For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు శృంగారానికి బానిస అయినట్లే...!

|

ఈ విశ్వంలో శృంగారంతో అనేక రకాల విషయాలు, కళలు, ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి బానిసలవుతూ ఉంటారు. కొందరు ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యవాలకు అడిక్ట్ అవుతూ ఉంటారు.

అయితే అందరి కంటే ఎక్కువగా శృంగార సంబంధిత విషయాలకు అడిక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సెక్స్ గురించి ఏదో తెలుసుకోవాలనే ఊబలాటం చాలా ఎక్కువగా ఉంటుంది.

అలా మొదలైన వారి ఆసక్తి కాస్త సెక్స్ కు అడిక్షన్ మారుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి శృంగార సంబంధిత విషయాలలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎక్కువగానే చూస్తారట.

అయితే అమ్మాయిలు పోర్న్ వీడియోలు చూసినప్పటికీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే విషయాన్ని వారు అత్యంత త్వరగానే తెలుసుకుంటారట. అందుకే వారు ఎక్కువగా తమ భాగస్వామితో తోడ్పాటును కోరుకుంటారు. కానీ శారీరక అవసరాలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని చెబుతున్నారు నిపుణులు. కానీ అబ్బాయిలు మాత్రం వీటి నుండి అంత త్వరగా బయటపడలేకపోతారు.

ప్రారంభంలో శృంగార విద్య అంటూ ఈ వీడియోలను చూస్తూ.. ఆ తర్వాత వీటికి అడిక్ట్ అయిపోతున్నారు. అందులోనూ పోర్న్ వెబ్ సైట్లలో ఎన్నో రకాల సెక్స్ వీడియోలుంటాయి. ఎప్పుడై రోటీన్ వీడియోలు బోర్ కొడతాయో.. కొత్త వీడియోలు పుట్టగొడుగుల్లా అందుబాటులో ఉంటాయి. అలా వీటికి నెమ్మదిగా అలవాటు పడతారు. ఆ డార్క్ వెబ్ నుండి బయటకు రావడానికి అబ్బాయిలు అంత త్వరగా ఇష్టపడరు. అంతేకాదు ప్రతిసారీ కొత్త వాటిని అన్వేషించే అవకాశం పోర్న్ వెబ్ సైట్స్ లో ఉండటం కూడా సెక్స్ అడిక్షన్ ఓ కారణమే అని చెప్పొచ్చు. అలా సెక్స్ కు బానిసలుగా మారారని తెలిపే లక్షణాలేంటో మీరే చూడండి...

పురుషులకు సాధారణంగా..

పురుషులకు సాధారణంగా..

పురుషులకు కామ కోరికలు ఉండటం అనేది అత్యంత సాధారణం. అది అవసరం కూడా. అయితే అది శృతి మించితేనే ప్రమాదం. అప్పుడే మీరు సెక్స్ కు బానిసగా మారిపోతారు. అయితే ఇది మిమ్మల్ని శారీరకంగా మరియు మానసికంగా బలహీనపరుస్తుంది. మిమ్మల్ని సమాజంలో చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది.

ఆసక్తి పెరగడం వల్ల..

ఆసక్తి పెరగడం వల్ల..

ఇటీవల లాక్ డౌన్ కారణంగా చాలా మంది స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్, డెస్క్ టాపుల్లో యూ ట్యూబ్ వీడియోలను, ఇతర వీడియోలను ఎక్కువగా చూశారు. అయితే బ్లూ ఫిల్మ్స్ చూసిన తర్వాత కుకీస్ ఆధారంగా వాటికి సంబంధించిన ప్రకటనలు బ్రౌజర్ ఓపెన్ చేసిన ప్రతిసారీ కనబడుతున్నాయి. దీని వల్ల అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తితో వాటిని చూడటం ప్రారంభిస్తున్నారు.

తల్లిదండ్రులకు తెలియకుండా..

తల్లిదండ్రులకు తెలియకుండా..

ముఖ్యంగా టీనేజీలో అలా మొదలైన ఆసక్తి... అవి చూడటం తప్పా ఒప్పా అనే విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. పొరపాటున అవి తల్లిదండ్రులు చూసి తిట్టినా.. సరే వాటిపై విపరీతమైన ఆసక్తి పెరిగిపోవడం వల్ల తల్లిదండ్రులకు తెలియకుండానే వాటినే చూసేస్తున్నారు.

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన సెలబ్రెటీలు... నాడు శ్రీదేవి.. నేడు నటాషా...

