Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.!
మగవారితో సరసాలాడేందుకు మగువలు ఎలాంటి సంకేతాలిస్తారంటే...!
ఆమె మీతో సరసాలాడుతోంది అనేందుకు గల సంకేతాలేంటో తెలుసుకోండి.
ఈ ప్రపంచంలో ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే.. ఆమెను ఆకట్టుకోవడానికి ఎన్నో మార్గాలుంటే అన్నింటినీ ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా తనకు ఆమె నచ్చిందనే విషయాన్నే తెలిపేందుకు కొన్ని సంకేతాలను కూడా ఇస్తాడు.

ఇలాంటి ప్రవర్తనను కొందరు సరసాలాడుట(Flirting) అని కూడా పిలుస్తారు. అయితే ఇలాంటి జాబితాలో అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఏమి తక్కువగా లేరు. ఆడవారు ఎవరినైనా ఇష్టపడితే, వారు వారి బాడీ లాంగ్వేజ్ మరియు వారి ప్రవర్తనను బట్టి తమ విషయాలను వ్యక్తం చేయగలరు.

ఒక అమ్మాయి అబ్బాయిని ఇష్టపడితే కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ విషయం ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అయితే మీతో కొన్ని సందర్భాల్లో సరసాలాడటానికి కూడా ఆసక్తి చూపుతుంది. అందులో కొన్ని సంకేతాలు ఇక్కడున్నాయి... అవేంటో చూసేయండి మరి...

క్లోజ్ గా మాట్లాడేందుకు..
ఎవరైనా అబ్బాయిని ఓ అమ్మాయి ఇష్టపడిందంటే చాలు.. ఆ క్షణం నుండి ప్రతి నిమిషం తనతో మాట్లాడేందుకు.. తన గురించి ఏవేవో విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు.

పదే పదే జుట్టును..
ఓ అమ్మాయి తమకు ఇష్టమైన అబ్బాయితో మాట్లాడేటప్పుడు పదే పదే తన జట్టును సరి చేసుకుంటూ ఉంటే.. తన వేళ్లతో జుట్టుతో ఆటలాడుతుంటే.. లేదా ఆమె జుట్టును కలుపుకుంటూ ఉంటే, మీరు వారిని గమనిస్తున్నారా? లేదా వారిని కనీసం చూస్తున్నారా లేదా అనేందుకు ఒక సంకేతం. అలా ఆమె మీతో మాట్లాడటానికి ఆసక్తి చూపుతుంది.

కళ్లతోనే మాటలు..
ఒక అమ్మాయి ఎవరినైనా ఇష్టపడినప్పుడు కేవలం పెదాలతోనే కాదు.. కళ్లతోనూ మాట్లాడే శక్తి ఉంటుంది. వారు ఎవరినైనా ఇష్టపడినప్పుడు లేదా సరసాలాడుతున్నప్పుడు వారి కళ్లు బాగా మాట్లాడుకుంటాయి.

చిరునవ్వును దాచుకోలేరు..
ఓ అమ్మాయి తను ఇష్టపడిన వ్యక్తి ఎదురుపడినప్పుడు.. తన చిరునవ్వును అస్సలు ఆపుకోలేదు. మీరు వారిని చూసిన ప్రతిసారీ ఆమె ముఖంలో చిరునవ్వుతో పాటు కోటి కాంతుల వెలుగును కూడా చూడొచ్చు.

డ్రస్సింగ్ స్టైల్..
ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే.. వారిని ఆకట్టుకోవడానికి ఏ చిన్న అవకాశం ఉన్న అస్సలు వదులుకోరు. అదే సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోరు. ముఖ్యంగా ఆమె మీ ముందు వచ్చే ప్రతిసారీ అందమైన దుస్తులను ధరించి.. తన డ్రస్సింగ్ స్టైల్ తో మిమ్మల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తే.. ఆమె మీతో సరసాలాడేందుకు సిద్ధంగా అర్థం చేసుకోండి.

స్వరాకర్షణ..
ఈ లోకంలో చాలా మంది అమ్మాయిలు సరసాలాడటంలో మాంచి నిపుణులుగా ఉంటారు. ముఖ్యంగా వారి స్వరాన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఆమె తన గొంతును ఆకర్షణను పెంచే విధంగా మాడ్యులేట్ చేస్తారు.

టచ్ ఫీల్..
ఒక అమ్మాయి అనుకోకుండా లేదా ఉద్దేశ్యపూర్వకంగా మీ చేయి లేదా భుజంపై చేయి వేస్తే, అది ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందనే దానికి ప్రత్యక్ష సంకేతం.



Click it and Unblock the Notifications