Latest Updates
-
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026
ఈరోజుల్లో కూడా ఆత్మలు ఉన్నాయా? వాటితో శృంగారం సాధ్యమేనా?
కొంతమంది తమను ప్రేమించే వారు అకస్మాత్తుగా మరణిస్తే పూర్తిగా నిరాశలో మునిగిపోతారు. ఆ సంఘటనను మరచిపోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు.
ప్రస్తుత సమాజంలో ప్రేమ అంటే కొన్ని రోజులు కలిసి ఉంటం.. తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమ పేరుతో చేయరాని పనులు ఎన్నో చేస్తున్నారు. మరికొందరేమో ప్రేమ పేరుతో మోసాలు చేస్తూనే ఉన్నారు. చాలా మంది మోసపోతూనే ఉన్నారు. కోరికల మోజు తీరిపోయాక కాలితో తన్నేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇలాంటి ప్రేమ విషయాల్లో ఎక్కువగా అమ్మాయిలే మోసపోతుంటారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే అమ్మాయిలందరూ మోసగాళ్లనే నమ్ముతున్నారు. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని బాధపడుతున్నారు.

అయితే నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలను మాత్రం కొందరు అమ్మాయిలు మోసం చేస్తున్నారు. ఈరోజుల్లో ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని ఇప్పటికే మనం చాలా చూశాం. చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఓ యువతికి వింత అనుభవం ఎదురైంది. ఆమె ఎవరి చేతిలో మోసపోలేదు. అలా అనీ ఎవ్వరినీ మోసం చేయలేదు. తన బాయ్ ఫ్రెండ్ మధ్యలోనే మరణించడమే అన్యాయంగా భావించింది.

సాధారణంగా ఎవరైనా తన ప్రియుడు చనిపోతే ఏమి చేస్తారు. కొద్ది రోజు బాధపడతారు. లేదా మరొకరిని వివాహం చేసుకుంటారు. అదీ కాదంటే వివాహం సైతం చేసుకోకుండా జీవితాంతం వారినే తలచుకుంటూ గడిపేవాళ్లు కూడా ఉన్నారు. కానీ అందుకే అతడిని మరచిపోలేక పోయింది. తననే తలచుకుంటూ తన ఆత్మతో గడపడం మొదలు పెట్టింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు అలా చేసింది? ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గాఢమైన ప్రేమ..
కొంతమంది తమను ప్రేమించే వారు అకస్మాత్తుగా మరణిస్తే పూర్తిగా నిరాశలో మునిగిపోతారు. ఆ సంఘటనను మరచిపోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ అది అంత సులభం కాదు.. కానీ న్యూజిలాండ్ కు చెందిన సిమోన్ అనే యువతి ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించింది.

అకస్మాత్తుగా బాయ్ ఫ్రెండ్ మరణం..
కాలమే వీరిద్దరిని చూసి అసూయపడేంతగా ప్రేమించుకున్నారు. వీరు ప్రేమలో ఉన్నప్పుడే అందరిలాగే వీరి మనసులు కలసిపోయాయి. అలాగే రిలేషన్ షిప్ లో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. ఇద్దరు శారీరక సంబంధాలను సైతం పెట్టుకుని తనివి తీరా ఆనందం పొందేవారు. అయితే ఇలాంటి సమయంలో ఆ యువతికి ఎవ్వరికీ రాకూడని పెద్ద కష్టం వచ్చింది. రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలోనే తన బాయ్ ఫ్రెండ్ తనను విడిచి అకస్మాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.

ఆత్మతో సంసారం..
అప్పటి నుండి ఆ అమ్మాయి అందరిలా తన బాయ్ ఫ్రెండ్ ని మరచిపోలేదు. ఏకంగా తన ఆత్మతో సంసారం చేయడం మొదలుపెట్టింది. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది వాస్తవం. ఎందుకంటే ఈ విషయాన్నే ఆ యువతే స్వయంగా చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్ చనిపోయినప్పటికీ అతను ఆత్మ రూపంలో తన దగ్గరికి వచ్చి రొమాన్స్ చేసేవాడట.

ఆత్మతోనే పిల్లలకు జన్మ?
ఇంకా ఆ అమ్మాయి ఏమి చెప్పిందంటే అదే ఆత్మ ద్వారా తాను పిల్లలకు జన్మనివ్వాలని అనుకుంటున్నట్లు వివరించందట. ఇది విన్న వారందరూ ఇదంతా తన భ్రమ అని, ఏదో కలలు అని చెప్తే,ఆ యువతి ఇలా బదులుచ్చిందట. ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు అది నిజమా కాదా అనేది తనకు తెలియదా? అని చెబుతోందట.

తన మీద బరువుగా.
తను నిద్రపోయిన సమయంలో తన శరీరం మీద బరువుగా అనిపిస్తుందంట. తర్వాత ఆ ఘట్టంలో పాల్గొంటారట. అనంతరం తాను భావప్రాప్తికి లోను అవుతాను అని చెప్పింది. అది తన బాయ్ ఫ్రెండ్ ఆత్మే అని ఆమె నమ్ముతోందట.

ఇదే మొదటిది కాదు..
అయితే ఇది మొదటిది ఏమి కాదు. ఎందుకంటే గతంలో కూడా ఓ మహిళ కూడా ఇలాగే తను వందల ఆత్మలతో రొమాన్స్ చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇటీవలే ఆస్ట్రేలియాలోని ఓ మహిళ కూడా ఆత్మతో బంధం ఏర్పరచుకున్నట్లు తెలిపింది.

ఇది నిజమేనా?
వీరందరిది పిచ్చితనమో లేదా ఊహాగానాలో ఎవ్వరికి అర్థం కావడం లేదు. చాలా మంది ఇది నిజం కాదంటున్నారు. మీరు ఇదంతా చూశారు కదా. ఆత్మలతో ఆ కార్యంలో పాల్గొన్నామని చెబుతున్న వారి గురించి మీరు ఏమంటారో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలరు.



Click it and Unblock the Notifications