Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
Valentine’s Day Special:ప్రేమికుల రోజున ఒంటరిగా ఉంటే.. ఈ ప్రాబ్లమ్స్ మీరూ ఫేస్ చేసే ఉంటారు...!
సింగిల్ గా ఉండే వారు వాలెంటైన్స్ డేకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో మీరు చూసెయ్యండి.
వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమికుల్లో ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఈ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు తెగ హడావుడి చేస్తుంటారు. ఇదే సమయంలో తమ మనసుకు నచ్చిన వ్యక్తుల అందమైన రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేయడం..

కొందరేమో ఖరీదైన గిఫ్టులివ్వడం.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రేమను ప్రపోజ్ చేస్తుంటారు. ఇక ప్రేమలో ఉన్న వారైతే.. తమ భాగస్వామిని సర్ ప్రైజ్ చేసేందుకు ఏవేవో కొత్త ఆలోచనలు చేస్తుంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే వాలెంటైన్స్ డే వేళ సింగిల్ గా ఉండే వారికి లవ్ బర్డ్స్ నుండి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయట. తమ స్నేహితులందరిలో అందరికీ లవర్స్ ఉండటం.. ఆ గ్రూపులో తామొక్కటే సింగిల్ గా ఉంటే మరిన్ని సమస్యలు పెరుగుతాయట. ఇలాంటి సమయంలో మీకు ఎదురయ్యే కొన్ని ఫన్నీ సంఘటనలేంటి. సాధారణంగా సింగిల్ గా ఉండే వారు వాలెంటైన్స్ డే వేళ ఎలా ఫీలవుతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రొమాంటిక్ ఫొటోలు, వీడియోలు..
వాలెంటైన్స్ డే సమయంలో ప్రేమికులంతా కొత్త లోకంలో విహరిస్తున్నట్లు ఫీలవుతూ ఉంటారు. లవ్ కపుల్స్ గాల్లో ఆనందంగా, హాయిగా తేలిపోతుంటారు. ముఖ్యంగా తమ లవర్ తో కలిసి లాంగ్ డ్రైవ్ కి వెళ్లడం, సినిమాలకు, షికార్లకు వెళ్లడం వంటివి చేస్తుంటారు. అంతటితో ఆగకుండా తాము చేసే ప్రతి యాక్టివిటీని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. నా ప్రియుడు నాకు అదిరిపోయే బహుమతి ఇచ్చారు. నా ప్రియురాలు నాకు అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చిందని స్టేటస్ లు పెడుతుంటారు. ఇలాంటి పోస్టులు చూస్తూ మీకు ఇబ్బందిగా అనిపిస్తే.. ఈ వారం లేదా పది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే చాలు.

సింగిల్ గా మిగిలితే..
మీ ఫ్రెండ్స్ అందరూ వాలెంటైన్స్ డేను బాగా ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం సింగిల్ గా మిగిలిపోతారు. అప్పుడే మనలో చాలా మంది ప్రేమలో పడటానికి.. పెళ్లి చేసుకోవడానికి.. ఎందుకు అంతలా తొందరపడతారో.. మనం కూడా పెళ్లి చేసుకునేంత పెద్దవారై పోయామా.. మొన్నే కదా స్టడీస్ అయిపోయింది.. నిన్నటి సంవత్సరంలోనే కదా జాబ్ లో జాయిన్ అయ్యింది అనుకుంటూ ఉంటారు.

మీ కంటూ ఓ పార్ట్నర్..
ఇప్పటికీ మీరు ఒంటరిగా ఉంటే.. మీ కోసం ఒక అందమైన అమ్మాయిని లేదా అబ్బాయిని వెతికేందుకు మీ ఫ్రెండ్స్ తెగ ట్రై చేస్తుంటారు. లేదా కొందరు అలా నటిస్తుంటారు. ఇంకా కొందరైతే ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్లో ఎవరైనా బాగున్నారని చెబితే చాలు.. ఇంకేంటి వారితో డేట్ కి వెళ్లొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. అలాంటోళ్లకి నాకు అలాంటి అభిప్రాయం ఉంటే ముందు నీకే చెబుతాలే అంతవరకు నన్ను వదిలేయ్ అంటూ ఉంటారు. అయితే వాస్తవం ఏంటంటే.. మీకు కావాల్సిన భాగస్వామిని మీరే వెతుక్కోవాలి.

పార్టీల్లో పాసులు..
వాలెంటైన్స్ డేకు ముందు కొందరు ప్రేమికులు రచ్చ రచ్చ చేస్తుంటారు. తమ స్నేహితులకు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తుంటారు. అలా ఇవ్వడమే కాదు.. వాటికి కొన్ని కండిషన్స్ పెడుతుంటారు. ఆ పార్టీకి వచ్చేవాళ్లు కచ్చితంగా కపుల్స్ గా రావాలని.. అలాంటి వారికే పాసులు జారీ చేయాలని సెక్యూరిటీకి చెబుతుంటారు. అయితే సింగిల్ గా ఉండే వారు అలాంటి సమయంలో తమకంటూ ఎవరైనా పార్ట్నర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.

కొత్త లవ్ కోసం..
వాలెంటైన్స్ డే వస్తుందంటే చాలు.. చాలా మంది తమకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి సింగిల్ గా ఉన్నాడని తెలిస్తే చాలు.. ‘ఐ లవ్ యూ' అని చెప్పడం.. డేట్ కి పిలవడం వంటివి చేస్తుంటారు. ఒకవేళ ప్రేమించినా కూడా ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని భయపడుతూ ఉంటారు. అయితే పెద్దలు కుదిర్చిన పెళ్లిని కూడా అస్సలు ఇష్టపడరు.

సింగిల్ గా ఉంటేనే..
వాలెంటైన్స్ డే సమయంలో చాలా మంది ఇలా అనుకుంటారు. ‘అందరికీ లవర్స్ ఉన్నారు. నా ఒక్కరికే ఎందుకు లేరు? నేను మరీ అంత వికారంగా ఉంటానా? లేక నా అందానికి ఎవ్వరూ సరిపోవడం లేదా? నాకు కూడా ఓ లవర్ ఉంటే ఈ సమయంలో గిఫ్టులు వచ్చేవేమో.. ఒక్కసారి టిండర్ వంటి యాప్ లో డౌన్లోడ్ చేసి చూసేద్దాం.. అయినా ఇప్పుడు వాలెంటైన్స్ డే బహుమతుల కోసం చూస్తే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి..సోలో బతుకే సో బెటర్' అని అనుకుంటూ ఉంటారు.
వాలెంటైన్స్ డేకు ముందు కొందరు ప్రేమికులు రచ్చ రచ్చ చేస్తుంటారు. తమ స్నేహితులకు పెద్ద పెద్ద పార్టీలు ఇస్తుంటారు. అలా ఇవ్వడమే కాదు.. వాటికి కొన్ని కండిషన్స్ పెడుతుంటారు. ఆ పార్టీకి వచ్చేవాళ్లు కచ్చితంగా కపుల్స్ గా రావాలని.. అలాంటి వారికే పాసులు జారీ చేయాలని సెక్యూరిటీకి చెబుతుంటారు. అయితే సింగిల్ గా ఉండే వారు అలాంటి సమయంలో తమకంటూ ఎవరైనా పార్ట్నర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications