For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవారు మగువల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

అయితే ప్రస్తుతం చాలా మంది బంధం విషయంలో అనేక పొరపాట్లు చేస్తున్నారు. మన కోసం ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తుంటారో.. మన కోసం ఎవరైతే ఎక్కువగా ఎదురుచూస్తుంటారో వారినే మనం ఎక్కువగా బాధపెడతుంటాం.

|

మన జీవితంలో మనం ఎలా ఉన్నా పర్వాలేదు.. కానీ మనల్ని ప్రేమించే మనిషి ఒక్కరు ఉంటారు. అందులోనూ వారు మీ భార్య లేదా ప్రియురాలు అయితే ఆ మనిషిని బాధపెట్టకుండా సంతోషంగా చూసుకుంటే మీ బంధం చాలా బలంగా ఉంటుంది.

relatinships last when partners do these things

అయితే ప్రస్తుతం చాలా మంది బంధం విషయంలో అనేక పొరపాట్లు చేస్తున్నారు. మన కోసం ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తుంటారో.. మన కోసం ఎవరైతే ఎక్కువగా ఎదురుచూస్తుంటారో వారినే మనం ఎక్కువగా బాధపెడతుంటాం. ఇలాంటివి ఎక్కువగా ప్రేమ మరియు వివాహ బంధంలోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

relatinships last when partners do these things

ఇలా జరగకుండా మీ బంధం అత్యంత బలంగా మారిపోవాలంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా మగమహారాజులు చాలా విషయాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే సంసారం అనే చదరంగం ఆట సాఫీగా సాగుతుంది.

relatinships last when partners do these things

అయితే మనం నిత్యం చూసే జంటలలో కొందరి సంబంధాలలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై గొడవలు జరుగుతూ ఉంటాయి. చీటికి మాటికి వారు తిట్టుకుంటూ కాపురం చేస్తుంటారు. ఇలాంటి వారి మధ్య సంబంధాలు అంత మంచిగా ఉండవు. అయితే ఇలాంటి విషయాలను గమనించి, ఎక్కడ లోపం ఉందో గమనించాలి. వెంటనే అలాంటివి మరోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలి.

relatinships last when partners do these things

ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మగమహారాజులు అస్సలు తప్పులు చేయకూడదు. ఇలాంటి విషయాలను తెలుసుకుని, జాగ్రత్తగా మసలుకుంటే, మీ రిలేషన్ షిప్ లో ఎలాంటి ఇబ్బందులు అనేవే ఎదురవ్వవు.

relatinships last when partners do these things

మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో.. ఆమెను ఎంతలా గౌరవిస్తున్నారో.. ఏవైనా చిన్న అపార్థాలు చోటు చేసుకుంటే, సర్దుకుపోతూ ముందుకు దూసుకెళ్లండి. ముఖ్యంగా అబద్ధాలను చెప్పకుండా.. మీ భాగస్వామి యొక్క అభిప్రాయాలను గౌరవించండి. వారి భావోద్వేగాలను ఎప్పటికీ తక్కువ చేసి మాట్లాడకండి. వీటితో పాటు మగాళ్లు బంధాల విషయంలో చేసే తప్పులేవో.. దాని వల్ల ఎదురయ్యే పరిణామాలేంటో తెలుసుకోవడం మంచిది. ఇంతకీ ఆ విషయాలేంటో మీరే చూడండి...

భాగస్వామిపై అనుమానం..

భాగస్వామిపై అనుమానం..

వివాహ బంధంలో చాలా మంది మగవారు చేసే అతి పెద్ద తప్పు. ఇదే భాగస్వామిని అనుమానం పెంచుకోవడం.. ఆమెను నమ్మకపోవడం. ఎందుకంటే ఇదే బంధాన్ని బలపరచడంలో చాలా కీలకం. భాగస్వామిపై అనుమానం పెంచుకుంటే వారికి అవమానమేనని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళలు మానసికంగా మగవారి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మీతో సంతోషంగా గడపాలని ఎన్నో కలలు కంటారు. అయితే మీరు అనుమానించడం.. వారిని పదే పదే ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే వారు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఎలాంటి అనుమాలను పెట్టుకోకండి.

మాట తప్పొద్దు..

మాట తప్పొద్దు..

చాలా మంది అమ్మాయిలు తమ రిలేషన్ షిప్ విషయంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. కానీ మగవారు మాత్రం చంచలత్వంపై ఆసక్తి చూపుతారు. అందుకే మీరు మీ భాగస్వామికి ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండండి. ఇలాంటి వాటినే అమ్మాయిలు ఎక్కువగా ఆశిస్తారు. అయితే మీరు పదే పదే మాటతప్పడం, అబద్ధాలు చెప్పడం వంటి వాటిని అస్సలు ఇష్టపడరు. కాబట్టి మీరు మాట మీద నిలబడటం అనేది చాలా ముఖ్యం.

