Latest Updates
-
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.! -
స్వీట్ ప్రేమికులకు పర్ఫెక్ట్ ట్రీట్..బాదం సేమియా పాయసం ఇలా చేశారంటే అదిరిపోతుంది! -
వాస్తు ప్రకారం తులసి మొక్క వద్ద ఏ వస్తువులు ఉంచకూడదో తెలుసా.. లేదంటే అరిష్టాలు తప్పవు.! -
మిగిలిన అన్నాన్ని ఇలా వాడారంటే.. ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తినాల్సిందే!
వివాహమైన నాటి నుండి మీ భాగస్వామి మీ విరహ వేదనను పట్టించుకోలేదా? అయితే ఇలా ట్రై చెయ్యండి...
మీరు పెళ్లి చేసుకున్నా మీ భాగస్వామితో కలయికలో పాల్గొనలేదా? అయితే ఇతరులపై మోజు పెరుగుతోందా?
ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా అన్నం లేకపోయినా ఆకలిని తట్టుకుని బతకగలడు. నీళ్లు తాగకపోయినా కొన్ని గంటల వరకు అడ్జస్ట్ అవుతాడు. అయితే యవ్వనంలో ఉండే వారు శృంగారంలో పాల్గొనలేకపోతే మాత్రం తట్టుకోలేరు.

పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు శృంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కొంతమంది జంటలు మాత్రం తమకు పెళ్లి అయినా కూడా తాము ఇంకా ఆ కార్యంలో అస్సలు పాల్గొనలేదని.. ఇది మమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 20 నుండి 20 శాతం మంది ప్రజలు తెలిపారు.

ఇలాంటి సందర్భంలో మీరు మీ జీవితంలో శృంగార మజాను పొందాలని భావిస్తే.. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే మీ భాగస్వామి అందరిలా ఉండకపోవచ్చు.

మీరు పెళ్లి చేసుకున్న మీ భాగస్వామి ఇతరుల కన్న భిన్నంగా ఉండొచ్చు. కొందరేమో ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని, తమ లైంగిక జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపాలని భావిస్తారు. మరికొందరేమో అస్సలు ఆ కార్యం పేరేత్తగానే ఆమడ దూరం పరుగెత్తుతారు. మరికొందరు మాత్రం వారానికి ఒకసారి మాత్రమే ఆ కార్యంలో పాల్గొంటే సరిపోతుందనే భావనలో ఉన్నారని తేలింది. ఈ నేపథ్యంలో శృంగారంపై ఆసక్తి తక్కువగా ఉన్న వారిని దానిపై ఇంట్రస్ట్ పెరిగేలా చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి...

ముచ్చట్ల ద్వారా..
ఏ సంబంధంలో అయినా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ముచ్చట్లతో పది మందిని కలుపుకోవడం. ఇదే సూత్రాన్ని మీ భాగస్వామి దగ్గర ఎగ్జిక్యూట్ చేయండి. ఈ మొత్తం పరిస్థితి గురించి మీకు ఎలా అనిపిస్తుందో వారికి తెలియజేయండి. మీ ఇద్దరు కలిసి ఆ కార్యంలో పాల్గొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. అంతకుముందు మీరు శృంగారం గురించి ఏమనుకుంటున్నారో మీ భాగస్వామికి తెలియజేయండి. మీకు తెలిసిన విషయాలను మీ జీవిత భాగస్వామికి తెలియజేయండి.

శృంగారానికి ప్రాధాన్యత..
మీరు ఏ విధంగా శృంగారంలో పాల్గొనాలనుకుంటున్నారో.. అందుకు మీ భాగస్వామి కూడా సిద్ధంగా ఉన్నారో లేదో మీరు ముందుగానే తెలుసుకోవాలి. మీరిద్దరూ వ్యక్తిగత జీవితాలలో చాలా బిజీగా ఉంటే, మీకు ఇలాంటి కార్యం వల్ల తగినంత విశ్రాంతి దొరుకుతుంది. అంతేకాదు మీరిద్దరూ ఏకాంతంగా గడపడానికి.. ఆనందంగా గడిపేందుకు కొంత సమయం కచ్చితంగా కేటాయించాలి.

కొన్ని కారణాల వల్ల ఆలస్యం..
మీరు మరియు మీ భాగస్వామి పెళ్లి చేసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనేందుకు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నప్పటికీ, కొన్నిసార్లు శృంగారంలో పాల్గొనేందుకు కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతుంది. అలాంటి సమయంలో మీరు ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. ప్రశాంతంగా.. నెమ్మదిగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మీరు వేగంగా మీ భాగస్వామి మీదకు దూసుకెళితే.. అది మీ వివాహ సంబంధంలోనే చిచ్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యాన్ని ఒక విధమైన ఒత్తిడిలా కాకుండా.. సహజంగా నిర్వహించాలి.

ఏమి ప్రారంభించాలో..
మీరిద్దరూ కలిసి ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆనందం అనేది కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ జీవిత భాగస్వామిని ఏమి ప్రారంభించాలో అడగండి. వారికి కొత్త కోరికలపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీరు కూడా అందుకు సిద్ధం కండి.

అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే..
లైంగిక మనస్తత్వ శాస్త్రంపై పోర్న్ సినిమాలు ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి సినిమాలలోని సెషన్లను చాలా మంది ఇష్టపడతారు. కానీ అది నిజజీవితంలో సాధ్యం కాదని మీరు గుర్తించాలి. అప్పుడే అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు వర్చువల్ రిలేషన్ షిప్ కు బదులుగా, మీరిద్దరూ కలిసి లైంగిక సంబంధం పెట్టుకోవాలనే కోరికను పెంచుకోవాలి.

హస్తప్రయోగం..
చాలా మంది జంటలు హస్తప్రయోగం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. వారు తమ భాగస్వాములతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు అంగస్తంభనను కూడా నిర్వహించలేరు. దీనికి బదులుగా మీరు మీ జీవిత భాగస్వామిని సరైన ట్రాక్ లోకి తెచ్చేందుకు.. మీరంటే ఎక్కువగా ఇష్టపడేందుకు మీరు వారి వీక్ నెస్ లను తెలుసుకోవాలి.

లోపాలను అర్థం చేసుకోవాలి..
మీరు మరియు మీ జీవిత భాగస్వామి శృంగారం చేయడం ఆపేస్తే.. మీ సంబంధంలో కొన్ని అంతర్లీన సమస్యలున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ సమస్యలు లోతుగా ఉన్నాయని మీరు భావిస్తే, ముందుగా వాటి పరిష్కారానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు సరైన ఫలితాలు వస్తాయి.



Click it and Unblock the Notifications