Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అతను 30 ఏళ్లుగా వధువు దుస్తుల్లోనే... కారణం తెలిస్తే షాకవుతారు...!
యుపికి చెందిన ఓ వ్యక్తి 30 ఏళ్లుగా వధువు దుస్తులనే వేసుకుంటున్నాడు. కారణం తెలిస్తే షాకవుతారు...!
సాధారణంగా అమ్మాయిల బట్టలు వేసుకోవడానికి అబ్బాయిలు అస్సలు ఇష్టపడరు. కానీ అమ్మాయిలు అబ్బాయిల దుస్తులను సులభంగా వాడుతూ ఉంటారు.

అయితే అమ్మాయిల డ్రస్సులను ఎక్కువగా కొందరు పురుషులు వాడుతూ ఉంటారు. అయితే ఇదంతా రియల్ లైఫ్ లో కాదులేండి. అదంతా రీల్ లైఫ్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి కామెడీ షోల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి మనల్ని తెగ నవ్విస్తాయి కూడా. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ప్రతిరోజూ తనకు తాను కొత్త పెళ్లికూతురిలా మేకప్ చేసుకుని తిరిగేస్తుంటాడు.

ఇతను ఎందుకు చేస్తున్నాడనే వివరాలు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇందుకు తను చెప్పే కారణాలు తెలిస్తే అవునా.. ఇది నిజమా అని ముక్కున వేలేసుకుంటారు... ఇలాంటి వింత సంఘటన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

30 ఏళ్లుగా..
ఉత్తరప్రదేశ్ లోని హౌజ్ ఖాస్ లోని జలాల్ పూర్ గ్రామంలో నివాసముంటున్న చింతహరణ్ చౌహాన్ కు ఆరు పదుల వయసు దాటింది. ఈయన ఒకటి కాదు.. రెండు కాదు. ముచ్చటగా 30 సంవత్సరాల నుండి కొత్త పెళ్లికూతరిలా మేకప్ చేసుకుంటున్నాడు.

కొన్ని విచిత్ర సంఘటనలు..
అయితే అతను అందమైన అమ్మాయిగా మారి, చీర కట్టుకుని.. మేకప్ వేసుకుని తిరిగేందుకు బలమైన కారణం ఉందట. తను అలా తయారయ్యేందుకు కొన్ని భయంకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయట.

తొలి భార్య చనిపోయాక..
తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తొలి భార్య చనిపోయిందట. ఆ తర్వాత అతను పశ్చిమబెంగాల్ లోని దినాజ్పూర్ లో ఇటుకలో బట్టీలో పని చేసేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ ఓ షాపు ఓనర్ తో పరిచయం అవ్వగా.. అతను తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు.

కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో..
అయితే ఈ పెళ్లికి చౌహాన్ కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. దీంతో అతను ఉత్తరప్రదేశ్ ను వదిలిపెట్టి సొంత ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఈ మోసాన్ని తట్టుకోలేక తను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం సరిగ్గా సంవత్సరం తర్వాత చౌహాన్ కు తెలిసింది.

ముచ్చటగా మూడో పెళ్లి..
అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడితో చౌహాన్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటి నుండే అతనికి భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయట. తను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడంట. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు.

ఓ రోజు కలలో..
అయితే ఓ రోజూ తన రెండో భార్య(బెంగాలీ) కలలోకి వచ్చి వారి మరణానికి కారణం తనేనని, నన్ను మోసం చేయడం వల్లే తాను చనిపోయాయనని చెప్పి ఏడ్చిందట. దీంతో ఆమెను క్షమించాలని వేడుకొనగా.. ఆమె పెళ్లి కూతురు దుస్తులు వేసుకుని నాతో ఉండాలని కోరిందని చెప్పాడు.

అప్పటి నుండి..
అలా అప్పటి నుండి నేను వధువు దుస్తులు వేసుకుని ఉంటున్నా. ఆరోజు నుండి తన ఆరోగ్యం బాగుపడిందట. అంతేకాదు కుటుంబంలో మరణాలు కూడా ఆగిపోయాయంట. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం నుండి బయటపడ్డారట.

అంతా నవ్వుకుంటారు..
‘నన్ను ఇలా పెళ్లి కూతురి దుస్తుల్లో చూసి అందరూ నవ్వుకుంటారు. కానీ, కుటుంబం కోసమే నేను ఇలా చేశాను. వారిని కాపాడటం కోసమే నేను ఈ దుస్తులను వేసుకుంటున్నాను' అని వివరించాడు.



Click it and Unblock the Notifications
