని చూస్తే మొత్తం సీన్ మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి...

ఓ మామిడి చెట్టు దగ్గర..

ఓ మామిడి చెట్టు దగ్గర..

ఆమె చిన్నతనంలోనే ఒక మామిడి చెట్టు కింద ఓ వ్యక్తికి దొరికిందట. ఆమెను ఇంటికి తీసుకెళ్లారట. ఆమె మామిడిచెట్టు కింద దొరికింది కాబట్టి ఆమెకు ఆమ్రపాలి అని పేరు పెట్టడం జరిగిందంట. ఈమె వైశాలి ప్రాంతానికి చెందిన యువతి అట. ఈ వైశాలి మిథ్యావి అనే క్షత్రియ వంశానికి రాజుల రాజధాని ప్రాంతం. ఈ ప్రాంతం ఆ రోజుల్లో మరాఠాలతో కలిసి ఉండేదట.

అప్పట్లో అలాంటి ఆచారం..

అప్పట్లో అలాంటి ఆచారం..

ఆ రోజుల్లోని మహిళలు ఎంత మందినైనా పెళ్లి చేసుకునే ఆచారం ఉందట. లేదా తమకు నచ్చిన మగవారితో గడపడం వంటివి చేసుకోవచ్చట. అలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్న ప్రాంతంలో ఆమ్రపాలి పెరిగి పెద్దదయ్యిందట. అలా చూస్తుండగానే ఆమె యవ్వనంలోకి వచ్చిందట.

ఆమెతో గడపాలని..

ఆమెతో గడపాలని..

అంతేకాదు అందగత్తెల్లో కూడా అగ్రగామిగా నిలిచి సంగీతం, నాట్యం వంటి రంగాలలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించిందట. ఆ ప్రాంతంలోని మహిళలందరి కంటే ఆమ్రపాలి అందంగా ఉండటంతో చాలా మంది ఈమెతో శారీరకంగా గడపాలని భావించేవారట.

ఆమ్రపాలి పెళ్లి ప్రకటన..

ఆమ్రపాలి పెళ్లి ప్రకటన..

ఒకరోజు మనురాజు ఆస్థానంలో ఆమ్రపాలి నాట్యం చేస్తున్న సమయంలో ఆమె అందానికి మనుదేవ్ ముగ్దుడయ్యాడట. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో ఉండగా, అదే సమయంలో ఆమ్రపాలి తన బాల్య మిత్రుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటిస్తుందట. దీంతో ఆయనకు షాక్ కొట్టినట్టనంత పని అవుతుందట.

పెళ్లికొడుకు తలను..

పెళ్లికొడుకు తలను..

మరి కొన్నిరోజుల్లో ఆమ్రపాలి తన బాల్య మిత్రుడు కుమార వర్మతో పెళ్లి చేసుకునే సమయానికి, మనుదేవ్ తన సైన్యంతో పెళ్లి మండపానికి వచ్చి పెళ్లికుమారుని తలను నరికేస్తాడట. ఆమ్రపాలిని నగర వేశ్యగా ప్రకటిస్తాడట. అంటే నగరంలో నివసించే వారందరితో ఆమె గడిపే అవకాశం ఉంటుందట.

ఆమెతో గడిపేవారట..

ఆమెతో గడిపేవారట..

నిస్సహాయురాలైన ఆమ్రపాలితో మొదటగా ఆ రాజు గడుపుతాడట. ఆ తర్వాత నగరంలోని భూస్వాములు, ధనవంతులు ఆమెను పొందేవారట. అందరూ తమకు ఇష్టం వచ్చినట్లు అనుభవించేవారట. అలా ఆమె ఆ ప్రాంతం మొత్తానికే వేశ్యగా మారిపోయిందట. అయితే ఆమెతో గడిపిన వారందరూ ఆమ్రపాలికి చాలా డబ్బు ఇచ్చేవారట.

ఒక్కో రాత్రికి..

ఒక్కో రాత్రికి..

రాజులు, యువరాజులు ఆమెతో ఒక్క రాత్రి గడిపినందుకు గాను 50 కబనాలను ఇచ్చేవారట. అంటే నేటి రూపాయల ప్రకారం లక్షల రూపాయల పైమాటే అంట. అంటే ఆ రోజుల్లోనే ఆమ్రపాలికి అంత డిమాండ్ ఉండేది. మగద రాజ్యానికి చెందిన బిందు సారద్యుడు అనే రాజు ఆమ్రపాలి దీనస్థితి గురించి తెలుసుకుని ఆ రాజ్యంపై దండెత్తి మనురాజును ఓడించి, ఆమ్రపాలికి విముక్తి కల్పిస్తాడట. అతను చేసిన మేలు, మంచితనం గురించి తెలుసుకున్న ఆమ్రపాలి, ఆ రాజుని ప్రేమిస్తుందట.

