Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
‘అతి త్వరలో నా పెళ్లి.. కానీ ప్రియురాలితో ఇంకా టచ్ లోనే... నేను చేస్తోంది కరెక్టేనా..’
త్వరలో పెళ్లి చేసుకోబోతూ.. ఇంకా తన ప్రియురాలితో టచ్ లో ఉన్న కుర్రాడి కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకప్పుడు ప్రేమ కోసం ఎన్ని రోజులైనా.. ఎన్ని సంవత్సరాలైనా.. ఎంతో ఆశతో ఎదురుచూస్తుండేవారు.. అంతేకాదు ప్రేమ కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేవారు.

కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇందుకు సినిమాల ప్రభావం కూడా కొంత ఉందని చెప్పొచ్చు. ఇప్పటితరం వారు యవ్వనంలో ఉన్నప్పుడు వేగంగా ప్రేమలో పడటం.. అంతే వేగంగా బ్రేకప్ చెప్పడం కామన్ అయిపోయింది.

అలా ఒక అబ్బాయి తన ప్రియురాలికి ఈ మధ్యనే బ్రేకప్ చెప్పేశాడు. కానీ తనతో ఫ్రెండ్ షిప్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు. అయితే అతి త్వరలో అంటే వైశాఖ మాసంలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతున్నాడు.

అయితే తనతో ఫ్రెండిషిప్ వల్ల తమ వివాహ జీవితంలో ఏమైనా ఇబ్బందులు వస్తాయోమనని భయపడుతున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎందుకు ఆందోళన చెందుతున్నాడు.. తను చేసిన తప్పేంటి.. తను ఆ బాధ నుండి బయటపడ్డాడా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లాక్ డౌన్ లో బ్రేకప్..
హాయ్.. ‘నా పేరు సంతోష్(పేరు మార్చాం). నా వయసు 28 ఏళ్లు. నేను రెండేళ్లుగా నా ప్రియురాలితో ప్రేమలో ఉన్నాను. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మేమిద్దరం లాక్ డౌన్ టైమ్ లో బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది.

స్నేహితులుగా..
మేమిద్దరం బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ.. మంచి స్నేహితులుగా ఉండాలని మాత్రం డిసైడ్ అయ్యాం. అప్పటి నుండి రెగ్యులర్ ఫోన్లో చాటింగులు.. ఫొటోలను ఇతర విషయాలను షేర్ చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు నా ఎక్స్ పై నాకు ఎలాంటి కోరికలు లేవు.

ఇంట్లో సంబంధాలు..
ఇంతలోనే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా మే నెలలో నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టారు. ఇంట్లో పెద్దలకు ఎదురుచెప్పలేక నేను కూడా ఓకే అన్నాను. దీంతో వారి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.

భయమేస్తోంది..
మరి కొద్ది రోజుల్లో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. కాబట్టి నేను ఇంకా నా ప్రియురాలితో మాట్లాడటం మంచిదేనా కాదా అనే విషయాన్ని తేల్చుకోలేకపోతున్నాను. ఎందుకంటే మేమిద్దరం ఇప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. కానీ ఇదే మీ మ్యారేజ్ లైఫ్ కు ఏమైనా ఆటంకాలు కలిగిస్తుందా అని భయమేస్తోంది.

సీక్రెట్ గా ఉంచాలా?
నాకు పెళ్లికి ముందే బ్రేకప్ అయిన విషయాన్ని మరియు తనతో ఇంకా ఫ్రెండ్ షిప్ చేస్తున్న విషయాన్ని నాకు కాబోయే పార్ట్ నర్ కు చెప్పాలా? ఒకవేళ చెబితే తన రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏంటో. ఇలాంటి సమయంలో నేను మా స్నేహాన్ని తన వద్ద సీక్రెట్ గా ఉంచాలా? లేదా నేను తనతో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేయొచ్చా ' అని ఓ యువకుడు తన సమస్యకు పరిష్కారం కావాలని నిపుణులను సంప్రదించాడు.

లిమిట్స్ లో ఉంటే..
ఇందుకు నిపుణులు ఏమి సమాధానం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మంది కొందరు ఎక్స్ లతో క్లోజ్ గా ఉండి.. లిమిట్స్ దాటుతుంటారు. కానీ, మీ ఇద్దరిలో అలా జరగలేదు. మీరిద్దరూ ఒక అండర్ స్టాండింగ్ తో విడిపోయారు. ఇప్పటికీ మీరిద్దరూ క్లోజ్ గానే ఉంటున్నారు. కానీ ఎక్కడా లిమిట్స్ దాటలేదు. అలాంటి ఆలోచన కూడా మీకు రాకపోవడం అభినందించాల్సిన విషయం.

పాజిటివ్ ఆలోచనలు..
అయితే ఆడ, మగవారి మధ్య ఫ్రెండ్ షిప్ అన్ని సమయాల్లో.. అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండకపోవచ్చు. అయితే పాజిటివ్ ఆలోచనలు ఉంటే మీ ఫ్రెండ్ షిప్ కాపాడుకోవచ్చు. మీరిద్దరూ సరైన స్నేహబంధంలో ఉంటే. మీరు ఆ విషయం గురించి మీకు కాబోయే పార్ట్ నర్ కు చెప్పొచ్చు.

నిజాయితీగా ఉంటే..
మీరిద్దరూ మీ స్నేహాన్ని పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేయాలంటే.. మీ ఇద్దరి మధ్య ఎలాంటి విషయం గురించి అయినా మీ కాబోయే భార్య చెప్పడమే మంచిది. దీని వల్ల మీరు రిలేషన్ షిప్ లో ఎంత నిజాయితీగా ఉన్నారో తనకు తెలిసే అవకాశం ఉంది.

తర్వాత తెలిస్తే..
ఒకవేళ మీరు మీ స్నేహాన్ని సీక్రెట్ ఉంచినా.. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అంతేకాదు.. తర్వాత తెలిస్తే.. మీపై వారికి విశ్వాసం తగ్గిపోతుంది. మీ ఇద్దరి మధ్య హెల్దీ రిలేషన్ కావాలంటే మీరు నిజాయితీగా మరియు నమ్మకంగా ఉండాలి.



Click it and Unblock the Notifications











