Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నిద్రలో శృంగార కలలు పిచ్చెక్కిస్తున్నాయా? వాటి అర్థమేంటో తెలుసా?
నిద్రలో ఉన్నప్పుడు శృంగారానికి సంబంధించిన ఈ కలలు మీక్కూడా వస్తున్నాయా? ఆ కలల వెనక అసలు అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? శృంగార కలల వెనక అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలో కలలు వస్తుంటాయి. చాలా రకాల కలలు, వివిధ అంశాలపై, వ్యక్తులు, సంఘటనలు ఇలా ఎన్నో కలలు వస్తుంటాయి. నిజజీవితంలో జరిగిన చాలా సంఘటనలు, పడుకునే ముందు చేసే ఆలోచనలు, మాట్లాడిన వ్యక్తులు, చూసిన సినిమాలు ఇలా చాలా రకాలు కలలపై ప్రభావం చూపిస్తాయి. వాటి గురించి కలలు వస్తుంటాయి.

చాలా మందికి నిద్రలో శృంగార కలలు కూడా వస్తుంటాయి. అసలెందుకు శృంగార కలలు వస్తుంటాయి, వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలిసిన వారితో శృంగారం:
తెలిసిన వారితో శృంగారం చేసినట్లుగా కల వస్తే వారి పట్ల వ్యక్తీకరించని భావాలను కలిగి ఉన్నారని అర్థం. మీరు వారితో లోతైన కనెక్షన్ లేదా బంధాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందనడానికి ఇది సంకేతం కావొచ్చు.

అపరిచితుడితో శృంగారం:
ఇలా అపరిచిత వ్యక్తితో శృంగారం చేస్తున్నట్లు కలలు వస్తుంటే అవి మీ కోరికలను సూచిస్తాయి. తీర్చుకోలేని కోరికలు, ఎలా తీర్చుకోవాలో తెలియని కోరికల వల్ల నిద్రలో ఇలాంటి శృంగార కలలు వస్తుంటాయి.

ఎక్స్ తో శృంగారం:
ఈ రకమైన కల మీ ఎక్స్ తో పరిష్కరించని భావాలను లేదా సమస్యలను సూచిస్తాయి. తిరిగి వారితో సంబంధాన్ని కొనసాగించాలన్న ఆలోచన వల్ల కూడా ఇలాంటి కల వస్తుంది.

సెలబ్రిటీతో శృంగారం:
ఈ రకమైన కల కీర్తి లేదా గుర్తింపు కోసం కోరికను సూచిస్తుంది. సెలబ్రిటీతో అనుబంధించబడిన మీ వ్యక్తిత్వంలోని కొన్ని అంశాలను అన్వేషించవలిసిన అవసరాన్ని కూడా ఇది సూచిస్తుంది.

మల్టిపుల్ పార్ట్‌నర్స్‌తో శృంగారం:
ఈ రకమైన కల మీ వైవిధ్యాన్ని, ఉత్సాహాన్ని చూపిస్తుంది. కొత్తగా ట్రై చేయాలనుకునే వారు శృంగారం పరంగా కొత్త సంతృప్తి మార్గాలను అన్వేషించాలనుకునే వారికి ఇలాంటి కలలు రావొచ్చు.

బహిరంగ శృంగారం:
ఈ రకమైన కల శృంగారం పట్ల మీకున్న బలమైన కోరికను సూచిస్తుంది. లైంగికంగా విభిన్నంగా, ఎక్స్‌ట్రీమ్ లో ఉండాలని రోజూ కోరుకునే వారికి ఇలాంటి కలలు వస్తాయి.

స్వలింగ శృంగారం:
ఈ రకమైన కల స్వలింగ అనుభవాలు లేదా సంబంధాల కోసం మనసులో లోతుగా ఉండే కోరికలను సూచిస్తుంది. ఇది లైంగికతలోని విభిన్న కోణాలను అన్వేషించి, స్వీకరించవలసిన అవసరాన్ని కూడా సూచిస్తుంది.



Click it and Unblock the Notifications