తొలిసారిగా ఆమ్రపాలి పెళ్లి..

తొలిసారిగా ఆమ్రపాలి పెళ్లి..

అదే విషయాన్ని ఆ రాజుకు చెప్పి అతని అంగీకారంతో తొలిసారిగా పెళ్లి చేసుకుంది. ఆమె మీద ప్రేమతో ఆమె ఏమి చెప్పినా ఆ రాజు తూచ తప్పకుండా చేసేవాడట. కొన్నిరోజులకు వారిద్దరికీ ఓ మగ బిడ్డ కూడా జన్మించాడట.

వైశాలిని బంధించినప్పుడు..

వైశాలిని బంధించినప్పుడు..

అయితే బిందు సారుడికి మొదటి భార్య కౌసల్య ఉంది. వారి కుమారుడు అజాత శత్రువుగా ఉంటాడట. కొన్నాళ్లకు బిందుసారుడు మరణించగా.. ఆమ్రపాలిని కొట్టి ఆమెను వైశాలిలో బంధిస్తారు. ఆ విషయం తెలుసుకున్న యువరాజు ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ హతమార్చి, ఆమ్రపాలిని విడిపిస్తాడు.

వేరే రాజ్యానికి ఆమ్రపాలి..

వేరే రాజ్యానికి ఆమ్రపాలి..

ఆమ్రపాలిని వేశ్యగా మార్చడం వల్లే వైశాలి మొత్తం నాశనమై కాలగర్భంలో కలిసిపోయిందని భావించేవారట. అయితే అజాత శత్రువు యువరాజే అందరినీ చంపేశాడని ఆమ్రపాలి తనపై కోపం పెంచుకుని వేరే రాజ్యానికి వెళ్లిపోతుందట.

అప్పుడు బుద్ధుడు ఎంట్రీ..

అప్పుడు బుద్ధుడు ఎంట్రీ..

అయితే అదే సమయంలో గౌతమ బుద్ధుడు వైశాలి రాజ్యానికి వచ్చి ఒక సభను ఏర్పాటు చేస్తాడట. అది తెలుసుకున్న ఆమ్రపాలి అక్కడికి వెళ్తుంది. ఆమె అక్కడికి వచ్చిన విషయాన్ని తన మనో నేత్రంతో తెలుసుకున్న బుద్ధుడు ఓ మామిడి పుత్రిక ఇటు రా అని పిలువగా, ఆమె తనని విష్ణుమూర్తి అని భావిస్తుందట. తనని తన ఇంటికి విందుకు ఆహ్వానిస్తుంది.

ఆమె ఇంటికి విందుకు..

ఆమె ఇంటికి విందుకు..

ఎంతో మంది రాజులు, భూస్వాములు, ధనవంతులు పిలిచినా వారి ఇంటికి భోజనానికి వెళ్లని బుద్ధుడు ఆమె ఇంటికి మాత్రం భోజనానికి వెళ్తాడట. దీంతో అందరూ ఆశ్చర్యపోతారట.

ప్రశాంతత కావాలంటే..

ప్రశాంతత కావాలంటే..

తన ఇంటికి వచ్చిన బుద్ధుడికి తనకు శాంతి,ప్రశాంతత కావాలంటే ఏమి చేయాలని అని అడుగుతుందట. ప్రపంచాన్ని ప్రపంచంలా చూసి, దాన్ని ధరించే ప్రయత్నం చేస్తే నీకు శాంతి లభిస్తుందని చెబుతాడట. నిత్యం నిజాయితీగా ఉండి నా మార్గంలో పయనించు అని చెబుతాడట.

తన ఆస్తులన్నీ పనివారికి..

తన ఆస్తులన్నీ పనివారికి..

దీంతో తన ఆస్తులన్నింటినీ తన పని వారికిచ్చేసి, ఆమె బుద్ధుని మార్గంలో పయనిస్తూ.. కొన్ని రోజులకు తన తనువు చాలిస్తుందట. ఇదండీ ఆమ్రపాలి వేశ్యగా మారి.. ఆ తర్వాత వివాహితగా మారి చివరాఖరికి సన్యాసినిగా మారి తన జీవితాన్ని ముగించేసింది.

English summary

Amrapali - A Journey from Concubine to Celibate

Here We talking about amrapali - a journey from concubine to celibate. Read on
Story first published:Wednesday, April 15, 2020, 13:09 [IST]
Desktop Bottom Promotion