Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రాశుల వారు రిలేషన్ షిప్ లో అత్యంత అసూయపడతారట... మీ రాశి ఉందేమో చూడండి...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వారు అసూయపడటానికి కారణం వారి రాశి చక్రం యొక్క గ్రహాలు, నక్షత్రాల ప్రభావమే కారణమట.
మన దేశంలో వివాహ బంధమైనా లేదా ఇతర ఏ సంబంధమైనా ఎవరైనా సరే ఏదో ఒక క్షణంలో ఎవరో ఒకరిని చూసి అసూయ పడటం అనేది సర్వసాధారణమైన విషయం.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వారు అసూయపడటానికి కారణం వారి రాశి చక్రం యొక్క గ్రహాలు, నక్షత్రాల ప్రభావమే కారణమట.

ద్వాదశ రాశులలో రాశి చక్ర సంకేతాలను బట్టి ఏయే రాశుల వారు అత్యంత ఎక్కువగా అసూయపడతారో.. ఎందుకు అసూయపడతారో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.. ఈ రాశులలో మీ రాశి కూడా ఉందేమో మీరూ చూడండి...

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు భౌతిక ఆస్తులను మెచ్చుకునే రకం. దీని ఫలితంగా వీరు ఇష్టపడే వ్యక్తితో తమ అందమైన మరియు విలాసవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటారు. అయితే ఇది ఒక సమస్యగా మారిన సమయంలో వీరు తమ భాగస్వామిని కూడా తమకు చెందిన వారిగా భావిస్తారు. అప్పుడే వారిలో అసూయ వంటివి ప్రారంభమవుతాయి. వీరు ప్రతిదాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తారు. దీని వల్ల తరచుగా వీరు కఠినమైన మార్గాలను ఎదుర్కొంటారు. మరో విషయమేమిటంటే వీరికి ఎవరైనా నచ్చకపోతే వారితో చాలా దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి కొంత గర్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆకర్షించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు వీరి భాగస్వామి యొక్క ప్రేమ గ్రహీతగా ఉండాలని భావిస్తారు. సాధారణంగా ఇలాంటి సమస్య అయితే కాదు. ఇది వీరి భావనలో ఒక రకంగా నమ్మకానికి సంకేతం. అయితే ఏదైనా కారణం వల్ల తమకు అవసరమైన సమయంలో అది దక్కకపోతే వారిలో అనుకోకుండా కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఈ రాశి వారు అలాంటి సమయంలో అసహనంతో పాటు ఆగ్రహానికి గురై ముందుగా తమ భాగస్వాములను అస్యహించుకుంటారు.

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారు సాధారణంగా అసూయతోనే పోరాడుతూ ఉంటారు. వీరు అత్యంత క్లిష్టమైన స్వభావం కారణంగా తమ భాగస్వామి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది వీరి సంబంధాలలో విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా కష్టమైన సమయాలలో వీరి ప్రారంభం అసూయతోనే వ్యక్తం చేస్తారు. తమ భాగస్వామి తరపు నుండి ఏదైనా తప్పు ఉందని వీరు భావిస్తే చాలా నిరాశ చెందుతారు. అయితే అదే సమయంలో వీరు వేరొకరిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారు చాలా అసూయతో ఉంటారు. అయితే వ్యక్తిగత జీవితంలో వీరు చాలా నమ్మకంగా ఉంటారు. నిజాయితీగా కష్టపడి పని చేస్తారు. అయితే సంబంధాల విషయంలో వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఆ భావాలను నియంత్రణలో ఉంచుకునేందుకు చాలా కష్టపడతారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని వీరు చాలా లోతుగా ఆలోచిస్తారు. దీని ఫలితంగా వీరు రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తుంటారు. అయితే వీరిని ఎవరైనా మోసం చేస్తే, అలాంటి విషయాలను అస్సలు తట్టుకోలేరు. వారిపై చాలా అసూయను పెంచుకుంటారు.



Click it and Unblock the Notifications