For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నా బాయ్ ఫ్రెండ్ కు ఎప్పుడూ దాని మీదే ధ్యాస.. తన ఫోన్లో ఎక్కువగా అవే ఫోటోలు...’

|

ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ప్రేమలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ లో పరిచయం.. అది కాస్త ప్రేమగా మారడం చక చకా జరిగిపోతున్నాయి.

అలా తాజాగా ఓ యువతి ఫేస్ బుక్ ద్వారా ఓ యువకుడిని కలిసింది. తొలుత పరిచయం అయిన వారిద్దరూ అతి తక్కువ కాలంలోనే బాగా దగ్గరయ్యారు.

అంతేకాదు వారిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. అయితే ఆ మహిళకు తన ప్రియుడు తనను ప్రేమిస్తున్నాడా లేదా తన వద్ద ఉన్న డబ్బును అనే అనుమానం వచ్చింది. అసలు తనకు ఈ డౌట్ ఎందుకొచ్చింది... తన సందేహానికి సమాధానం దొరికిందో లేదో అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుుడు తెలుసుకుందాం...

ప్రతి ఒక్కరి పెళ్లిలో జరిగే ఈ గొడవలకు ఎలా బ్రేకులేయాలో తెలుసా...

ప్రైవేట్ జాబ్..

ప్రైవేట్ జాబ్..

హాయ్ ‘నా పేరు శిరీష(పేరు మార్చాం). నా వయసు 24 ఏళ్లు. నేను ఒక ప్రముఖ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ, నేను ఇంట్లో ఉండే జాబ్ చేస్తున్నాను. దీంతో నాకు కావాల్సినంత ఫ్రీ సమయం దొరుకుతుండేది. అప్పుడు నేను సరదాగా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుండగా.. సడన్ గా ఓ రోజు నా చిన్ననాటి మిత్రుడు ఫేస్ బుక్ లో పరిచమయ్యాడు.

ఏడాదిలోపే..

ఏడాదిలోపే..

వెంటనే తనకు రిక్వస్ట్ పంపాను. తను కూడా నన్ను గుర్తు పట్టి.. నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. అలా మేమిద్దరం ప్రతిరోజూ చాలా విషయాల గురించి పిచ్చపాటిగా మాట్లాడుకునేవాళ్లం. ఎంతలా మా ఇద్దరి పర్సనల్ విషయాలు కూడా చేసుకునేంతలా క్లోజ్ అయ్యాం.

ఈ మధ్యే..

ఈ మధ్యే..

అయితే ఇలా రోజూ మాట్లాడుతుండగా.. ఇటీవల తన మాటల్లో ఏదో తేడా కనిపించింది. తను నన్ను ప్రేమిస్తున్నట్టు.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాడు. అయితే తను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. నేను మాత్రం యావరేజ్ గా ఉంటాను. కానీ నేను తనకంటే రెండింతలు ఎక్కువగా సంపాదిస్తున్నాను.

ఈ రాశుల వారు ఆ విషయంలో ‘తగ్గేదే లే' అంటారట...! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

లగ్జరీ లైఫ్..

లగ్జరీ లైఫ్..

నా కన్నా సంపాదిస్తున్న తను పెళ్లి తర్వాత భవిష్యత్తులో లగ్జరీ లైఫ్ కావాలని అంటున్నాడు. ఈ విషయాన్ని నాతో చాలా సార్లు కూడా చెప్పాడు. తన ఫేస్ బుక్ పేజీలో అంతా లగ్జరీ లైఫ్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. తను నాలాగే లోయర్ మిడిల్ క్లాస్. కానీ ఇంత ఖర్చులు ఎలా చేస్తున్నారనే దానిపై నాకిప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.

ఎప్పుడు కలిసినా..

ఎప్పుడు కలిసినా..

ఇక మేమిద్దరం ఎప్పుడైనా సరదాగా డిన్నర్ కు లేదా ఏదైనా రెస్టారెంట్ కు బయటికి వెళ్లినప్పుడు అక్కడి బిల్ మొత్తం నాతోనే కట్టించేవాడు. దీంతో నాకు తనపై ఎక్కడో తేడా కొడుతోంది. నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. తను నన్ను లవ్ చేస్తున్నాడా? లదా నా డబ్బును ప్రేమిస్తున్నాడా అనే విషయం అర్థం కావడం లేదు. అయితే తను ఇంతవరకు నాకు ప్రపోజ్ చేయలేదు. తన ఫీలింగ్స్ గురించి కూడా నాకు చెప్పలేదు. అయితే, నేనే ఫస్ట్ ప్రపోజ్ చేసేలా సంకేతాలిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి' అని ఓ యువతి తన సమస్యను చెప్పుకుంది.

ఇద్దరూ సమానమే..

ఇద్దరూ సమానమే..

ఈరోజుల్లో పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు భర్త సంపాదిస్తే.. భార్య ఇంటి పరిస్థితులు చూసుకునేది. కానీ ఇప్పడు అంతా మారిపోయింది సంపాదన విషయంలో ఇద్దరూ దాదాపుగా సమానంగా ఉంటున్నారు. దీంతో ఇద్దరూ దాదాపు సమానమే.

అబ్బాయిలతో ‘ఆ కార్యం'లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!

అలా చెప్పలేం..

అలా చెప్పలేం..

మీ ప్రియుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా మీ వద్ద ప్రాపర్టీని, డబ్బును ప్రేమిస్తున్నాడా అనేది కేవలం సోషల్ మీడియా ఫొటోలను బట్టి మాత్రమే చెప్పలేం. ఎందుకంటే కళ్లకు కనిపించే అబద్ధాలు కూడా కావొచ్చు. కాబట్టి తనతో మీరు కొంత సమయం గడిపి, తన అభిరుచుల గురించి తెలుసుకోండి.

భవిష్యత్తు గురించి..

భవిష్యత్తు గురించి..

తనకు భవిష్యత్తు గురించి ఎలాంటి ఆశలు ఉన్నాయి.. ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే.. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారో కూడా తెలపండి. ఇవన్నీ చెప్పిన తర్వాత తను ఏం చెబుతారో బాగా వినండి. వారు చెప్పే విషయాన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు.

మనసుకు ప్రాధాన్యత..

మనసుకు ప్రాధాన్యత..

మరోవైపు మీరు యావరేజ్ గా ఉన్నారని, అభద్రతా భావానికి గురవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే అలాంటి ఫీలింగ్ నుండి బయటపడేందుకు మానసిక నిపుణులను కలవండి. ఎందుకంటే వారిని కలిసిన తర్వాత మీరు అందం కంటే మనసుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తను కూడా మీ మీమనసును చూసి ఇష్టపడి ఉండొచ్చు. కాబట్టి మీరు ఎక్కువగా ఫీల్ కావల్సిన అవసరం లేదు.

బంధం బలోపేతం కావడానికి..

బంధం బలోపేతం కావడానికి..

ఈ విషయంలో మీ ప్రియుడికి కూడా ఎలాంటి మినహాయింపులు లేవు. కాబట్టి మీరు మీ బాయ్ ఫ్రెండ్ తో ధైర్యంగా మాట్లాడండి. ప్రేమ విషయంలో డబ్బు విషయాలను పక్కనబెట్టి.. మీ రిలేషన్ షిప్ ను బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగండి. గందరగోళం లేకుండా తన మనసులో మాటలను తెలుసుకోండి.

English summary

My Boyfriend Wants to Live a Luxurious Life Does He Love Me or Money

Here we are talking about the 'My boyfriend wants to live a luxurious life does he love me or money'. Read on