బానిసలని భావించకపోవడం..

బానిసలని భావించకపోవడం..

అయితే ఇలాంటి వీడియోలు చూసేవారు సెక్స్ కు బానిసలయ్యామని గుర్తించకపోవడం. ఇది చాలా దారుణమైన విషయం. అయితే మీకు ఎప్పుడైతే శృంగారానికి బానిస అయ్యారని అనుమానం వస్తే వెంటనే వైద్యులను కలవడం మంచిది. వారు మీకు మంచి కౌన్సెలింగ్ ఇచ్చి, మిమ్మల్ని ఆ ఊబిలోని బయటపడేందుకు సహాయపడతారు.

శృంగారంపై అవగాహన లేక..

శృంగారంపై అవగాహన లేక..

మన దేశంలో ఇప్పటికీ శృంగార విద్యకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. లైంగిక విద్య గురించి చెప్పడానికి టీచర్లు సైతం అంతగా ఆసక్తి చూపడం లేదు. అలా కౌమరదశలో ఉన్నప్పుడే వారికి శృంగారం అవగాహన కల్పించకపోవడం వల్ల, వారిలో శృంగారంపై ఆసక్తి పెరిగి వాటి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో బానిసలవుతున్నారు.

హార్మోన్ల ప్రభావం..

హార్మోన్ల ప్రభావం..

శృంగారం గురించి వచ్చే ఆలోచనలు, దాని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను అదిమి పట్టి ఉంచుతారు. కానీ మన శరీరంలో ఉండే హార్మోన్లు మాత్రం శృంగార దిశగా మనల్ని నడిపిస్తాయి. అది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే టీనేజీలో ఉండే ఉత్సుకత కారణంగా అసలు శృంగారం ఏంటో తెలుసుకోవడానికి యువత పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెడతారు. దీనంతటికీ హార్మోన్లు కూడా ఓ కారణమే.

భర్తలను కాకుండా భార్యలు ఇతరులపై ఎందుకు మోజు పడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

అదే అలవాటుగా..

అదే అలవాటుగా..

అయితే కొంతమంది వాటి నుండి కంట్రోల్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొందరు మాత్రం అలా చేయరు. దాని వల్ల తమకు ఎలాంటి నష్టం కలగడం లేదని భావిస్తూ.. ఆ హాబీని కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాదు తమకు బాధకు గురి చేయని పనులు, సంతోషాన్ని కలిగించే పనులను ఎలాగైనా చేయాలని భావిస్తుంటారు. ఇలాంటి లక్షణాల వల్ల కూడా శృంగార వీడియోలకు బానిసలుగా మారుతూ ఉంటారు.

ఆన్ లైన్ లో సులువుగా...

ఆన్ లైన్ లో సులువుగా...

శృంగారానికి సంబంధించిన అంశాలు, వీడియోలు ఆన్ లైన్ లో సులువుగా దొరుకుతూ ఉండటంతో చాలా మంది యువత దీనికి అడిక్ట్ అవుతూ ఉన్నారు. దీని వల్ల తమకు ఆనందం కలుగుతుందని, ఎలాంటి ఇబ్బంది ఎదురవదని భావిస్తూ ఉంటారు.

అసహజమైన రీతిలో..

అసహజమైన రీతిలో..

అయితే ఇలాంటివి ఎక్కువగా చూడటం వల్ల వీడియోల్లో చేసిన మాదిరిగా అసహజమైన రీతిలో శృంగారంలో పాల్గొనాలనే కోరికలు పెరుగుతాయి. తాము కూడా అలా చేయాలనే ఉద్దేశ్యంతో పురుషులు తమ భాగస్వాములను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకవేళ అందుకు ఆమె ఒప్పుకోకపోతే, తమ కోరికను తీర్చుకోవడానికి ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇలాంటి లక్షణాలు మీలో ఉండే మీరు కూడా శృంగారానికి బానిసగా మారినట్లే.

విలువైన సమయం వృథా

విలువైన సమయం వృథా

అయితే ఇలాంటి లక్షణాల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పైగా దాని వల్ల మీ విలువైన సమయాన్ని కూడా వృథా చేసుకున్న వారవుతారు. కాబట్టి పోర్న్ చూడకుండా, ఇతర విషయాలపై శ్రద్ధ పెడితే మీరు మీ జీవితాలను హాయిగా ఆస్వాదించవచ్చు.

English summary

Symptoms of Sex Addiction in Telugu

Check out the signs which says you are a sex addict. Read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more