Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
ప్రపోజ్ చేయాలంటే ముందుగా ఒక మూడ్ సెట్ చేయడం ముఖ్యమని అంటారు లవ్ గురూలు. మీరు ఈ ప్రపోజ్ డే రోజు మీ ప్రియమైన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీ లవ్ ప్రపోజ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
ఫిబ్రవరి వచ్చిందంటే చాలు మొగ్గలుగా ఉన్న ప్రేమ చిగురిస్తుంది. తడబాటుతో సతమతం అవుతున్న ప్రేమ పక్షులు హాయిగా విహరించడం మొదలుపెడతాయి. అందుకే ఫిబ్రవరిని ప్రేమికుల నెలగా పరిగణిస్తారు. ఇక ఫిబ్రవరి 14 అంటే వాలెంటైన్స్ డేని జరుపుకుంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూసే రోజు. వాలెంటైన్స్ డేకి ముందు ప్రపోజ్ డే జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7వ తేదీ నుండి ప్రారంభం అవుతుంది. ఆ రోజు రోజ్ డే, తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు.

వాలెంటైన్స్ వీక్ మొత్తం ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ప్రపోజ్ డే రోజున ప్రపోజ్ చేసుకుంటారు. ప్రపోజ్ చేయాలనుకున్న వారు చాలా మంది ఒక పొరపాటు చేస్తుంటారు. ఎదుటివారి మూడ్ ఎలా ఉంది, ఆ సమయంలో చెబితే వారు స్వీకరిస్తారో లేదో గుర్తించలేరు. అందుకే ప్రపోజ్ చేయాలంటే ముందుగా ఒక మూడ్ సెట్ చేయడం ముఖ్యమని అంటారు లవ్ గురూలు. మీరు ఈ ప్రపోజ్ డే రోజు మీ ప్రియమైన వారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీ లవ్ ప్రపోజ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

శృంగారభరితమైన స్థలాన్ని ఎంచుకోండి:
ప్రపోజ్ చేయడానికి ప్లేస్ ని ఎంచుకునేటప్పుడు మీ మొదటి ప్రాధాన్యత ఆ ప్లేస్ రొమాంటిక్ గా ఉండటం. మీరు ప్రేమ గురించి మాట్లాడాలనుకుంటే, మీ హృదయం కూడా సంతోషంగా ఉండాలి. దీని కోసం మంచి ప్లేస్ వెతకడం మొదటి చేయాల్సిన పని. మంచి రొమాంటిక్ మూడ్ కలిగించే ప్లేస్ అయితే మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. మీరు చేసే ప్రపోజ్ వారు యాక్సెప్ట్ చేస్తారు.

మంచి పర్యాటక ప్రదేశం:
ప్రపోజ్ డే రోజు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయండి. మీ ప్రియమైన వారితో మంచి పర్యాటక ప్రాంతానికి వెళ్లండి. ఆ ప్రాంతం మంచి రొమాంటిక్ గా ఉండేలా చూసుకోండి. హిల్ స్టేషన్, బీచ్ ఏరియా, ఘాట్ రోడ్డు ప్రకృతిని ఆస్వాదించేలా ఉండే మంచి పర్యాటక ప్రాంతానికి ట్రిప్ ప్లాన్ చేయండి. మీరు ఉండే ప్రాంతానికి కొద్దిగా దూరంలో ఉండే ప్రాంతమైతే బెస్ట్. ఆ ప్రాంతంలో మీరు మీ రోజువారీ ఒత్తిడికి, పనులకు దూరంగా ఉంటారు. మీరు మీ ప్రియమైన వారి గురించి తప్ప వేరే ఆలోచనలు ఉండవు. అలాంటి సమయంలో ప్రపోజ్ చేస్తే వారి పూర్తి ఏకాగ్రత మీపై ఉంటుంది.

తక్కువ రద్దీ ఉండాలి:
రణగొణ ధ్వనులు, కార్లు, బస్సులు రయ్ రయ్‌మంటూ వెళ్తున్న రోడ్డుపైన, లేదా కూడళ్లలో ప్రపోజ్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. ఎవరైనా చూస్తారో తెలియదు, లేదంటే ఎవరైనా వచ్చి ఢీకొంటారో తెలియదు. అంతమంది ముందు మీరు ప్రపోజ్ చేసినా భయం, జంకు, బిడియం వల్ల మీ ప్రియమైన వారు ఎలా రెస్పాండ్ అవుతారో ఊహించలేం. అందుకే రద్దీ తక్కువగా ఉండే ప్రాంతంలో ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేయండి. మీరు మీ ప్రియమైన వారికి ప్రపోజ్ చేయాలనుకున్నప్పుడు ఎవరూ లేకపోతే చాలా బాగుంటుంది. మీరు, మీ ప్రియమైన వారు మాత్రమే ఉంటే ఈ లోకంతో పనేం ఉంది. అలాంటి చోట మోకాలిపై కూర్చొని ఐ లవ్యూ డియర్ అనేయండి. ఆలోచించడానికే రొమాంటిక్‌గా ఉంది కదా.

రూఫ్‌టాప్ కేఫ్:
ఎక్కడికైనా పర్యాటక ప్రాంతానికి, హిల్ స్టేషన్, ఘాట్ రోడ్డు, తక్కువ రద్దీ ఉండే ప్రాంతాలను వెళ్లాలని ఉన్నా పరిస్థితులు, పరిమితులు అనుమతించకపోవచ్చు. అలాంటప్పుడు మీకు దగ్గరలో ఉండే మంచి కేఫ్ కు వెళ్లండి. రూఫ్‌టాప్ కేఫ్ అయితే ఇంకా బాగుంటుంది. అదీ దొరక్కపోతే తక్కువ రద్దీ ఉండే క్లాస్ గా కనిపించే కేఫ్ లకు తీసుకెళ్లండి. కొన్ని కేఫ్‌లు మంచి రొమాంటిక్‌గా ఉంటాయి. అలాంటి కేఫ్ ఎంచుకోండి. ఇక ప్రపోజ్ చేయడమే ఆలస్యం. నిర్భయంగా చేసేయండి.

పార్క్:
ప్రపోజ్ డే కోసం మీరు తక్కువ సమయం, తక్కువ బడ్జెట్ కోసం వెతుకుతుంటే పార్కులకు మించిన ప్రదేశాలు లేవనే చెప్పాలి. మీకు దగ్గరగా ఉండే మంచి పార్కు ఏదో గుర్తించండి. అక్కడ మీకు ప్రైవసీ ఉంటుందో లేదో తెలుసుకోండి. మీ ప్రియమైన వారిని అక్కడికి తీసుకెళ్లి ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసేయండి.



Click it and Unblock the Notifications
