Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
Happy Propose Day 2023:ఈ మెసెజ్ లతో ప్రపోజ్ చేస్తే... కచ్చితంగా సక్సెస్ అవుతారు...!
ప్రపోజ్ డే సందర్భంగా ఇలాంటి మెసెజెస్, కోట్స్, ఇమెజెస్ ను పంపండి..
వాలెంటైన్ వీక్ లో అత్యంత ప్రత్యేకమైన రోజు ప్రపోజ్ డే. ఈరోజున మీ మనసుకు నచ్చిన వారిని ఎలాంటి భయం లేకుండా మీ ప్రేమను వ్యక్తం చేసేందుకే.. ప్రపోజ్ డే అద్భుత అవకాశాన్ని ఇస్తుంది.

ఇది వాలెంటైన్ డే యొక్క రెండో రోజు వస్తుంది. దీన్ని ఫిబ్రవరి 8వ తేదీన జరుపుకుంటారు. ఈరోజున ప్రేమలో ఉన్న వారందరికీ ఈరోజు చాలా ప్రత్యేకమైనది. మరోవైపు వన్ సైడ్ లవ్ లో ఉండే వారు తమ మదిలోని భావోద్వేగాలను తమ ప్రియుడు/ప్రియురాలికి ప్రపోజ్ చేసే లక్ష్యంగా ఈరోజును జరుపుకుంటారు.

కొందరికి జీవితంలో ఇది కేవలం ఒకరోజుగా ఉంటే.. మరికొందరికి మాత్రం అతిముఖ్యమైన, మరచిపోలేని మధురమైన రోజుగా మారుతుంది. ఎందుకంటే, చాలా రోజులుగా మనసులో ఉన్న భారానికి ఈరోజు సమాధానం లభిస్తుంది. ఈరోజున కేవలం కొత్తగా ప్రపోజ్ చేసుకునేవారే కాకుండా, ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు, లవ్ కపుల్స్ కూడా ఈరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు.

దీనంతటికి కారణం, తమ ప్రేమను తరచుగా వ్యక్తపరచడం ద్వారా వారి మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. అందుకే వాలెంటైన్స్ డేను పూర్తి స్థాయిలో జరుపుకోవాలి అనుకునేవారు, ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్, రోజ్ ఫ్లవర్స్ తో పాటు తమ ప్రియుడు/ప్రియురాలికి ఇష్టమైన చాక్లెట్లు లేదా వస్తువులను బహుకరించడం ద్వారా, తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. మరికొంతమంది తమ మదిలోని భావాలను వారిని తెలియజేయాలనే లక్ష్యంతో, తమ ఆలోచనలను ఒక లెటర్ రూపంలో, లేదా ఒక కవితగా రాసి ప్రపోజ్ చేస్తుంటారు.

మీ ప్రేమ బంధానికి..
ఒక మనిషి తన జీవితంలో సంపూర్ణ విజయాన్ని సాధించాడంటే.. అందులో ముఖ్యంగా తమకిష్టమైన భాగస్వామిని కలిగి ఉండటం కూడా ప్రధానంగా ఉంటుంది. అలాంటి ప్రేమను పొందడం వల్ల జీవితం సంపూర్ణమవుతుంది. ఇలా మీరు కూడా ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నారా?, ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రపోజ్ డే సందర్భంగా మీ ప్రేమను తెలియజేసి, మీ ప్రేమ బంధానికి పునాదులు వేసుకోండి...

నీతో జీవితాంతం..
జీవితంలో సంతోషంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ నా మనసుకు మాత్రం నీతో జీవితాంతం ఉంటేనే సంతోషం. అందుకే ప్రపోజ్ డే రోజున నీకు ప్రపోజ్ చేస్తున్నా.
హ్యాపీ ప్రపోజ్ డే

నువ్వు లేని జీవితం..
ఈ ప్రపోజ్ డే రోజున నా మది నిన్ను మాత్రమే ప్రేమిస్తుందని నువ్వు తెలుసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను.
హ్యాపీ ప్రపోజ్ డే

నా మదిలోని ప్రేమను నీకు తెలిపేందుకు అత్యంత ప్రత్యేకమైన రోజును సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు నాకు జీవితాంతం తోడుంటావని ఆశిస్తున్నాను.
హ్యాపీ ప్రపోజ్ డే

ఒక్క మాట నన్ను ప్రేమించాను అని చెప్పు.. జీవితం మొత్తం నిన్ను హ్యాపీగా ఉండే లోకాన్నే క్రియేట్ చేస్తా..
హ్యాపీ ప్రపోజ్ డే

నువ్వు నడిచేటప్పుడు నీ నీడనవుతా.. నీ కాలికి ముల్లు గుచ్చుకుంటే.. నా పంటితో తీస్తా.. నిన్ను తల్లి కడుపులో బిడ్డలా చూసుకుంటానని మాటిస్తున్నాను..
హ్యాపీ ప్రపోజ్ డే

నీకు తప్ప వేరేవ్వరికి..
డార్లింగ్, నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుండి, ఇది ఒక అద్భుత కథలా అనిపిస్తుంది. నువ్వే నాకు అద్భుతమైన భాగస్వామి. ఈ జన్మలో ఆ స్థానం నీకు తప్ప వేరేవ్వరికి ఇవ్వలేను.
హ్యాపీ ప్రపోజ్ డే



Click it and Unblock the Notifications