‘అలా కలిశాడు.. పెళ్లి కాలేదని చెప్పి వాడేసుకున్నాడు.. ఆ తర్వాత..’

అక్కడ పరిచయం చేసుకుని.. అలా వాడుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.

మీరు మీకు పర్ఫెక్ట్ అయిన పార్ట్ నర్ కోసం మ్యాట్రిమోనియల్ మరియు మ్యారేజ్ బ్రోకర్లను సంప్రదిస్తున్నారా? అందులో ఉండే ప్రొఫైల్స్ ని చూసి ముందుకు మూవ్ అవుతున్నారా?

Married man dumped me after having romance in Telugu

అయితే ఒక్క నిమిషం ఆగండి.. మీరు ముందుకు ఫార్వార్డ్ అయ్యే ముందు అన్ని వివరాలు కచ్చితంగా ఆరా తీయండి. లేదంటే ఈ అమ్మాయికి ఎదురైన పరిస్థితి మీకు కూడా ఎదురుకావచ్చు. ఎందుకంటే మ్యాట్రిమోనియల్ మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో లేదా మ్యారేజ్ బ్రోకర్లతో కొన్ని ఫేక్ వివరాలు కూడా ఉంటున్నాయి.

Married man dumped me after having romance in Telugu

అందుకే మీరు ఏదైనా మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటున్నారంటే.. ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేయండి.. లేకపోతే పెళ్లికి ముందే మీరు కూడా ఈ అమ్మాయిలా మోసపోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆమె ఎలా మోసపోయింది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రెండేళ్ల క్రితం..

రెండేళ్ల క్రితం..

‘నా పేరు రాణి(పేరు మార్చాం). నేకు రెండేళ్ల క్రింద ఓ వివాహా వెబ్ సైట్ ద్వారా ఓ వ్యక్తితో పరిచయడం ఏర్పడింది. తను చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. దీంతో తన కాంటాక్ట్ నంబర్ తీసుకుని, తనకు ఫోన్ చేశాను.

తొలిసారి కలిశాను..

తొలిసారి కలిశాను..

ముందుగా ఫోన్లో పరిచయం పెంచుకుని.. నాకు కొంత నమ్మకం వచ్చాక తనను వ్యక్తిగతంగా కలిశాను. కొన్ని నెలల తర్వాత అతడితో రెగ్యులర్ కలవడం చేస్తూ ఉండేదాన్ని. అలా మా ఇద్దరి మధ్య అతి తక్కువ సమయంలోనే శారీరకంగా ఒక్కటయ్యేంత రిలేషన్ ఏర్పడింది.

పని ముగిశాక..

పని ముగిశాక..

మేము ఇద్దరం ఎప్పుడైతే ఫిజికల్ రిలేషన్ పూర్తి చేసుకున్నామో.. అప్పటి నుండి తను నాకు దూరం కావడం ప్రారంభించాడు. మెల్లగా నన్ను కలవడం మానేశాడు. అప్పుడే నాకు అర్థమైంది. తను నాతో గేమ్ ఆడాడని.

సరిగ్గా సంవత్సరం తర్వాత..

సరిగ్గా సంవత్సరం తర్వాత..

నేను మళ్లీ వివాహానికి సంబంధించిన మరో వెబ్ సైట్ చూస్తే, అందులో అతనికి వివాహం జరిగి ఏకంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయినట్లు తెలిసింది. దీంతో తను నాతో అన్ని అబద్ధాలే చెప్పాడని, తను ఫేక్ డిటైల్స్ తో వెబ్ సైట్లు వేదికగా అమ్మాయిలను లోబరుచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని అర్థమయ్యింది.

అందరినీ అనుమానిస్తున్నా..

అందరినీ అనుమానిస్తున్నా..

తను చేసిన మోసం నుండి నేను బయటపడలేకపోతున్నా.. ఆ షాక్ నుండి కోలుకోలేక.. అందరి మగాళ్లను అనుమానంతో చూస్తున్నా.. వారితో కూడా మాట్లాడేటప్పుడు నా మనసులో కూడా ఏదో భయం వెంటాడుతూనే ఉంది. ఎవ్వరితో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా.

నార్మల్ లైఫ్ ఉండదా..

నార్మల్ లైఫ్ ఉండదా..

ఇలాంటి పరిస్థితులలో నేను కనీసం డ్రీమ్స్ లో మగవారిని ఊహించుకోలేకపోతున్నా. నాకు ఇలా ఉండాలని అస్సలు అనిపించడం లేదు. ఆ బాధ అలాగే ఉండిపోవడం వల్ల నేను నార్మల్ లైఫ్ గడపలేనేమో అనిపిస్తోంది. నేను మళ్లీ ఎవరితో కలిసి జీవించలేనా అని' ఓ యువతి తన గోడును వెళ్లబోసుకుంది. దీనికి నిపుణులు ఏమి సమాధానం చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

తప్పులేదు..

తప్పులేదు..

మీరు వివాహ వెబ్ సైట్ ద్వారా ఆ వ్యక్తిని కలిసి, పరిచయం చేసుకుని ఫిజికల్ గా ఒక్కటయ్యారు. అయితే మీ ఆలోచనల్లో ఎలాంటి తప్పులేదు. అయితే మీరు అతడిని చాలా గుడ్డిగా నమ్మారు. అతను వంచకుడని గ్రహించలేకపోయారు. అంతా అయిపోయాక తన గురించి నిజం తెలుసుకున్నారు.

గతం గతః

గతం గతః

మీరు తనని మరచిపోయేందుకు ప్రయత్నించడం శుభపరిణామం. అయితే మీరు గతం గతః అనే విషయాలను గుర్తుపెట్టుకుని, మిగతా లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచించండి.

ముఖ్యంగా ఎవరితో అయినా కలిసి జీవించేటప్పుడు, ఇక నుండి అయినా పూర్తి వివరాలను తెలుసుకోండి. అందుకు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ హెల్ప్ తీసుకోండి. మీరు రెగ్యులర్ గా బిజీగా ఉండే హాబీలను అలవాటు చేసుకోండి.

ఇలా చేయడం వల్ల పాత విషయాలను మరచిపోయి.. భవిష్యత్తు మీద ఆశలు పెరుగుతాయి. జరిగింది ఏదో జరిగిపోయింది గతాన్ని వదిలేసి వర్తమానంలో జీవించండి.

Desktop Bottom Promotion