For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ కిస్ పెడితే కిక్ తో పాటు.. కోరికలు కూడా అమాంతం పెరిగిపోతాయంట...!

|

'ముక్కుపై ముద్దు పెట్టు.. ముక్కెర అయి పోయెట్టు.. చెంపపై ముద్దు పెట్టు.. చక్కెర అయి పోయెట్టు.. మీసంపై ముద్దు పెట్టు..మీదికే దూకేట్టు.. గడ్డంపై ముద్దు పెట్టు.. గుండెనే తాకట్టు..' ఈ లిరిక్స్ వింటుంటే చందమామ సినిమా గుర్తొస్తుంది కదా.. ముద్దుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఆ పాట ద్వారా చక్కగా వివరించారు.

Things men Kiss Can Tell About Him

ప్రేమలో ముద్దు అనేది ఎంత ముఖ్యమో ఎన్నో సినిమాల్లో మనం ఇప్పటికే చూశాం. చూస్తున్నాం. అయితే ఎవరైనా తమ ప్రేమను తమ ప్రియురాలికి లేదా భాగస్వామికి వ్యక్తపరచడానికి ఏదైనా ఉత్తమ మార్గం ఏదైనా ఉంది అంటే అది ముద్దే. ముద్దుతో మగవారు తమలోని భావాలను వ్యక్తం చేస్తారు. అయితే మగాళ్లు ఎక్కడెక్కడ ముద్దు పెట్టడానికి ఇష్టపడతారో.. ఆ విషయాన్ని బట్టి వారు ఏమనుకుంటున్నారో ఇట్టే చెప్పేయొచ్చట. అలాంటి ముద్దుల వివరాలేంటో మీరు చూసేయ్యండి మరి..

పెదాలపై ముద్దు..

పెదాలపై ముద్దు..

ప్రియుడు తన ప్రియురాలు పెదాలపై కిస్ చేయడం ద్వారా తన ప్రేమను నిజంగా విలువైనదిగా భావిస్తాడు. అదే విధంగా భార్యభర్తల విషయానికొస్తే ఇంట్లో ఎవరూ చూడని సమయంలో మీ భర్త అకస్మాత్తుగా, వేగంగా మీరు ముద్దు ఇస్తే, వారు మీ జీవితంలో ఒక భాగం అయ్యారని అర్థం. ఒకవేళ ప్రేమికులు ఓపెన్ గానే అలా కిస్ చేసుకుంటే వారి రిలేషన్ షిప్ ఎంత బలంగా ఉందో అందరూ ఊహించగలరని వారు భావిస్తారు. అందుకే మన సినిమాల్లో ప్రేమ గురించి వచ్చిన ఎన్నో సినిమాల్లో లిప్ లాకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

నుదుటిపై ముద్దు..

నుదుటిపై ముద్దు..

మీ ప్రియుడు మీ నుదుటిపై ముద్దు పెడితే మిమ్మల్ని చాలా కేర్ ఫుల్ గా చూసుకోవాలనుకుంటున్నాడు అని అర్థం. అంతేకాదు మీకు ఏ సమయంలో అయినా, ఎలాంటి ఆపద వచ్చినా మీకు రక్షణగా నిలవాలనుకుంటున్నారు అని అర్థం. అలాగే వారి వారి రహస్యాలు మరియు జీవితాలను మీతో పంచుకోవాలని అనుకుంటారు. ఆఖరిగా మీరు వారి జీవితంలో అత్యంత కీలకమైన వారు అని భావించినప్పుడు కూడా మీ నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు.

చేతిపై ముద్దు..

చేతిపై ముద్దు..

ప్రియురాలి లేదా భార్య చేతిపై ముద్దు పెట్టుకునే వ్యక్తుల నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. వీరు ఎక్కువగా సాగర తీరంలాగా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిల అందమైన మరియు సుకుమారమైన చేతిని ముద్దాడేందుకు ఒక ప్రత్యేకమైన ధైర్యం కావాలి. కాబట్టి వీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. అమ్మాయి చేతికి ముద్దు పెట్టడం ద్వారా వారు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.

మణికట్టు లోపలి భాగంలో..

మణికట్టు లోపలి భాగంలో..

మీ మణి కట్టు లోపలి భాగం చాలా మనోహరమైనది. మీ ప్రియుడు మీ మణికట్టు లోపలి భాగంలో ముద్దు పెట్టుకునే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే దీని అర్థం మిమ్మల్ని బలవంతం చేస్తాడు అని కాదు. ఈ భాగంలో ముద్దు పెట్టడం ద్వారా అమ్మాయి శరీరం ఎలా పని చేస్తుందో అతను తెలుసుకుంటాడు. అలాగే అతని లైంగిక పనితీరు ఏంటో కూడా మీకే తెలుస్తుంది.

మెడపై ముద్దు..

మెడపై ముద్దు..

మీ ప్రియుడు లేదా భర్త మీ మెడపై ముద్దు పెడితే మీతో తీవ్రమైన ప్రేమ వ్యవహారంలో ఉన్నారని అర్థం. ఈ ముద్దు అన్ని ముద్దుల కంటే ఉత్తమ ముద్దుగా పరిగణించబడతుంది. శృంగారాన్ని ఇష్టపడే వారిలో చాలా మంది మహిళల మెడపైనే ఎక్కువగా ముద్దు పెట్టుకుంటారు. మీ ప్రియుడు మిమ్మల్ని మెడపై ముద్దు పెట్టుకున్నప్పుడు, మీరు ఆ సమయంలో అతనితో ఉండాలని కోరుకుంటారు.

చెంపపై ముద్దు..

చెంపపై ముద్దు..

మీ ప్రియుడు లేదా బాయ్ ఫ్రెండ్ మీ చెంపపై ముద్దు పెడితే తన ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడని అర్థం. అయితే వారు తమ ప్రేమను మీకు తెలియజేయాలని కోరుకుంటారు. అయితే వారు తమ లైంగిక కోరికను మీకు తెలియజేయడానికి ఇష్టపడరు. వారి ప్రస్తుత అవసరం ప్రేమ మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి.

కళ్లలో ముద్దు పెట్టుకోవడం..

కళ్లలో ముద్దు పెట్టుకోవడం..

కళ్లలో ముద్దు పెట్టుకోవడం అనేది వినడానికి వింతగా అనిపించవచ్చు. అయితే కళ్లలో ముద్దు పెట్టుకోవడం అనేది ప్రశంసలకు సంకేతం. కళ్లలో ముద్దు అనేది మహిళల భావోద్వేగాలను ఉత్తేజపరచని చర్య. మీ దృష్టిలో ఒక ప్రేమికుడి ముద్దు మీ పట్ల ఆయనకున్న ప్రేమను, మీ ఆలోచనలు మరియు చర్యల పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలుపుతుంది.

ఛాతీపై ముద్దు...

ఛాతీపై ముద్దు...

మీ ప్రియుడు ఛాతీలో ముద్దు పెట్టడం ద్వారా అతను మీతో కలయికను కోరుతున్నాడని అర్థం.తమలో తాము కోరికను, కామాన్ని వ్యక్తపరచాలనుకునే పురుషులు రొమ్ములపై ముద్దు పెట్టుకుంటారు.

English summary

Things men Kiss Can Tell About Him

Here are some things men kiss can tell about him. Read on.
Story first published: Monday, December 2, 2019, 16:28 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more