Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మగాళ్ల గురించి ఈ ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసా...
మీ జీవితంలో మీరు కలుసుకునే వేర్వేరు రకాల పురుషుల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
మనం పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యేంత వరకు ఎంతో మంది వ్యక్తులను కలుస్తాం. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రభావాన్ని మనపై చూపుతారు. ముఖ్యంగా ప్రేమ మరియు డేటింగ్ విషయంలో చాలా మంది పురుషులు వేర్వేరు అభిప్రాయాలను కలిగి ఉంటారు.

వారి ఆలోచనలు, అభిరుచుల వల్ల కొందరి జీవితాలు ప్రభావితమవుతాయి. ప్రతి ఒక్క వ్యక్తి అందమైన వ్యక్తిత్వం నుండి భయంకరమైన వ్యక్తిత్వం వరకు ప్రత్యేకంగానే ఉంటారు. కొందరు తమకు నచ్చిన వారితో అందరికంటే ఎక్కువగా నమ్మే వారితో అన్ని విషయాలను షేర్ చేసుకుంటారు.

మరికొందరు తమలోనే అన్నిరహస్యాలను దాచుకుంటారు. అయితే కొన్ని రహస్యాలను ఎదుటి వారితో షేర్ చేసుకోవడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుంది. కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం వల్ల మనసులోని ఉన్న భారం కొంతైనా తగ్గుతుంది.

ఈ నేపథ్యంలో రహస్యాలు మాత్రమే కాదు.. ఆ కార్యం గురించి కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో మీ జీవితంలో కలిసే అత్యంత సాధారణ రకమైన పరుషులు ఎలా ఆలోచిస్తారు.. ఏమి ఆలోచిస్తారనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రాక్టికల్ గా ఉంటారు..
చాలా మంది మగవారు చాలా విషయాల్లో ప్రాక్టికల్ గానే ఉండాలని ఆశిస్తారు. అయితే లైంగిక జీవితంలో మాత్రం ఎప్పుడూ ఊహాలోకంలోనే విహరిస్తుంటారు. యవ్వనంలో తమకిష్టమైన వారితో ఆ కార్యంలో పాల్గొన్నట్టు.. పోర్న్ సినిమాల్లో చూసిన యాంగిల్స్ ట్రై చేస్తున్నట్టు రకరకాల కలలు కంటూ ఉంటారు.

ఆనందపు అంచులను..
కొన్ని కలల గురించి వారు ఎవ్వరితోనూ ఎటువంటి సమయంలో కూడా షేర్ చేసుకోకూడదని భావిస్తారు. అయితే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి, కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక మాత్రం ప్రతి మగాడిలోనూ ఉంటుంది. అంతేకాదు తమ భాగస్వామికి కూడా అలాంటి కోరికలు ఉండాలనే వారు ఎక్కువగా ఆశిస్తారు. మీకు కూడా అలాంటి ఆలోచనే ఉంటే చాలు.. మీరిద్దరూ కలిసి కొత్త ప్రపంచాన్ని అన్వేషించొచ్చు. ఆనందపు అంచుల దాకా వెళ్లొచ్చు.

కోరికలే కారణం..
ఏ ఒక్క మగాడు ఆ కార్యాన్ని ఒకేలా చేయాలని కోరుకోరు. అందుకే కొన్నిసార్లు సున్నితంగా చేస్తే.. మరికొన్ని సార్లు మాత్రం రఫ్ గా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో నొప్పి కలిగినా కూడా అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. మరికొన్నిసార్లు ఎదుటి వారి ప్రమేయం లేకుండానే ఆ కార్యంలో దూకుడు కొనసాగిస్తారు. దీనంతటికీ వారి మనసులో గూడు కట్టుకున్న కోరికలే కారణమని చెప్పొచ్చు.

ఎక్కువ సేపు..
చాలా మంది పురుషులు తాము ఆ కార్యంలో పాల్గొనే సమయంలో ఎక్కువసేపు బెడ్ పై ఉండాలని.. రతి క్రీడలో గంటలకొద్దీ మునిగి తేలాలని ఆశపడుతుంటారు. కానీ వాస్తవ జీవితంలో అందుకున్న భిన్నంగా ప్రవర్తిస్తారు. అయితే కొంతకాలం తర్వాత వారు అనుకున్నది సాధిస్తారు. తమకు కావాల్సిన ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు.

ఎల్లప్పుడూ అదే ధ్యాస..
కొందరు మగాళ్లకు ఎల్లప్పుడూ దానిపైనే ధ్యాస ఉంటుంది. అది పగలైనా.. రాత్రైనా సరే. వారు కాస్త అలసిపోయారని భావిస్తే చాలు.. ఆ కార్యంలో పాల్గొనాలని ఆరాటపడుతుంటారు. ఎందుకంటే వారికి రతి క్రీడ అనేది ఒక వాహకంగా పనిచేస్తుందని భావిస్తారు. ఒత్తిడి తగ్గిపోయి రిఫ్రెష్ అవుతామని భావిస్తారు.

బాడీ షేప్..
చాలా మంది మగవారు బాడీ షేప్ లపై బాగా ఆసక్తి చూపుతారు. అయితే తమ శరీరాన్ని చూసి మీరెలా ఫీలవుతున్నారో తెలుసుకోవడానికి తెగ ఆరాట పడతారు. అంతేకాదు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు కూడా మిమ్మల్ని పూర్తిగా సుఖ పెడుతున్నారా? లేదా? అనే విషయాన్ని చెప్పాలని కోరుకుంటారు.

ఆత్మవిశ్వాసంతో ఉంటారు..
చాలా మంది మగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దీని వల్ల వారికీ సెక్సీ లుక్ వస్తుంది. చాలా మంది మహిళలు తమ శరీరం లావుగా ఉందనో లేదా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయనో వాటిని ఇష్టపడరు. కానీ తమ భాగస్వామి లైంగిక కార్యం విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రతి ఒక్క మగాడు కోరుకుంటారు.



Click it and Unblock the Notifications
