For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

OMG! గర్భం పొందడానికి ఆ లెస్బియన్లు ఎంత పని చేశారంటే...!

|

ఒకప్పుడు స్వలింగ సంపర్కం అనేది నేరం. కానీ ప్రస్తుతం అది నేర రహితం. ప్రస్తుతం సుప్రీంకోర్టు సైతం ఇది తప్పు కాదని తీర్పు ఇచ్చింది. ఇద్దరు ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఇద్దరూ ఇష్టపడే వ్యక్తులు కలిసి జీవించే పరిస్థితులు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా స్వలింగ సంపర్కాన్ని అంగీకరించడం ప్రారంభించాయి. దీంతో చాలా మంది ప్రజలు అభిప్రాయాలు మారుతున్నాయి.

Lesbian couple get pregnant by the same sperm donor at the same time

ఈ విశ్వంలో ఎక్కడైనా ఒక పురుషుడు ఒక స్త్రీనే వివాహం చేసుకుంటారు. ఇది చాలా సాధారణమైన విషయం. ఇదే సంబంధ బాంధవ్యాలకు అనువైనది కూడా. అయితే ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు కూడా బాగా మారిపోయాయి. మనం సంతోషంగా, సుఖంగా జీవించడానికి ఆడవారు, మగవారిని పెళ్లి చేసుకోవడమనేది అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది విచిత్రంగా ఒకే రకమైన జాతి వారిని చేసుకుంటారు. ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపడీ మరి వివాహం చేసుకుంటున్నారు.

Lesbian couple get pregnant by the same sperm donor at the same time

ఇలాంటివి మనం అప్పుడప్పుడు విన్నప్పటికీ.. ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు ఎక్కడ విని ఉండారు. ఎందుకంటే అంత విచిత్రంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇద్దరు అమ్మాయిలు కలిసి కలయికలో పాల్గొన్న కూడా వారికి పిల్లలు పుట్టడం అసాధ్యం. వారు గర్భదారణ కూడా పొందలేరు. అయితే తాజాగా ఓ ఇద్దరు లెస్బియన్లు పెళ్లి చేసుకోవడమే కాకుండా పిల్లల్ని కూడా కనాలని నిర్ణయించుకున్నారు.

Lesbian couple get pregnant by the same sperm donor at the same time

అంతటితో ఆగకుండా వారు గర్భం పొందేందుకు సోషల్ మీడియాలో అన్వేషణ మొదలుపెట్టారు. చివరికి వారు అనుకున్నది సాధించారు. వారు ముందుగానే అనుకున్నట్టుగానే నెల తప్పారు. అయితే ఇది ఎలా సాధ్యమైంది. వారు ఎలా నెలతప్పారు అనే విషయాలను తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

లాక్ డౌన్ వేళ.. టాలీవుడ్ లో పెళ్లి కళ వచ్చేసిందే బాలా...!

పిల్లల కోసం..

పిల్లల కోసం..

లెస్బియన్ దంపతులు కేట్ మరియు తారిన్ కలిసి జీవించాలనుకున్న సమయంలో, వారి సొంత రక్తం ద్వారా ఒక బిడ్డను కలిగి ఉండాలని కోరుకున్నారు. ఇలాంటి సమయంలో వీరికి ఉన్న ఏకైక మార్గం కృత్రిమ గర్భధారణ. అందుకే వారు పెళ్లికి ముందే దీని కోసం ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశారు.

స్పెర్మ్ కోసం అన్వేషణ..

స్పెర్మ్ కోసం అన్వేషణ..

అయితే వీరి వివాహం తరువాత, వారు స్పెర్మ్ దాత కోసం అన్వేషణ మొదలుపెట్టారు. వీరు స్పెర్మ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కనుగొనడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వారిద్దరూ గర్భధారణకు సిద్ధమయ్యారు. అంతేకాక, ఇద్దరూ ఒకే వ్యక్తి నుండి వీర్యం(స్పెర్మ్) తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఎట్టకేలకు ఒక వీర్యదాతను పట్టుకున్నారు.

ఫేస్ బుక్ సెర్చింగ్..

ఫేస్ బుక్ సెర్చింగ్..

ముందుగా ఫేస్ బుక్ లో ఒక గ్రూపులో అన్వేషణ మొదలుపెట్టి, ఒక గ్రూపులో ఒక వ్యక్తిని కనిపెట్టారు. ముందుగా తన గురించి ఆరా తీశారు. అతని చరిత్ర మరియు ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ విషయాలన్నీ కనిపెట్టి, ఇవన్నీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, తనను సంప్రదించారు. ఆ తర్వాత మానసికంగా మరియు శారీరకంగా తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నారు.

వివాహ ఆచారాలలో ఇలాంటివి కూడా ఉంటాయా? శోభనం గదిలోకి ముగ్గురు వెళ్తారంట...!

12 రోజుల తేడాలో..

12 రోజుల తేడాలో..

చివరికి కృత్రిమ గర్భధారణ ద్వారా ఇద్దరూ గర్భవతి అయ్యారు. ఈ ఇద్దరూ 12 రోజుల తేడాలో గర్భం పొందారు. ప్రస్తుతం వీరిద్దరూ రెండు నెలల గర్భవతిగా ఉన్నారు. కాబట్టి వారి డెలివరీ సమీప భవిష్యత్తులో ఉంటుంది. అయితే, ఇప్పుడు వారు తమ రక్తంతోనే బిడ్డను కనాలనే కోరికను త్వరలో నిజం చేసుకోబోతున్నారు.

ఇతరులకు ప్రేరణగా..

ఇతరులకు ప్రేరణగా..

ఈ సందర్భంగా వారి స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకోవడానికి ఇద్దరూ సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో, స్వలింగ జంటలకు సహాయం చేయడానికి వీరిద్దరూ కలిసి యూట్యుబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి ఓ బిడ్డకు జన్మనివ్వడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలా వీరిద్దరూ ఇతరులకు ప్రేరణగా నిలిచారు.

English summary

Lesbian couple get pregnant by the same sperm donor at the same time

Here we talking about lesbian get pregnant by the same sperm donor at the same time. Read on.
Story first published: Tuesday, May 19, 2020, 14:08 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more