Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సర్వే! తొలి కలయిక కోసం ఈ కాలం యువత తొందరపడుతోందట...!
కిస్, హగ్స్ తో పాటు లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, ఫ్రెండ్ షిప్, జోకులు, శృంగారం, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ సర్వేలో ప్రశ్నలు అడిగారట.
యుక్త వయస్సులో ఉండే ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయిల పట్ల ఆకర్షణ అలాగే అబ్బాయిలకు అమ్మాయిల పట్ల ఆకర్షణ ఉండటం అనేది సర్వసాధారణమే. అది ప్రేమో లేదా ఆకర్షణ, మోజో అనే విషయాలను తేల్చుకోలేక చాలా సతమతం అవుతుంటారు.

ఆ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెబితే వారు ఏమైనా అంటారేమో అని అలాంటి విషయాలను తమలోనే దాచుకుంటూ ఉంటారు. అయితే ఇంకా కొంతమంది మాత్రం ఇలాంటి విషయాలను తమ స్నేహితుల వద్ద షేర్ చేసుకుంటారు.

కానీ ఇంకొందరు ఇలాంటి విషయాలను కనీసం స్నేహితుల వద్ద పంచుకోకుండా రహస్యంగా ఉంచుకోవాలనుకుంటారు. అలా ప్రేమలో పడి, ఆకర్షణకు గురై తమ బంగరు భవిష్యత్తును నాశనం చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ సంగతులన్నింటినీ పక్కన బెడితే ప్రేమలో ఉన్నప్పుడు తమ భాగస్వామి నుండి టీనేజర్లు ఎక్కువగా ముద్దులు, కౌగిలింతలు మాత్రమే కోరుకుంటున్నారని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది.

ఈ తరం యువత
యుక్త వయస్సులో ప్రేమ అంటే చాలా మంది శృంగారంలో కచ్చితంగా పాల్గొంటారనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే నేటి యువతరం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

ఆ అంశంపై..
టీనేజీలో ముద్దులు, కౌగిలింతలు అనే అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రేమలో ఉన్నప్పుడు తాము ఎక్కువగా కిస్, హగ్స్ ను మాత్రమే ఇష్టపడతామని కొందరు టీనేజీ యువతీ యువకులు తెలిపారు.

ఇతర అంశాలపై..
కిస్, హగ్స్ తో పాటు లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, ఫ్రెండ్ షిప్, జోకులు, శృంగారం, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ సర్వేలో ప్రశ్నలు అడిగారట.

వాటి కంటే..
ఈ సర్వేలో పాల్గొన్న వారందరిలో శృంగార సంబంధాల కంటే ముద్దులు, కౌగిలింతలకే తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అబ్బాయిలే.. శృంగార పరమైన దూరంగా ఉంటున్నట్లు తేలింది.

మరో సర్వేలో..
అయితే జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ (ఎన్ఎఫ్ హెచ్ఎస్) చేసిన ఓ సర్వేలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శృంగారంలో తొలి అనుభవం కోసం ఈ కాలం యువత కాస్త ఎక్కువగా తొందరపడుతున్నట్లు తెలిసిందట.

ఎప్పుడు పాల్గొంటున్నారు..ల
యువత తొలిసారిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారనే విషయాలపై వారు జరిపిన సర్వేలో అనేక రకాల ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారతీయుల లైంగిక జీవితంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

దాదాపు లక్ష మంది
దాదాపు లక్ష మంది పురుషులు, మరో లక్ష మంది మహిళలపై కుటుంబ ఆరోగ్య సర్వే చేశారట. ఈ సర్వేలో వయసుల మధ్య వ్యత్యాసాలు, పడక గదిలో సుఖం పొందండంతో పాటు వివిధ గ్రూపుల వారు ఎదుర్కొంటున్న సమస్యలు, చదువు వల్ల శృంగారాన్ని వాయిదా వేసుకోవడం వంటి విషయాలను సర్వేలో అడిగారట.

అమ్మాయిలే ముందుగా..
ఈ సర్వే ప్రకారం చాలా మంది అమ్మాయిలు కేవలం 19 ఏళ్లలోపే తమ తొలి కలయికను అనుభవిస్తున్నారని తెలిపింది. పురుషుల్లో మాత్రం 20 నుండి 24 ఏళ్లలోపు తమ తొలి కలయిక అనుభవాన్ని పొందుతున్నారని ప్రకటించింది.

త్వరగా పెళ్లి వల్లే..
అమ్మాయిలకు టీనేజీలోనే వివాహాలు జరుగుతుండటం వల్లనే వారు అబ్బాయిల కంటే ముందుగా తొందరగా తొలి కలయిక అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్ హెచ్ఎస్ తెలిపింది.

ఉత్తరాదిన చురుకుగా..
కలయిక విషయంలో దక్షిణ భారతదేశంతో పోలిస్తే.. ఉత్తర భారతంలో చురుకుగా లైంగిక జీవితాన్ని అనుభవిస్తున్నారని ఈ సర్వే సంస్థ పేర్కొంది.
దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలు కొద్దిగా ఫార్వర్డ్ అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.



Click it and Unblock the Notifications