Latest Updates
-
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ ఏడు విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే...!
మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. ముందుగా ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!
వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి పెళ్లితో ప్రతి ఒక్కరూ మరో వ్యక్తితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని.. తమ భవిష్యత్తును ఎంతో సంతోషంగా గడపాలని ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.

అయితే జీవితంలో మనకు ఎప్పటికీ సుఖం, ఆనందం అనేవి శాశ్వతం కాదు.. జీవితం మాదిరిగానే, పెళ్లిలో చేదు సంఘటనలు మరియు పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొందరికి తమ భాగస్వామి యొక్క సాన్నిహిత్యం సంతోషాన్ని కలిగించవచ్చు.

ఇంకా కొంతమందికి పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు ప్లాన్ ప్రకారం జరగకపోతే, కొందరు చాలా నిరాశ చెందుతారు. ఇంకా కొంతమంది ఆనందం కోసమే పెళ్లిని చేసుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఆనందం కోసమే పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మీరు ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

అయితే మీరు వివాహం నుండి చాలా ఆశించి.. కళ్యాణం అనే ఆనందపు కొలనులోకి అడుగు పెట్టడం సరైందే అని మీరు భావిస్తే, మీరు ముందుగా ఈ కఠినమైన వాస్తవాలను కూడా తెలుసుకోవాలి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

హనీమూన్ దశ త్వరలో ముగుస్తుంది
మీ రొమాంటిక్ జీవితం ఎంతో అందంగా ప్రారంభమైనప్పటికీ, అది మీ వివాహమైన తర్వాత జీవితాంతం అలాగే ఉంటుందని మాత్రం అర్థం కాదు. మీరు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. అయితే ఉత్సాహం మరియు థ్రిల్ మాత్రం ఎప్పటికీ ఉంటాయి. కానీ కాలక్రమేణా క్షణికమైన హనీమూన్ దశ త్వరలో ముగుస్తుందని తెలుసుకోండి.

భిన్నమైన అభిప్రాయాలు..
వివాహం చేసుకున్న తర్వాత మీ ఇద్దరికీ భిన్నమైన అభిప్రాయాలు మరియు ఆలోచనలు ఉండటం అనేది అత్యంత సహజం. అయితే వీటి నుండి మీకు కొన్నిసార్లు విభేదాలు వస్తాయి. ఇవి ప్రతి ఒక్కరి సంబంధంలో సహజమే. కాబట్టి మీరు గొడవ పడటానికి.. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

త్యాగాలు చేయాలి..
మీరు మరియు మీ భాగస్వామి పెళ్లి తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు ఎప్పుడైతే మూడు ముళ్లు వేస్తారో.. మీరు ఎల్లప్పుడూ ఒక సమయం వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అదేంటంటే త్యాగం. మీరు చాలా విషయాల్లో త్యాగం చేయాల్సి ఉంటుంది మరియు ఇతరుల మంచి కోసం మీ ఆనందాన్ని రాజీ పడాలి. అయితే ఇందుకు మీరు చింతించాల్సిన పని లేదు.

అంతం అనేదే ఉండదు..
వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ ప్రస్తుత రోజు సమానత్వాన్ని కోరుకోవడం సహజం. అందుకే ఎవరైతే పెళ్లి చేసుకుని గొడవ పడతారో లేదా వాదనలు చేసుకుంటారో.. చివరికి వారు విజేతగా ఎప్పటికీ నిలవరు. వివాహంలో పరస్పర అంగీకారంపై మాత్రమే వాదనకు పరిష్కారం లభిస్తుంది. అందువల్ల మీరిద్దరూ దానిని సంధి అని పిలిచే వరకు దానికి అంతం అనేదే ఉండదు.

ఎప్పటికీ మార్చలేరు..
చాలా మంది పెళ్లి అయిన తర్వాత తమ భాగస్వామిని తమ అభిప్రాయాలు, అభిరుచులకు తగ్గట్టు మార్చుకుంటామని భావిస్తారు. కానీ అది సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. ఇది మీరు అంగీకరించాల్సిన చేదు నిజం.

సంతానం తర్వాత..
చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత కచ్చితంగా సంతానం కావాలనుకుంటారు. అందుకు తగ్గట్టే ప్లాన్ చేసుకుంటారు. అందుకోసమే ఆ కార్యంలో కూడా పాల్గొంటారు. ఇవి మీ జీవితంలో విలువైన, మధురమైన క్షణాలు అయినప్పటికీ, ఇది మీ సంబంధం యొక్క మొత్తం గతిస్థితినే మార్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు సంతానం కలుగుతుందో.. మీరిద్దరికీ ఒకరినొకరు కలుసుకోవడానికి, ముఖ్యంగా ఆ కార్యంలో పాల్గొనడానికి తక్కువ సమయం ఉంటుంది. పైగా పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత, మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు ఆప్యాయత కూడా తగ్గుతాయి.

కొన్నిసార్లే ఆనందం..
మీరు మీ పెళ్లిరోజున సంతోషంగా గడపొచ్చు. కానీ, రోజులు గడిచేకొద్దీ, మీకు దినదిన గండాలు ప్రారంభమవుతాయి. మీరు చూస్తుండగానే సంతోషాన్ని కోల్పోతారు. చాలాసార్లు మీరు వివాహం ఎందుకు చేసుకున్నాన్రా బాబు అని చింతిస్తారు.



Click it and Unblock the Notifications











