Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
లాక్ డౌన్ వేళ ఇంట్లో నుండే రొమాంటిక్ ప్రపోజ్... ఇలా చేస్తే మీకు ఎవ్వరైనా పడిపోవటం ఖాయం...!
అదే సమయంలో వారికి ఇష్టమైన రెస్టారెంట్ లో బోజనం చేయలేదని బాధపడటం మానేసి, వారి వంట గదుల్లోనే భోజనానికి తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట.
కరోనా వైరస్, లాక్ డౌన్ పొడిగింపు వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం వసంత కాలం కావున మీరు ఇంటి వెలుపలే ఏదైనా రొమాంటిక్ ప్రపోజ్ గురించి ప్లాన్ చేస్తున్నారా? అయితే ఆ ప్రపోజ్ వల్ల రొమాన్స్ త్యాగం చేయాల్సి వస్తుందా? లేదా అది రతి క్రీడకు ఉపయోగపడుతుందా అనే విషయాలపై ఇటీవలే జేమ్స్ అలెన్ సంస్థ సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది ఇలాంటి ప్రపోజ్ వల్ల తమ వివాహ ప్రణాళికలను బాగా ప్రభావితం చేసిందని వెల్లడించారట. అంతేకాదు అనేక మంది పురుషులు మరియు మహిళల్లో చాలా మంది ప్రపోజ్ అంటే ఎక్కువగా ప్రయాణం చేయడం కాదని చెప్పారట. సాధ్యమైనంత వరకు పనిలో ఉన్నప్పుడే కాస్త కొత్త ప్రపోజ్ చేసేలా ప్లాన్ చేయొచ్చని చెప్పారట.

మరోవైపు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చాలా మంది జంటలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అయితే అదే సమయంలో వారికి ఇష్టమైన రెస్టారెంట్ లో బోజనం చేయలేదని బాధపడటం మానేసి, వారి వంట గదుల్లోనే భోజనానికి తయారు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అలాగే ప్రస్తుతం సమ్మర్ కాబట్టి బీచ్ కు వెళ్లలేమని ఫీల్ అయ్యేవారు.. తమ పడక గదిని ఒయాసిస్ గా మార్చడం ద్వారా బీచ్ ను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పైవన్నీ ప్రస్తుతం జీవిస్తున్న జంటలందరికీ, అన్ని రంగాల వారికీ వర్తిస్తుందని తాము భావిస్తున్నామన్నారు.

వీటితో పాటు కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే పరమితమైన జంటలు ప్రస్తుతం తమ ప్రియుడు/ప్రియురాలిని ఎలా ఆశ్చర్యపరచాలి? వారిని ఎలా కలవాలి? వారిని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తుంటే.. అలాంటి వారి కోసం ప్రపోజ్ మార్గాలను తీసుకొచ్చాము. వాటిని చూడండి.. నచ్చితే మీరు ప్రయత్నించండి...

పాత విషయాలను గుర్తు చేసుకోవడం..
కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జంటలు, ప్రేమికులు తమ మధ్య జరిగిన చిలిపి గొడవలు, రొమాంటిక్ ముచ్చట్లు గుర్తు చేసుకుంటే చాలా రొమాంటిక్ గా ఉంటుదట.అలాగే మీ రిలేషన్ షిప్ కు సంబంధించిన పాత ఫొటోలు మరియు వీడియోలను ఓ చోట చేర్చండి. వాటిని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా టివికి కనెక్ట్ చేసి టివిలో స్లైడ్ షో ప్లే చేయండి. ఆ సమయంలో లైట్లన్నీ ఆపేయండి. కానీ కొవ్వొత్తులను మాత్రం వెలిగించండి. అప్పుడు మీకు సినిమా థియేటర్ అనేది కూడా గుర్తుకు రాదు. చాలా అద్భుతంగా ఉంటుంది.

మీకిష్టమైన వంట..
మీరు ఎప్పుడైనా రెస్టారెంట్ కు వెళ్లి ఇష్టమైన భోజనం చేస్తుంటారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున, మీరు మీకు ఇష్టమైన ఆ వంటకాన్ని స్వయంగా మీ చేతులతోనే తయారు చేసే ప్రయత్నం చేయండి. మీరు వండిన వంట తిన్నప్పుడు, అది రుచికరంగా ఉంటే.. దాన్ని మీరు ఆస్వాదించడమే కాకుండా మీ జీవిత భాగస్వామిని కూడా ఆశ్చర్యపరచవచ్చు.

వర్చువల్ రిసెప్షన్ పార్టీ...
సాధారణ రోజుల్లో చాలా మంది జంటలు ప్రైవేటు పార్టీలు నిర్వహించుకోవడం లేదా ప్రైవేట్ గా ప్రపోజ్ చేయడం వంటివి చేస్తుంటారు. తర్వాత స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో పెద్ద వేడుకలా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇవేవీ లేవని బాధపడే బదులు, మీరు ఆన్ లైన్లో మీ ప్రియమైన వారితో ఎంగేజ్ మెంట్ కూడా జరుపుకోవచ్చు. ఇటీవల మన దేశంలో ఈ ట్రెండింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇందుకోసం మీ సన్నిహితులను వీడియో కాల్ కు ఆహ్వానించండి. తర్వాత అందరినీ ఆశ్చర్యపరచండి. ఇలా మీరు వర్చువల్ రిసెప్షన్ పార్టీని హోస్ట్ చేస్తే, మీకు మంచి రిఫ్రెష్ లభిస్తుంది. అంతేకాదు ఇలాంటి వాటికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు.

డెకరేషన్ చేయడం..
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంటే, మీరు మీ అందానికి తగ్గట్టు మీ రూమ్ డెకరేట్ చేయండి. దీని ద్వారా మీరు ప్రయాణించాలనుకున్న గమ్యాన్ని సృష్టించండి. మీరు మీకు ఇష్టమైన బహిరంగ ప్రదేశంలో ప్రపోజ్ చేయలేకపోతే, మీరు మీ ప్రేమ నగరాన్ని మీ వద్దకే తీసుకురావచ్చు..

గ్రూప్ సాంగ్స్..
మీరు ప్రపోజ్ చేసినప్పుడు లేదా ఎంగేజ్ మెంట్ వేడుక సమయంలో మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడానికి మీరు బ్యాండ్ ను లేదా డిజేను ఏర్పాటు చేసుకుంటారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వల్ల ఇది సాధ్యపడదు కాబట్టి, స్కైప్ లేదా జూమ్ ద్వారా మీరు కొంత మంది సింగర్స్ ను ముందే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీ భాగస్వామి కచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు.

ఒక ప్రైవేట్ స్థలానికి..
లాక్ డౌన్ లేకపోతే మీకు కాబోయే వారిని ఏదైనా పార్కుకు లేదా ఏదైనా మంచి ప్రదేశానికి ప్రత్యేకంగా తీసుకెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు కాబట్టి.. మీరు మీ భాగస్వామికి ప్రపోజ్ చేసేందుకు సరిగ్గా సూర్యాస్తమయం చూడటానికి ఒక ప్రైవేట్ స్థలాన్ని కనుగొనండి. ఆపై ఉంగరాన్ని తీసి వారిని ఆశ్చర్యపరచండి.



Click it and Unblock the Notifications
