Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
శృంగారంలో భావప్రాప్తి చెందకపోతే రిలేషన్ దెబ్బ తింటుందా?
జంటల మధ్య వీర్యం అంత ప్రభావం చూపుతుందా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యభర్తలను సన్నిహితంగా మార్చే ఏకైక ప్రక్రియ శృంగారం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పడకగదిలో వారి సాన్నిహిత్యాన్ని బట్టే.. వారి భవిష్యత్తు కూడా సంతోషంగా, హాయిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే పెళ్లి అయిన వారిలో చాలా మంది పురుషులు రకరకాల శృంగార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాటిని తమ జీవిత భాగస్వామికి చెబితే, తాను ఎలా ఫీలవుతుందో అని... స్నేహితులకు చెబితే ఎగతాళి చేస్తారేమో అని భయపడుతుంటారు.

ఇలాంటి సందర్భంలోనే కొందరు డాక్టర్లతో లేదా మానసిక నిపుణులతో తమ సమస్యలు చెప్పుకుని, వాటికి సమాధానాలు రాబట్టుకుంటారు. వీటన్నింటి సంగతిపక్కనబెడితే... ఇటీవల కొంతమంది మగవారిలో కొత్త రకం సమస్య వచ్చినట్లు సమాచారం.

అదేంటంటే.. కొందరు పురుషుల్లో శృంగారంలో పాల్గొన్న తర్వాత, వారి పురుషాంగం నుండి వీర్యం బయటకు వచ్చినప్పుడే వారు భావప్రాప్తికి గురైనట్లుగా భావిస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు పురుషులు ఎంతసేపు కలయికలో పాల్గొన్నప్పటికీ వారి పురుషాంగం నుండి వీర్యం బయటకు రావడం లేదట.

ఈ సమస్య వల్ల చాలా మంది పురుషులు తమ భాగస్వామితో దూరం పెంచుకుంటున్నారట. అయితే దీని గురించి ఓ వ్యక్తి నిపుణులను సంప్రదించగా.. వారు అందుకు పరిష్కారాన్ని సూచించారంట... ఇంతకీ నిపుణులు ఏం చెప్పారు? ఆ వ్యక్తి ఏం జాగ్రత్తలు పాటించారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

పిల్లలు ఎలా పుడతారని..
తన భాగస్వామితో తాను శృంగారంలో పాల్గొన్న తర్వాత తన పురుషాంగం నుండి వీర్యం బయటకు రావడం లేదని, దీంతో తమకు పిల్లలు ఎలా పుడతారంటూ ఆ వ్యక్తి తెగ బాధపడేవాడట. దీంతో తమ ఇద్దరి సంబంధంలో మనస్పర్దలు వస్తుండేవట.

దూరం పెరుగుతోందని..
పెళ్లి జరిగిన నాటి నుండి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవించిన తాము, పడకగదిలో శృంగారాన్ని ఎంతగానో ఆస్వాదించినా.. కేవలం ఆ ఒక్క కారణం వల్ల తమ మధ్య దూరం పెరుగుతోందని ఆందోళన చెందేవాడు. ఈ నేపథ్యంలోనే తనకు మధుమేహం ఉందని, అందువల్లే ఇలా జరుగుతుందా అనే అనుమానంతో నిపుణులను ఆశ్రయించాడు.

సహజమైన సమస్యే..
ఇందుకు స్పందించిన నిపుణులు.. డయాబెటిస్ ఉన్న వారిలో ఇలాంటి సమస్య చాలా సహజంగానే ఏర్పడుతుందని చెప్పారు. దీన్ని ‘రిట్రోగ్రేడ్ ఎజాక్యూలేషన్' అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు వీర్యం విడుదల అవుతున్నా, అది బయటకు రాకుండా మూత్రాశయంలోకి చేరుకుని, మూత్ర విసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతుందట.

మెడిసిన్ తీసుకుంటే..
ఇలాంటి సమస్య ఉన్నవారు ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. 80 శాతం మందికి ఇలాంటి సమస్యకు మెడిసిన్ తో పరిష్కారం కచ్చితంగా లభిస్తుందట. అయితే కొంతమందికి మందులు వాడినంత కాలమే వీర్యం బయటకు వస్తుంటుంది. మెడిసిన్ తీసుకోవడం ఆపగానే ఇది మళ్లీ మొదటికొస్తుంది.

పిల్లలు కావాలనుకుంటే..
కాబట్టి పిల్లలు కావాలనుకునే వారు.. రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకుని తమ పనిని కంటిన్యూ చేయవచ్చు. అయితే మెడిసిన్ వాడటం ప్రారంభించిన తర్వాత వీర్యం యొక్క నాణ్యత తెలుసుకోవడానికి వీర్య పరీక్ష చేయించుకుంటే, దాని ఆధారంగా న్యాచురల్ పిల్లల్ని కనే ప్రయత్నం చేయొచ్చు.

వీర్యం నాణత్య తగ్గితే..
ఒకవేళ మీరు చేయించుకున్న వీర్య పరీక్షలో మీ వీర్యం నాణ్యత తక్కువగా ఉంటే, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవిఎఫ్)కు బదులుగా, ఇంట్రా యుటెరిన్ ఇన్ సెమినైజేషన్ (ఐయుఐ) ద్వారా పిల్లలను కనే ప్రయత్నం చేయాలి. ఐవిఎఫ్ తో పోల్చుకుంటే ఐయుఐ తక్కువ ఖర్చు కాబట్టి వీర్యం నాణ్యత తక్కువగా ఉన్నా.. ముందుగా ఐయుఐను ప్రయత్నించాలి.

అవసరాన్ని బట్టి..
ఒకవేళ వీర్యకణాలు మరీ తక్కువగా ఉన్నా.. మందులతో వీర్యం బయటకు రాకపోయినా ఐవిఎఫ్ ను ఆశ్రయించక తప్పదు. కాబట్టి మందులు వాడి, వీర్య స్కలనంతో బయటకు తెప్పించే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో వీర్యపరీక్ష చేయించుకుని అవసరాన్ని బట్టి ఐయుఐ లేదా ఐవిఎఫ్ ను ఎంచుకుంటే మీ సమస్య పరిష్కారం దొరికినట్టే...



Click it and Unblock the Notifications
