Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
Hug Day 2022:‘‘తన కౌగిలిలో ఈ లోకాన్నే మరచిపోయా... ఆమె కౌగిలిలో కలకాలం బంధినైపోతా.’’
హగ్ డేను ఎందుకు జరుపుకుంటారు.. దాని ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కౌగిలింత అనేది మనిషిలో భిన్నమైన భావోద్వేగాలకు ప్రేమకు చక్కటి చిహ్నం. భాగస్వామిని ప్రేమగా హత్తుకోవడం ద్వారా మరింత ఎక్కువగా ప్రేమను పంచుతుంది.

మీరు ఎవరినైనా ప్రేమతో హత్తుకుంటే అది వారికి ప్రత్యేకమైన అనుభూతి కలిగించడంలో కచ్చితంగా సహాయపడుతుంది. అంతే కాదు కౌగిలింత అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా ఆప్యాయంగ్ హత్తుకుంటే ఎంతో మందికి చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే ఒక భాగమైపోయింది. అంతేకాదు.. ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సైతం పొందింది.

అయితే ఫిబ్రవరి 12వ తేదీనే హగ్ డే ఎందుకు జరుపుకుంటారు.. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఒక్కసారి హత్తుకుంటే..
తమ ప్రేయసి లేదా ప్రియుడిని ఆప్యాయతతో ఒక్కసారి హత్తుకుంటే చాలు వారిలో ప్రేమ బంధం మరింత బలోపేతమవుతుంది. ఇలా వారిద్దరి మధ్య అనుబంధం పెరగడమే కాదు.. ఒకరికి ఒకరు తోడు, నీడగా ఉంటామనే ధీమా, భరోసా ఇచ్చినట్టవుతుంది.

సందర్భానికి తగ్గ హగ్..
అయితే కౌగిలింతలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి సందర్భానికి తగ్గట్టు ప్రత్యేకమైన కౌగిలింతలు కూడా ఉన్నాయి.
ఉదాహరణకు మీరు మీ భాగస్వామిని కౌగిలించుకుంటే అది వారికి సురక్షితమైన కౌగిలింతగా భావన కలుగుతుంది. ఈ ఫీలింగ్ పదాలతో వర్ణించలేని విధంగా ఉంటుంది.

భరోసానిచ్చే హగ్..
సాధారణంగా ప్రతి అబ్బాయి నుండి అమ్మాయిలు రక్షణ కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకే వారిని ఓసారి ఆప్యాయంగా హత్తుకోవడం ద్వారా మీ ప్రేయసికి మీరు తోడు ఉన్నారనే భరోసాను ఇచ్చినట్టవుతుంది. అందుకే హగ్ డే కు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది.

అస్సలు మిస్సవ్వద్దు..
ఒక ప్రియుడి కౌగిలింతలోని హాట్ స్పర్శను.. ప్రియురాలు ఎంతో హాయిగా ఫీలవుతుంది. అందుకే ప్రేమికులు ఈరోజు తమ ప్రేయసికి/ప్రియుడికి మిస్సవ్వకుండా హగ్ ను ఇవ్వండి.

నేరుగా హగ్ కాకుండా..
అయితే కౌగిలింత అనగానే చాలా మంది కౌగిలిలో తమ ప్రియురాలిని బంధి చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే అలా ఎప్పటికీ చేయకూడదు. ముందుగా తనతో మాటలు కలపాలి. ముందుగా తనను మానసికంగా సిద్ధం చేయాలి. ఆ తర్వాత హ్యాపీ హగ్ డే ప్రాధాన్యాన్ని ఆమెకు వివరించాలి. ఆ తర్వాత ఆమె ఓకే అంటే గాఢమైన హగ్ ఇవ్వొచ్చు.

మెల్లగా కౌగిలించుకోవాలి..
మరి కొందరు కౌగిలి పేరేత్తగానే సినిమాల్లో చూపించనట్టు గాఢంగా హత్తుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు అకస్మాత్తుగా వెనుక నుండి గట్టిగా హత్తుకునేందుకు ట్రై చేస్తారు. అయితే అలా కాకుండా మెల్లగా, సుకుమారంగా, సున్నితంగా హత్తుకోవాలి.

లోకాన్నే మరచిపోవాలి..
మీ కౌగిలింతతో మీ ప్రేయసి ఈ లోకాన్నే మరచిపోయేలా చేయాలి. మీరు ఎంత సేపు కౌగిలించుకున్నా.. ఆమెకు అలానే ఉండిపోవాలి అనిపించేంతలా హగ్ ఇవ్వాలి. అలాంటి అనుభూతి ఎప్పటికీ మరచిపోలేరు.

లవ్ ఫీలింగ్..
మీరు కౌగిలించుకున్నప్పుడు.. మీ లవ్ పీలింగ్ కూడా వ్యక్తపరచొచ్చు. ఎందుకంటే మీరు హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అది వారికి చాలా మంచి అనుభూతిని కలిగిస్తుంది. ప్రియురాలికి తన ప్రియుడు ఎప్పుడూ తనతోనే, తన వెంటే ఉన్న ఫీల్ కలిగిస్తుంది.

లవర్స్ కు మాత్రమే కాదు..
హగ్ డే అనేది కేవలం లవర్స్ కాదు. ఇతరులు కూడా జరుపుకోవచ్చు. భార్యభర్తలు కూడా హగ్ ఇచ్చుకోవచ్చు. హగ్ ఇవ్వడం ద్వారా మీరు ఎన్నో విషయాలను చెప్పినట్టవుతుంది. మీరు మాటల్లోని చెప్పలేని విషయాలను కౌగిలింత ద్వారా వ్యక్తం చేయొచ్చు.

కూల్ చేసేందుకు..
కౌగిలింత అనేది కేవలం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. కోపంలో ఉన్నప్పుడు కూడా ఇస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరూ కూల్ అయ్యేందుకు హగ్ ఇచ్చుకోవచ్చు. అనంతరం వారిద్దరూ ప్రశాంతంగా ఆలోచించి.. మరింత దగ్గరవుతారు. దీంతో వారి మూడ్ కూడా మారిపోతుంది.
చూశారు కదా.. కౌగిలింత వల్ల ఎన్ని లాభాలో.. ఇంకెందుకు ఆలస్యం హ్యాపీ హగ్ ఇవ్వండి.. వాలెంటైన్స్ వీక్ లో మరో ఆనందకరమైన రోజును హాయిగా గడిపేయండి.
బాధలో ఉన్నా.. ఆనందంలో ఉన్నా ఆప్యాయంగ్ హత్తుకుంటే ఎంతో మందికి చాలా హాయిగా అనిపిస్తుంది. అందుకే వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే ఒక భాగమైపోయింది. అంతేకాదు.. ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సైతం పొందింది. అందుకే వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీనే హగ్ డే జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications