For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఫస్ట్ డేటింగుకే రెడ్ సిగ్నల్స్ ఎందుకు వస్తాయో తెలుసా..

|

మీరు కొత్తగా డేటింగ్ చేయాలనుకుంటున్నారా? డేటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారా? అక్కడికి ఎప్పుడు వెళ్లాలి.. ఎలా వెళ్లాలి.. ఏ దుస్తులు ధరించాలో ముందే నిర్ణయించుకున్నారా? స్నేహితుల నుండి సలహాలు కూడా తీసుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలను మరచిపోతే డేటింగ్ ఆగిపోవచ్చు. ఎందుకంటే అవి డేటింగుకు సంబంధించిన విషయాలను అంతలా గందరగోళానికి గురి చేస్తాయి. అందుకే మీరు ముందుగానే రిహార్సల్ చేయాలి. అప్పుడే ఎలాంటి గందరగోళం ఉండదు. లేకపోతే ప్రతి ఒక్క అవకాశమూ చేజారిపోయే అవకాశం ఉంది. ఇంతకీ మీ డేటింగుకు రెడ్ సిగ్నల్స్ వేసే విషయాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ విషయాలు చాలా తీవ్రంగా అనిపించకపోయినా వీటి వల్ల మీ ప్రియుడు/ప్రియురాలిని ఏ సమయంలోనైనా మీకు రెడ్ సిగ్నల్ ఎదురుకావచ్చు.

ముక్కుతో ముగిసిపోయే ప్రమాదం..

మనలో చాలా మంది స్నానం చేసేటప్పుడు లేదా రెస్ట్ రూమ్ ఉపయోగిస్తున్నప్పుడు ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అదేమీ చెడ్డ విషయం కాదు. కానీ మీరు డేటింగుకు వెళ్లిన సమయంలో కూడా ఇలానే చేస్తే మీ భాగస్వామి దాన్ని అస్యహించుకుంటారు. దీన్ని బట్టి మీకు కనీస మర్యాద గురించి కూడా తెలియదని అనుకుంటారు. అందుకే అప్రమత్తంగా ఉండండి..

దుర్వాసన వచ్చే సాక్స్ ధరించడం..

మీరు డేటింగుకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దుర్వాసన వచ్చే సాక్సులను ధరించకండి. ఎందుకంటే మీ డేటింగు అర్ధాంతరంగా ఆగిపోతుంది. మీతోటి వ్యక్తి అవతలి వైపు కూర్చున్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అతను లేదా ఆమె మీ సాక్సు నుండి వచ్చే దుర్వాసన వల్ల మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ముందుగానే మీరు మీ పాదాలను సరిగ్గా శుభ్రపరిచారని నిర్ధారించుకోండి. చెమటతో నిండిన సాక్సుల స్థానంలో శుభ్రమైన వాటిని చేర్చి మీ డేటింగును ఎంజాయ్ చేయండి.

తేపు మరియు పిత్తు..

మనం ఏదైనా ఆహారం తిన్నాక తేపులు రావడం అనేది సహజం. కొన్ని సందర్భాల్లో పిత్తులు కూడా వస్తుంటాయి. ఇవి మీ డేటింగును సర్వనాశనం చేసేస్తాయి. ఇది మీ డేటింగుకు బాగా ఇబ్బందిరకంగా ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అజీర్ణ సమస్యలను కలిగి ఉన్నందుకు అతను లేదా ఆమె మిమ్మల్ని సులభంగా గ్రహిస్తారు కాబట్టి డేటింగుకు వెళ్లే ముందు మీరు తినేదాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

దురదతో పెద్ద ఆపద..

మీకు దురద ఉండి ఉంటే అది ఒక సంచలనం కావచ్చు. మీరు డేటింగుకు వెళ్లినప్పుడు మీరు మీ చేతులను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, బట్టలలోపల చేయిని చొప్పించకుండా ఉండాలి. మీరు ఒకవేళ అలా చేస్తే మీరు పరిశుభ్రంగా ఉండరని లేదా మీరు ఆరోజు స్నానం చేయలేదని అనుకోవచ్చు. అందువల్ల మీరు డేటింగుకు వెళ్లేటప్పుడు సరిగ్గా స్నానం చేశారని నిర్ధారించుకోండి. దురదను నివారించడానికి కొన్ని లోషన్లు లేదా టాల్కమ్ వేయండి. అలాగే మీరు డేటింగులో ఉన్నప్పుడు మీ చేతులను నియంత్రించండి.

