Latest Updates
-
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు!
‘నా భర్తంటే ఇష్టమే.. కానీ క్షణికావేశంలో అలా చేసేశా... చివరికి ఏం జరిగిందంటే...’
తన పార్ట్ నర్ కోరిక తీర్చలేదని, తన కంటే వయసులో చిన్నవాడైనా ఆ పని కానిచ్చేసిందట.
మనం డిజిటల్ యుగంలోకి వచ్చినా.. ఎంత టెక్నాలజీ పెరిగినా.. కొందరు మనుషుల మైండ్ సెట్ మాత్రం ఏ మాత్రం మారడం లేదు. ఇంకా అనాగరికంలోనే జీవిస్తున్నారు. చదువుకోని వారే అనుకుంటే.. చదువుకున్న వారు కూడా మూఢనమ్మకాలను గుడ్డిగా పాటిస్తూ.. బతికేస్తున్నారు.

ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ టీచర్ మైనర్ బాలుడికి స్పెషల్ క్లాసులు తీసుకుంటానని.. వారం రోజుల పాటు తనని ఇంట్లోనే ఉంచుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించింది. అయితే ఆ టీచర్ అదంతా ప్రత్యేక పాఠాల కోసం కాకుండా.. ప్రత్యేక పరిణయం.. శోభనం కోసం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకొచ్చొంది.

ఇదంతా ఎందుకు చేశావంటే.. ఓ పండితుడు తన జాతకంలో దోషం ఉందని చెప్పడంతో.. ఇలా చేయాలని చెప్పడంతోనే తాను ఈ పని చేశానని అమాయకంగా చెప్పేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ వివాహిత కూడా అచ్చం ఇలాంటి పనే చేసింది.

కాకపోతే అక్కడ టీచర్ పెళ్లి కావట్లేదని.. ఆ పని చేస్తే.. ఇక్కడ ఉన్న వివాహిత మాత్రం తన భర్త కోరికలు తీర్చట్లేదని క్షణికావేశంలో ఆ పని చేసిందట. ఇంతకీ తను ఎందుకిలా చేసింది.. అందుకు గల కారణాలేంటి అనే వివరాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...

ఇంజనీర్ తో పెళ్లి..
‘నా పేరు గీత(పేరు మార్చాం). నేను నాలుగేళ్ల క్రితం ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మా నాలుగేళ్ల కాపురానికి గుర్తుగా ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చాం. మా అత్తమామయ్యలు కూడా నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. దీంతో మా లైఫ్ హ్యాపీగా సాగేది. నేను కూడా నా పార్ట్ నర్ ను మరియు బిడ్డను ఎంతో లవ్ చేశాను.

సెలవులు దొరికితే..
మా ఆయనకు సెలవులు దొరికినప్పుడల్లా విహార యాత్రకు వెళ్లేవాళ్లం. నాకు అదొక మంచి అనుభూతిగా ఉండేది. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, రిసార్ట్స్, టేస్టీ ఫుడ్ ఇలా అద్భుతమైన సమయాన్ని ఆస్వాదించేవాళ్లం. అయితే నేను ఎంత ఆస్వాదించినా, నాకెందుకో ఏదో వెలితి ఉన్నట్టు అనిపించేది.

నేను కోరుకున్నది..
మా ప్రేమ ప్రయాణం పెళ్లిగా మారేందుకు నా భర్తతో పాటు నేను కూడా ఎక్కువగానే కష్టపడ్డాను. కానీ నేను ఏదైతే కోరుకున్నానో, తను అది నాకు ఇవ్వలేకపోయాడు. తన నుండి నేను నిజాయితీ గల ప్రేమను ఆశించాను. కానీ అది తను ఇవ్వలేదు.

నెలకు రెండుసార్లే..
మా ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు ఉంటుంది. అయితే తను నాతో ఫిజికల్ గా నెలలో కేవలం రెండుసార్లే కలిసేవాడు. అయితే నాకు అందమైన మరియు ఖరీదైన వస్తువులను బహుమతిగా ఇచ్చేవాడు. అవి చూసినప్పుడల్లా సంతోషం కలిగేది. కానీ నాకు ఫుల్ హ్యాపీ మాత్రం ఉండేది కాదు.

రోటీన్ లైఫ్..
తను నన్ను ఎంత బాగా చూసుకున్నా.. నేను అందరిలాగా రోటీన్ లైఫ్ మెయింటెయిన్ చేస్తున్నానా.. బావిలో కప్ప మాదిరిగానే ఉండిపోవాల్సిందేనా అనే భావన నన్ను బాగా ఇబ్బంది పెట్టేది. అయితే మనలో చాలా మంది ఏది కావాలంటే అది పొందలేము.

ఓరోజు అనుకోకుండా..
అయితే అలా మూడీగా ఉన్న సమయంలో ఓ రోజు అనుకోకుండా నా కన్నా తక్కువ వయసు ఉండే కుర్రాడు కలిశాడు. తను గ్రాఫిక్ డిజైనర్. అతనిని కలిసినప్పుడు నాలో తెలియని ఆశలు చిగురించాయి. ఎందుకంటే తను అందరికంటే అందంగా.. చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు.

