For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సంకేతాలుంటే మీ భాగస్వామి కంట్రోల్ లో లేనట్టే...!

మీ భాగస్వామి మీ నియంత్రణలో లేరని తెలిపే సంకేతాలంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఓ లుక్కేయండి.

|

భార్యభర్తలు లేదా ప్రేమికులు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చాలా మంచిగానే ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మీ భాగస్వామి మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు.

These signs you’re a control-freak in a relationship

తను మీకు ఫోన్ చేయకపోవడం, కనీసం చిన్న మెసెజ్ పెట్టడానికి కూడా ఆసక్తి చూపకపోవడం వంటివి చేస్తుంటారు కొందరు.

These signs you’re a control-freak in a relationship

అదే సమయంలో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా.. తను చాలా సార్లు ఫోన్ సైతం ఎత్తకుండా 'బిజీగా ఉన్నా' అని ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు.

These signs you’re a control-freak in a relationship

కానీ మిమ్మల్ని పట్టించుకోకుండా, తనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తు చేసుకునే వ్యక్తిని ఇష్టపడరు. ప్రతి బంధంలో ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం, అర్థం చేసుకునే తత్వం ఉండాలి.

These signs you’re a control-freak in a relationship

తమ బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే అందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాల్సి ఉంటుంది. అలా జరగకపోతే మీ బంధం వన్ సైడెడ్ రిలేషన్ షిప్ అన్నమాటే. అందుకే మీ సంబంధంలో ఇలాంటి సంకేతాలు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి...

అందువల్ల, ఈ ప్రవర్తనా విధానాలను గుర్తించడంలో మీకు సహాయపడటానికి, నియంత్రించే భాగస్వామి యొక్క 5 సంకేతాలు ఇక్కడ ఉన్నాయి, మీరు గుర్తించవచ్చు.

ప్రాథమిక సూత్రాలు మరచిపోవడం..

ప్రాథమిక సూత్రాలు మరచిపోవడం..

సంబంధాలు అనేవి ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహనపై ఆధారపడి ఉంటాయి. ముచ్చట్లు మరియు సానుకూల ఆలోచనలపై వృద్ధి చెందుతాయి. అయితే చాలా మంది జంటలు తమ సంబంధాలలో కొన్ని ప్రాథమిక సూత్రాలను మరచిపోతారు. వారి భాగస్వాములతో వారి బంధాన్ని నియంత్రించడానికి ఇతర విషయాలపై ఆసక్తి చూపుతుంటారు.

నిత్యం ఏదైనా చెప్పడం..

నిత్యం ఏదైనా చెప్పడం..

అవసరమైన సమయాల్లో భాగస్వామికి ఏవైనా విషయాలను చెప్పడం మంచిదే. అయితే అస్తమానం భాగస్వామి ఏమి చేయాలో.. ఏమి చేయకూడదో.. ఎల్లప్పుడూ భాగస్వామిని అది చేయి.. ఇది చేయి అని చెప్పడం వంటిది చెడు భాగస్వామ్యానికి ఒక సంకేతం. అయితే దీనినే కొంత తెలివిగా చేస్తే మాత్రం మీ భాగస్వాములు మీ నియంత్రణలో ఉండిపోతారు.

ఉచిత సలహాలు ఇవ్వడం..

ఉచిత సలహాలు ఇవ్వడం..

మన సమాజంలో చాలా మందికి అవసరం ఉన్నా.. లేకున్నా ఉచిత సలహాలు ఇవ్వడం అనేది ఒక చెడ్డ అలవాటు. అంతవరకూ ఆగితే పర్వాలేదు కానీ.. కొందరు

మాత్రం తాము చెప్పిన సలహాలనే పాటించాలని తెగ ఇబ్బంది పెడుతుంటారు. ఒకవేళ ఇతరుల సలహాలను తీసుకుంటే లేదంటే వాటిని పాటిస్తే మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు వారి సంరక్షణలో లేనప్పటికీ, వారు కోరుకున్నది చేయమని మొండికేస్తే.. మీ భాగస్వామి మీ నియంత్రణలో లేరని చెప్పొచ్చు.

మీ నిర్ణయాలు కూడా వారే.

మీ నిర్ణయాలు కూడా వారే.

ఏదైనా ముఖ్యమైన విషయాల్లో.. మీరు నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతుంటే.. మీ భాగస్వామి మాత్రం మీకు చెప్పకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు నిర్ణయం తీసుకునేందుకు కనీసం స్వేచ్ఛ కూడా ఇవ్వరు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. అది మీ భాగస్వామి అయినా.. ఇంకా ఇతర కుటుంబసభ్యులెవరైనా వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకండి.

స్నేహితుల నియంత్రణ..

స్నేహితుల నియంత్రణ..

కొంతమంది భాగస్వాములు మీ స్నేహితులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామి అదే పనిగా స్నేహితులను కలవకూడదని.. స్నేహితులతో మాట్లాడకూడదని కండిషన్స్ పెడుతుంటారు. ఎల్లప్పుడూ వారికి దూరంగా ఉండాలని చెబుతూ మిమ్మల్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు.

స్వార్థపూరితంగా ఉంటే..

స్వార్థపూరితంగా ఉంటే..

జంటలలో చాలా మంది వారి అంచనాలకు అనుగుణంగా జీవించాలని వారు కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒక సంబంధంలో అంచనాలను కలిగి ఉంటారు. కానీ మీ భాగస్వామి మీరు దానికి అనుగుణంగా జీవించాలనుకుంటే, అది కొంత స్వార్థపూరితంగా ఉంటుంది. అది అది వారిని సంతోషపెట్టాలనుకుంటున్నారా లేదా అని నిర్ణయించుకోవడం మీ ఇష్టం.

నిబంధనలు పెట్టడం..

నిబంధనలు పెట్టడం..

కొంతమంది జంటలు వారి నియమాలకు కట్టుబడి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం సంబంధాలలో ఎలాంటి నియమాలను పాటించవు. మీ భాగస్వామి మిమ్మల్ని వారి ప్రకారం జీవించాలని నిశ్చయించుకుంటే మరియు కొన్ని స్వీయ-నిర్మిత నిబంధనలను స్పష్టంగా ఏర్పాటు చేస్తే, వారు మిమ్మల్ని కంట్రోల్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనేందుకు స్పష్టమైన సంకేతం. అలాంటి రూల్స్ ను రూపొందించే హక్కు ఎవ్వరికీ ఉండదు. కాబట్టి మీరు వాటిని పాటించాల్సిన అవసరం లేదు. అశాస్త్రీయ నియమాలు మరియు పరిమితులు ఎప్పటికీ మంచిది కాదు.

English summary

These signs you’re a control-freak in a relationship

Here are these signs you're a control freak in a relationship. Take a look
Desktop Bottom Promotion