ఏదైనా ఆహారాన్ని బిగ్గరగా నమలడం..

మీరు డేటింగులో ఉన్న సమయంలో మీ ఆహారాన్ని నమిలేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ తినకుండా ఉండేలా చూసుకోండి. ఇది మీ భాగస్వామికి చాలా చిరాకుగా అనిపిస్తుంది. అంతేకాదు ఇది మీ భాగస్వామికి కోపం తెప్పిస్తుంది. అటువంటి పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎటువంటి శబ్దాన్ని ఉత్పత్తి చేయకుండా తినడం సాధన చేయండి. ఇది మిమ్మల్ని ఇబ్బంది నుండి కూడా కాపాడుతుంది.

నిరంతరం దగ్గడం..

మీరు డేటింగుకు వెళ్లిన సమయంలో మీరు నిరంతరం దగ్గుతూ ఉండటం మరియు ఉమ్మడం వంటివి చేస్తే మీ భాగస్వామికి చాలా అసహ్యకరంగా అనిపించవచ్చు. మీరు అనారోగ్యంతో మరియు నిరంతరం దగ్గుతూ ఉంటే అలాంటి సమయంలో డేటింగుకు వెళ్లకండి. మీ డేటింగు వాయిదా వేసుకోండి. లేదా మీరు డేటింగుకు ప్లాన్ చేసుకునే ముందు నుండే ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి.

ఊరికే ఉమ్మి వేయడం..

మీరు డేటింగులో ఉన్నప్పుడు మీరు మీ భాగస్వామితో ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు మీరు తరచూగా ఉమ్మివేస్తూ ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఇది చాలా మొరటుగా ఉంటుంది. ఈ దెబ్బతో మీతో డేటింగుకు వచ్చిన మీ భాగస్వామి కచ్చితంగా పారిపోతారు.అందుకే మీ నోటి ఉమ్మివేయడం తరచుగా వస్తుంటే దానిపై జాగ్రత్తలు తీసుకోండి లేదా డాక్టర్ సహాయం తీసుకోండి. ఇలాంటప్పుడు మీరు మీ భాగస్వామితో మాట్లాడుతున్నప్పుడు నెమ్మదిగా మరియు ప్రశాంతంగా మాట్లాడాలని నిర్ధారించుకోండి. మాట్లాడేటప్పుడు ఉమ్మివేయకుండా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది.

ఫోన్ లో బిజీగా ఉండటం..

మీరు డేటింగుకు వెళ్లిన సమయంలో మీ భాగస్వామిని కనుగొనడానికి మీకు ఫోన్ కచ్చితంగా సహాయం చేస్తుంది. అంతమాత్రాన మీరు నిత్యం ఫోన్ లో బిజీగా ఉంటే మీరు మీ భాగస్వామిని విస్మరించినట్టు అనిపించవచ్చు. ఇది కూడా మీ డేటింగును నాశనం చేయవచ్చు. అందుకే మీ ఫోన్ ను ముందుగానే పరిశీలించి మెసెజ్ లకు రిప్లయ్ ఇవ్వడానికి బదులుగా, మీ డేటింగును అస్వాదించడం కోసం ఏమి చేయాలో ఆలోచించండి.

అతిగా తాగడం..

మీ భాగస్వామి మీకు ఏదైనా పానీయం ఇస్తే మీరు అతి తాగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇది మీపై నియంత్రణ కోల్పోయేలా అస్సలు ప్రవర్తించకూడదు. అలాగే మద్యం వంటి వాటి జోలికి అలాంటి సమయంలో వెళ్లకపోవడమే మంచిది.

మీరు డేటింగుకు ప్లాన్ చేసినప్పుడు ఈ అవసరమైన చిట్కాలను గుర్తుంచుకుంటారని ఆశిస్తునా్నం. అలాగే మీరు మీ భాగస్వామితో సరదాగా సమయాన్ని గడపాలని, అద్భుతమైన సమయాన్ని పొందాలని ఆశిస్తున్నాం.

English summary

First Date Red Flags That Can Ruin Your Date

Finally, you are all set to go on a date with the person you have been talking to after you right-swiped him or her on a dating app. You must be deciding what to wear, taking advice from friends and rehearsing the things you will be saying to your date so that you don't end up messing things up. Else everything might get spoiled.
Story first published: Saturday, October 26, 2019, 16:17 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more