Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
Happy Rose Day 2023:రోజ్ డే సందర్భంగా మీ ప్రియమైన వారిని ఈ సందేశాలతో సర్ ప్రైజ్ చేసేయ్యండి...
Happy Rose day ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా రొమాంటిక్ వాతావరణం ప్రారంభమవుతుంది. ఈ సమయాన్ని అందుకే ప్రేమికుల మాసంగా పిలుస్తారు. ఈ సమయం కోసం ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

ఎందుకంటే ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ పండుగ మొత్తం ఏడు రోజుల పాటు ఉంటుంది. ఈ ఏడు రోజులు ఏడు వింతల్లా పండుగను జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 7వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో చాలా మంది జంటలు ఒకరికొకరు గులాబీ(Rose) పువ్వులను ఇచ్చిపుచ్చుకోవడంతో తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఈ పాటికే ప్రేమలో ఉన్నవారంతా తమ భాగస్వాములకు గులాబీ పూలు ఇస్తుంటారు.

అయితే మీ ప్రియమైన వారికి ఈ ఏడురోజుల పాటు ఏ కలర్ పువ్వులు ఇస్తే బాగుంటుంది.. అవి దేనికి నిదర్శనమో తెలుసుకోవాలి. ఉదాహరణకు రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ప్రేమకు నిదర్శనంగా.. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఫ్రెండ్ షిప్ కు గుర్తుగా ఉంటాయి.

కాబట్టి మీరు లవ్ చేసే వ్యక్తికి ఏ కలర్ రోజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకోండి. వీటితో పాటు మీ ప్రియమైన వారి మనసు దోచే కోట్స్, మెసెజెస్, ఇమెజెస్ ను పంపండి. వారిని సర్ ప్రైజ్ చేయొచ్చు. అలాంటి వాటిలో ముఖ్యమైన వాటిని మీ కోసం అందిస్తున్నాం. దీనిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.. మీ ప్రియమైన వారికి షేర్ చేసేయ్యండి..

మాటల్లో చెప్పలేనిది ప్రేమ..
మనం మాటల్లో చెప్పలేని దానిని గులాబీ పువ్వులు వ్యక్తపరుస్తాయి. అలాంటి రోజాను ప్రేమతో నీకు ఇచ్చేస్తున్నాను.
హ్యాపీ రోజ్ డే

నా ప్రేమకు గుర్తుగా..
ప్రతిరోజూ వందలాది గులాబీ పువ్వులు అందివ్వలేను..
కానీ ప్రతిరోజూ నిన్ను మాత్రం కచ్చితంగా ప్రేమిస్తాను..
అయితే రోజా లేకుండా నా ప్రేమను వ్యక్తం చేయలేను..
I Love You So Much
హ్యాపీ రోజ్ డే

బంధం నిలిచి ఉండాలి..
నేను నీకు అందమైన ఫ్లవర్ బొకే పంపినప్పుడు..
అందులో ఓ ప్లాస్టిక్ పువ్వుని కూడా పెట్టి ఇచ్చేస్తా..
ఎందుకంటే ఆ ప్లాస్టిక్ పువ్వు కూడా పూర్తిగా
వాడిపోయే వరకూ మనం బంధం నిలిచి ఉండాలని..
హ్యాపీ రోజ్ డే...

గులాబీ మాత్రమే..
ప్రతి పక్షి నాట్యం చేయలేదు..
కానీ నెమలి మాత్రం కచ్చితంగా చేస్తుంది..
ప్రతి స్నేహితుడు నా మనసులో స్థానం సంపాదించలేడు..
కానీ.. నువ్వు మాత్రం సంపాదించవు..
ప్రతి పువ్వు ప్రేమను తెలపలేదు..
కానీ, గులాబీ పువ్వు మాత్రమే తెలుపగలదు.
హ్యాపీ రోజ్ డే

మనలోని భావాలు..
పువ్వులు చాలా సున్నితమైనవి.. సుకుమారమైనవి..
వాటిని చేతులతో అస్సలు తాకొద్దు..
అలాగే మనలోని భావాలు కూడా చాలా సున్నితమైనవి..
వాటిని అసభ్యపదజాలంతో ఇబ్బందిపెట్టొద్దు..
హ్యాపీ రోజ్ డే

అలాంటి క్షణం..
మనం పసుపు రోజా పూల నుండి ఎరుపు రంగులోకి మారితే దానికన్నా మధురమైన క్షణం నాకు ఇంకొకటి ఉండదు. ఎందుకంటే మన స్నేహం నుండి ప్రేమగా మారాలని మనసారా కోరుకుంటున్నా..
హ్యాపీ రోజ్ డే

రోజ్(ROSE)అంటే..
Rarely - R
Ones - O
Supporting - S
Entire Life - L
నా మొత్తం జీవితంలో అరుదైన జాతివి నువ్వు..
హ్యాపీ రోజ్ డే

మనం పువ్వులైతే..
మనం వజ్రాలమైతే నువ్వు నా కోహినూర్..
మనం ఆకాశమైతే నువ్వే నా చందమామ..
మనం పువ్వులమైతే నువ్వే నా రోజా..
భూలోకంలో స్వర్గం ఉంటే అది నీతోనే..
ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్..
హ్యాపీ రోజ్ డే



Click it and Unblock the Notifications