పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి అలా పడుకుంటే... వచ్చే పాజిటివ్ ఫలితాలేంటో తెలుసా...

పార్ట్ నర్ తో కలిసి పడకగదిలో అలా నిద్రపోతే వచ్చే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి మనిషికి నిద్ర, ఆకలి, సెక్స్ అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా మనుషులు తట్టుకోలేరు. అయితే మనలో ఎవ్వరు ఎంత తిండి తిన్నా.. ఎంత సంపాదించినా.. ప్రతిరోజూ ప్రశాంతంగా పడుకోవాలని కోరుకుంటారు.

Study: Does Partner Sleep Strengthen Your Relationship Bond

కానీ అది అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న జంటలకు ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. అయితే కేవలం పెళ్లి చేసుకున్న జంటలకే ఇలా ఎక్కువగా ఎందుకు జరుగుతందని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి మీరు మీ పార్ట్ నర్ తో కలిసి పడకగదిలో నగ్నంగా అంటే ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా పడుకోవడానికి ప్రయత్నించండి.

Study : Does Partner Sleep Strengthen Your Relationship Bond

ఆ తెల్లారి నుండి వచ్చే ఫలితాలను చూసి మీరే షాకవుతారు. ఇదంతా మేం చెప్పడం లేదండోయ్.. ఇదంతా ఓ అధ్యయనంలో తేలిందట. వీరి అధ్యయనం ప్రకారం, ఈ ప్రపంచంలో దాదాపు 30 శాతం మంది ప్రజలు పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి బట్టలు లేకుండా నిద్రపోతున్నారట.

అంతేకాదు ప్రతిరోజూ వారు ప్రశాంతంగా.. కంటి నిండా కనుకు తీస్తున్నారట. వీరి అధ్యయనంలో ఇంకా ఏయే విషయాలు వెలుగులోకొచ్చాయి.. అలా నిద్రపోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

చీకటి గదిలో..

చీకటి గదిలో..

నిపుణుల ప్రకారం, పడకగదిలో పార్ట్ నర్ తో కలిసి చీకట్లో బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల గాఢమైన నిద్రను పొందొచ్చు. అలా నిద్ర పోవడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందట. దీని వల్ల సుఖమైన నిద్రకు దోహదం చేస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..

ఆరోగ్య ప్రయోజనాలు..

ఇలా ప్రతిరోజూ రాత్రి వేళలో బెడ్ రూమ్ లో బట్టలు లేకుండా నిద్ర పోవడం వల్ల ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

ఒత్తిడిని తగ్గిస్తుంది..

ఒత్తిడిని తగ్గిస్తుంది..

సాధారణంగా పెళ్లి చేసుకున్న ప్రతి జంటలో ఆటోమేటిక్ గా ఒత్తిడి అనేది పెరుగుతుంది. అది పిల్లల వల్ల లేదా ఆఫీసు, ఇంటి పని లేదా ఇంకేదైనా ఇతర కారణాల వల్ల ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. దీని వల్ల కూడా మనకు తెలియకుండా బరువు పెరుగుతూ ఉంటాం. కానీ పడకగదిలో మీరు సుఖంగా నిద్రపోతే మాత్రం మీ ఒత్తిడి స్థాయిలు తగ్గడమే కాదు.. మీరు బరువు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉందట.

ఆ కోరికలు..

ఆ కోరికలు..

ఇలా నిద్రపోవడం వల్ల మీ బాడీలో కార్టిసాల్ అనే ఒత్తిడిని పెంచే హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది. అలాగే మనలో ఆహారం ఎక్కువగా తినాలనే కోరికలను కూడా పెంచుతుంది. అందుకే చాలా మంది ఎక్కువగా ఫుడ్ తినేసి, బరువు పెరుగుతుంటారు. కానీ ఇలా బట్టలు లేకుండా రాత్రి వేళలో నిద్రపోవడం వల్ల మీ బాడీ, బ్రెయిన్ రిలాక్స్ అయ్యి ప్రెజర్ తగ్గుతుంది. దీంతో సులభంగా బరువు కూడా తగ్గుతారు.

అవి రానే రావు..

అవి రానే రావు..

ప్రతిరోజూ రాత్రి వేళలో బట్టలు లేకుండా కునుకు తీయడం వల్ల మీ బాడీలోని స్కిన్ కు చల్లని గాలి తగులుతుంది. దీంతో అండర్ వేర్ వేసుకునే ప్రైవేట్ ప్రాంతాల్లో చెమట వల్ల ఎలాంటి అంటు వ్యాధులు రావు. మీరు ఇన్ఫెక్షన్ల బారిన అస్సలు పడరు.

స్కిన్ హెల్దీ..

స్కిన్ హెల్దీ..

ఇప్పట్లో చాలా మంది బిగుతుగా ఉండే దుస్తులను వేసుకుంటున్నారు. ఇదే ఫ్యాషన్ ట్రెండ్ గా నడుస్తోంది. అయితే అవి వేసుకోవడం వల్ల వచ్చే చెమట, దుమ్ము, ధూళితో నిండిపోయి స్కిన్ కు కొంత సమస్య ఏర్పడుతుంది. అయితే వాటిని ప్రతిరోజూ తీసేసి నిద్రించడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. స్కిన్ హెల్త్ కూడా మెరుగవుతుంది.

కలయికలో ఆనందం..

కలయికలో ఆనందం..

ప్రతి రోజూ లోదుస్తులు వేసుకోవడం వల్ల.. మన బాడీకి పూర్తిగా గాలి తగలకపోవచ్చు. కాబట్టి రాత్రి వేళలో వాటికి కూడా చల్లని గాలి తగిలేలా నిద్రపోతే.. మీ బాడీకి చాలా హాయిగా అనిపిస్తుంది. అంతేకాదు, మీరు మీ పార్ట్ నర్ తో కలిసి లైంగిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.

ఆ అవకాశం లేకపోతే..

ఆ అవకాశం లేకపోతే..

అయితే కొందరికి ఎంత ప్రయత్నించినా.. లోదుస్తులు వేసుకుని నిద్రపోవడం అనేది కొంత ఇబ్బందిగా అనిపించొచ్చు. కాబట్టి అలాంటి లోదుస్తులు వేసుకోకుండా.. కొంచెం వదులుగా ఉండే దుస్తులను వేసుకుంటే బెటర్ గా ఉంటుంది. చూశారు కదా.. అలా నిద్రిస్తే ఎన్ని లాభాలో.. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్.. కాబట్టి మీరు కూడా ఇప్పటినుండి ఇలా నిద్రించడానికి ప్రయత్నించండి.. ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన అనుభూతిని పొందండి. దీని వల్ల లైంగికంగా కూడా సంతృప్తిగా ఉంటుంది.

Desktop Bottom Promotion