Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మగాళ్ల బాడీలోనూ సెన్సిటివ్ ప్లేసులుంటాయని తెలుసా.. వారిని అక్కడ తాకితే...!
మగాళ్లలో ఉండే వీక్ నెస్ గురించి తెలుసా..
రతి క్రీడలో చాలా మంది మగాళ్లు తామే తోపులమని.. తమ పార్ట్నర్ కంటే ఎక్కువ బలవంతులమని.. తామే వారిపై ఆధిపత్యం చెలాయిస్తామని భావిస్తూ ఉంటారు.

అందుకే ఆ కార్యంలో పాల్గొన్న ప్రతిసారీ తమదే పైచేయి కావాలని కోరుకుంటూ ఉంటారట. కానీ కొందరు పురుషులు మాత్రం ప్రతిసారీ తామే డామినేట్ చేయాల్సిన పని లేదని.. తమ భాగస్వామి తమంతట తామే వచ్చి ఆ కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపాలని కోరుకుంటారట.

ఇదిలా ఉండగా... మగాళ్లను మూడ్ లోకి ఎలా తీసుకురావాలనే విషయం చాలా మందికి అవగాహన లేకపోవచ్చు. ఎందుకంటే.. అమ్మాయిల్లోని శరీరంలో కొన్ని భాగాలను తాకడం వల్ల వారికి వెంటనే ఆ కార్యంలో పాల్గొనాలని.. రతి క్రీడను ఆసాంతం ఆస్వాదించాలనే కోరిక కలుగుతుంది.

అయితే అబ్బాయిలకు అలాంటివేవీ ఉండవని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే అమ్మాయిల మాదిరిగానే అబ్బాయిల శరీరంలోనూ కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఉంటాయట. వాటిని తాకడం వల్ల వారికి వెంటనే మూడ్ వచ్చేస్తుందట. ఈ సందర్భంగా ఆ సున్నిత ప్రాంతాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

మెడ వెనుక భాగంలో..
చాలా మంది కేవలం అమ్మాయిలకు మాత్రమే.. మెడ వెనుక భాగంలో సున్నిత ప్రాంతమని అనుకుంటూ ఉంటారట. అయితే అబ్బాయిల్లో కూడా ఆ ప్రాంతంలో చాలా సున్నితంగా ఉంటుందట. వారి మెడ వెనుక భాగంలో వేళ్లను కిందికి పైకి తాకుతూ ఉంటే.. వారికి ఆటోమేటిక్ గా మూడ్ వచ్చేస్తుందట. అంతేకాదు ఆ సెన్సిటివ్ ఏరియాలో మీ పెదాలతో సుకుమారంగా కిస్ చేస్తే.. వారికి ఎంతో హాయిగా అనిపిస్తుందట.

అక్కడ టచ్ చేస్తే..
మగవారిలో సున్నితమైన భాగాలలో నాభి ఒకటి. చాలా మంది కేవలం అమ్మాయిలకు మాత్రమే అక్కడ టచ్ చేస్తే వారికి ఫీలింగ్స్ వస్తాయనుకుంటారు.. కానీ మగవారిలోనూ ఆ ప్రాంతంలో సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుందట. అందుకే వారికి అక్కడ టచ్ చేయాలని చెబుతున్నారు. నిపుణులు. అలా చేయలేకపోతే.. మీ నాలుకతో ఆ ప్రాంతాన్ని టచ్ చేయడం వంటివి చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయట.

పెదాలలో..
చాలా మంది పురుషులకు ఈ విషయం గురించి అస్సలు తెలియదట. వాస్తవానికి అబ్బాయిల్లో ఉండే పెదాలు వారి బాడీలో చాలా సెన్సిటివ్ అని.. వాటిని తాకితే ఆ కార్యంలో పాల్గొనాలనే మూడ్ వస్తుందట. పెదాల చివరి నరాలను ఉత్తేజపరచడం వల్ల వారికి కోరికలు కలుగుతుంటాయట. కాబట్టి.. వారి పెదాలను సున్నితంగా మీ చేతులతో తాకడం.. లేదా కిస్ చేయడం వంటివి చేస్తే.. వారిని రతి క్రీడలో రెచ్చిపోయేలా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

చెవుల వద్ద..
మగాళ్ల చెవులు చాలా సున్నితమైనవి. వారిని మూడ్ లోకి తీసుకురావడానికి ఇదొక ముఖ్యమైన భాగంగా చెప్పొచ్చు. మీ చూపుడు వేలు లేదా బోటనవేలితో వారి చెవులపై నెమ్మదిగా తాకండి. లేదంటే.. మీ కాలి వేళ్లతో కూడా వారి చెవులపై సుకుమారంగా తాకితే వారికి చాలా హాయిగా అనిపిస్తుందట. అలాగే మీరు ఏవైనా సీక్రెట్లను వారి చెవులలో గుసగుసలాడటం వంటివి చేస్తే.. వారు కచ్చితంగా ఆశ్చర్యపోతారట.

మోకాళ్ల వెనుక..
చాలా మంది మహిళలకు ఈ విషయం గురించి తెలియదట. మగవారి తొడల కింది భాగంలో అంటే మోకాళ్ల వెనుక భాగంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ కిస్ చేయడాన్ని వారు బాగా ఇష్టపడతారని న్యూయర్క్ నగర సెక్స్ నిపుణులు డాక్టర్ కార్నర్ వివరించారు. అలాగే మీ చేతి వేళ్లతో మోకాళ్ల వెనుక భాగంలో సుకుమారంగా తాకుతూ ఉంటే.. వారు అలాంటి వాటిని బాగా ఎంజాయ్ చేస్తారట.

వెన్నెముక దగ్గర..
మగవారిలో సున్నితమైన మరో ముఖ్యమైన భాగం వెన్నెముక. ఈ భాగంలో ఓ ఎముక ఉంటుదట. ఆ ఎముక భాగంలో గట్టిగా మసాజ్ చేయడం వల్ల కూడా వారిలో కోరికలు అమాంతం పెరిగిపోతాయంట వారిని వెనుక నుండి హత్తుకుని.. ఆ సున్నిత భాగంలో మరింత సున్నితంగా తాకుతూ.. నెమ్మదిగా మసాజ్ చేస్తే.. వారిలో హార్మోన్లు విడుదలై.. భావోద్వేగానికి గురవుతారట. మరికొందరు అబ్బాయిలకు వెన్నెముక ప్రాంతంలో రుద్దడం వంటివి చేసినా కూడా మూడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుందట.



Click it and Unblock the Notifications