అర్థం చేసుకోకపోతే..

అర్థం చేసుకోకపోతే..

చాలా మంది మగవారు బంధం విషయాలలో సాధారణంగా చేసే తప్పులలో ఇది కూడా ముఖ్యమైనదే. మీ భాగస్వామి చేసే పనులను అర్థం చేసుకోకపోవడం. వారు ఏ పని చేసినా ప్రతి దానివెనుక ఓ కారణం ఉంటుంది. దీని వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే, మీరు వారితో నేరుగా మాట్లాడి, అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికీ ఇంకా ఏమైనా సందేహాలుంటే, మీ భాగస్వామిని ప్రశ్నించి సమాధానం రాబట్టాలి. అంతేకానీ మీరు వారిని అర్థం చేసుకోకుండా ప్రతిసారీ చీటికి, మాటికి గొడవ పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందుగా మంచిగా మాట్లాడటం అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

గౌరవం విషయంలో..

గౌరవం విషయంలో..

ఏ బంధం విషయంలో అయినా గౌరవం, నమ్మకం అనేది చాలా కీలకం. ఎందుకంటే మీరిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీ భాగస్వామికి ఏమి మాట్లాడినా మీరు గౌరవించాలి. అలాగే మీరు ఆమె అభిరుచులు, లక్ష్యాలను కూడా గుర్తుంచుకోవాలి. ఆమె తీసుకున్న నిర్ణయాలలో ఏవైనా లోపాలుంటే తెలియజేయండి. సరైనవైతే మీరు ఆమెకు మద్దతు ఇవ్వాలి. సామాజిక పరంగా లేదా ఇంకా ఏ ఇతర రంగం పరంగా అయినా ఆమె ఎదిగేందుకు మీరు అవకాశమివ్వాలి. ఇలా చేస్తే మీ ఇద్దరి మధ్య బంధం కచ్చితంగా బలపడుతుంది.

బాధపడేలా మాట్లాడొద్దు..

బాధపడేలా మాట్లాడొద్దు..

మనలో ఎవ్వరికీ మన చేతికి ఉండే ఐదు వేళ్లు కూడా ఒకే రకంగా ఉండవు. అలాగే అందరూ ఒకే రకంగా ఆలోచించలేరు. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆలోచన ఉంటుంది. దీన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. మీ భాగస్వామి మీకు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే, మీరు అందుకు అవకాశం ఇవ్వాలి. అంతేకానీ వారి మాటలను పట్టించుకోకుండా, కేవలం ఆమె నుండి సహాయం తీసుకుంటూ.. ఆమె చెప్పిన దానికి ఎదురుమాట్లాడుతూ బాధపెడితే మీకు ఇబ్బందులు ప్రారంభమవుతాయి.

సానుకూల స్పందనలు..

సానుకూల స్పందనలు..

మీరు మీ భాగస్వామి యొక్క తప్పులను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకుంటే మీ బంధం ఎప్పటికీ బలపడదు. మీరు ఎప్పుడైతే తెలిసీ, తెలియక చేసిన తప్పులను క్షమించడం మొదలుపెడతారో.. అప్పటి నుండి వారిలో సానులకూలత మొదలవుతుంది. అలా మీ బంధం మరింత బలపడుతుంది.

ప్రతి క్షణం మీతోనే..

ప్రతి క్షణం మీతోనే..

వివాహ సంబంధంలో ఆధిపత్యం అనేది ఎప్పటికీ పనికి రాదు. మీరు అన్ని మీ కంట్రోల్ ఉండాలనుకునే ధోరణి ఉంటే, వెంటనే అది మానుకోండి. మీ భాగస్వామి అభిరుచులకు, అభిప్రాయాలకు తగిన స్వేచ్ఛ ఇవ్వండి. ఆమెతో మాట్లాడేందుకు తగిన సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే ప్రతి క్షణం మీతోనే గడపాలని ఆమె ఎక్కువగా కోరుకుంటారు. అలా కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. కాబట్టి వీలైనంత మేరకు మీరిద్దరూ కలిసి ఉండాలి. అయితే అప్పుడప్పుడు మీరు విరామాలు కూడా ఇస్తూ ఉండాలి.

English summary

relatinships last when partners do these things

Here we talking about relationships last when partners do these things. Read on,
Story first published:Friday, May 1, 2020, 18:27 [IST]
Desktop Bottom Promotion