తన కోసమే ఎదురుచూసేదాన్ని..
తనను కలిసినప్పటి నుండి తన రాక కోసం ప్రత్యేకంగా ఎదురుచూసేదాన్ని. మా పని గురించి తనతో నా ఆలోచనలు షేర్ చేసుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఉండేదాన్ని. తను వయసులో నాకన్నా చాలా చిన్నవాడైనా, తనతో నేను సంతోషంగా, ఉత్సాహంగా గడుపుతున్నందుకు నాకు అద్భుతమైన ఫీలింగ్స్ కలుగుతుండేది.

అవే ఆలోచనలే..
తను నన్ను కలిసినప్పుడల్లా నాలో ఎక్కువగా అవే ఆలోచనలే వచ్చేవి. నేను నా ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఓ రోజు ఫంక్షన్ తనను ఆహ్వానించాను. అది ముగిసి అందరూ ఇళ్లకు వెళ్లే సమయానికి, తనను మాత్రం కాసేపు వెయిట్ చేయమని చెప్పాను. అందుకు తను కూడా సరే అన్నాడు.

దాహమేస్తుందని..
అదే సమయంలో తనకు దాహమేస్తుందని.. తాగడానికి ఏదైనా తీసుకురమ్మని అడిగాడు. నేను తననే చూస్తూ నీళ్లు తీసుకొచ్చాను. అనుకోకుండా నీళ్లు జారి బట్టలపై పడ్డాయి. అంతే ఇద్దరి బట్టలు బాగా తడిచిపోయాయి. అయితే అంతలోనే తను నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నేను మాత్రం వెనక్కి తగ్గాను.

అలా మొదలైంది..
అలా మొదలైన మా రిలేషన్ ఏకంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. తన స్పర్శ నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. అప్పటినుండి మేమిద్దరం ప్రైవేట్ ప్లేసుల్లో సీక్రెట్ గా కలుసుకోవడం స్టార్ట్ చేశాం. తను కూడా నన్ను బాగా లైక్ చేశాడు. నాతో ఫిజికల్ కనెక్షన్ అంటే ఆసక్తి చూపేవాడు. అయితే అలా మేమిద్దరం ఆ రిలేషన్లో ఉన్నప్పుడు తనకు ఇంట్లో వివాహ సంబంధాలు చూస్తున్నారని తెలిసింది.

నన్నే పెళ్లాడతానని..
ఈ విషయం గురించి మేమిద్దరం చాలా రోజుల పాటు మాట్లాడుకున్నాం. చివరిగా ఓ నిర్ణయానికి వచ్చాం. నేను నా భర్తకు వాస్తవం చెబుతానని, నిర్ణయం తనకే వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. తను కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని తన పేరేంట్స్ ఈ మ్యాటర్ చెబుతా అన్నాడు.

చాలా బాధపడ్డాను..
అయితే నేను తనతో అడుగు వేయాల్సిన సమయంలో మాత్రం నాకు చాలా బాధ కలిగింది. నా భర్త చాలా మంచి వాడు. ఇలాంటి మంచి మనిషికి నేను ద్రోహం చేయాలా అనుకున్నాను. అయినా కూడా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికే నేను కట్టుబడ్డాను. తనతో కలిసి జీవితాన్ని పంచుకునేందుకు డిసైడ్ అయ్యాను.

ఒక్కసారిగా షాక్..
అయితే ముందుగా మరోసారి తనను కలిసి తన అభిప్రాయం తెలుసుకోడానికి, వారి ఇంటి వద్దకు వెళ్లగా.. నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. అప్పటికే వాళ్ల ఇంట్లో ఏదో పెద్ద శుభకార్యం జరుగుతున్నట్టు కనిపించింది. అక్కడంతా బంధువులు, స్నేహితులు ఇతరులు హ్యాపీగా ఉన్నారు. అక్కడే నాకు తనకు కాబోయే పార్ట్ నర్ బ్యానర్ కనిపించింది. కిటికీలో నుండి తనను చూస్తే.. తను కూడా బాగా హ్యాపీగా ఉన్నాడు.

అప్పుడర్థమైంది..
నాకు అప్పుడు అర్థమైంది అస్సలు విషయం. తనకు ఎంగేజ్ మెంట్ జరుగుతోందని.. నేను నా లైఫ్ లో పెద్ద తప్పు చేయబోయానని.. తను నన్ను మోసం చేశాడని.. అంతే వెంటనే తేరుకుని.. నా హ్యాపీ లైఫ్ ను పాడు చేసుకోకూడదని డిసైడ్ అయ్యాను.

ఇంటికొచ్చేశాను..
నేను నా ఇంటికి తిరిగొచ్చేశాను. నా భర్తను ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దామా అని అడిగాను. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ సీక్రెట్ ను ఎప్పుడూ నేను ఎవ్వరి దగ్గర బయటపెట్టలేదు. చివరగా నన్ను నేను రక్షించుకున్నాను.



Click it and Unblock the Notifications











