Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మనం తప్పు అనుకునే పనులకే అమ్మాయిలు బాగా అట్రాక్ట్ అయిపోతారట...!
ఇలాంటి పనులు చేస్తే అమ్మాయిలు పిచ్చెక్కిపోతారట...!
మనలో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలను ఎలా అట్రాక్ట్ చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. యవ్వనంలో ఉండే ప్రతి ఒక్కరూ అవే ఆలోచనలతో ఎక్కువగా గడిపేస్తారు. తమ మనసుకు నచ్చిన అమ్మాయి కోసం ఏవేవో తంటాలు పడుతుంటారు.

ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంటారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వారేమో కనీసం వారిపైపు కన్నెత్తి చూడరు. దీంతో వారిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని చాలా మంది తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.

అయితే అలాంటి అబ్బాయిలు వారికి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు లేదా తప్పులు అమ్మాయిలను బాగా అట్రాక్ట్ చేస్తాయట. అవేంటో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఓ లుక్కేయండి...

ఫిట్ గా ఉంటే చాలు..
మనం ఎవరైనా అమ్మాయిని ఆకర్షించాలంటే.. పెద్దగా కష్టపడుతున్నట్లు నటించాల్సిన పని లేదు. ముఖ్యంగా స్త్రీలను ఆకర్షించేందుకు మీ మనసులో ఏవేవో ఊహించుకుని, వారి ముందు ప్రదర్శించాల్సిన పని అస్సలు లేదు. ముందుగా మీ బాడీపై ఫోకస్ పెట్టండి. మీరు తీసుకునే ఆహారం సరైందో కాదో చూసుకోండి. ఫైనల్ గా మంచి ఫిట్నెస్ సాధించండి చాలు. చాలా మంది అమ్మాయిలు మీ బాడీ ఫిట్ నెస్ చూసి కూడా పడిపోయే అవకాశం ఉంది.

సినిమాల్లో చూపినట్టు..
ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అందాన్ని.. అతని ఉద్యోగం.. అలవాట్లు, అభిరుచులు వంటి వాటిని చూసే వారు. ముఖ్యంగా తనకు మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నాయా లేవా అని చూసుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయి. కాలంతో పాటు అమ్మాయిలు మారిపోతున్నారు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు సినిమాల్లో చూపినట్టు నెగిటివ్ గా ఉండే వ్యక్తులను కూడా బాగానే ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు కూడా కొంచెం నెగిటివ్ ఉండటంలో ఎలాంటి తప్పులేదు.

మహిళలపై కోప్పడటం..
మరి కొందరు అమ్మాయిలు అయితే మరీ విచిత్రంగా ఎవరైతే అబ్బాయిలు వారిపై కోప్పడతారో.. చీటికి మాటికి వారితో గొడవ పడతారో అలాంటి వారిని బాగా ఇష్టపడుతున్నారట. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ఇది చాలా వాస్తవం.

జుట్టు మరియు గడ్డం..
ఒకప్పుడు అబ్బాయిలు నున్నగా గడ్డం చేసుకుని.. మంచి హెయిర్ కట్ తో కనిపిస్తే, అలాంటి వారిని బాగా ఇష్టపడేవారు అమ్మాయిలు. అయితే ప్రస్తుతం అందరిపైనా సినిమాల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తల నిండా జుట్టు పెంచడం.. గడ్డం సైతం గుబురులా పెంచుతున్నారు. అమ్మాయిలు గడ్డం లేని అబ్బాయిల కంటే గడ్డం ఎక్కువగా ఉన్నవారిని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారట. అందులోనూ కొంచెం రఫ్ గా కనిపించేలా గడ్డం ఉంటే ఇష్టం. అదే విధంగా మీరు మీ జుట్టును కూడా ఫోకస్ లో ఉంచుకోవాలి. మీకు జుట్టు ఎక్కువగా లేదా పొడవుగా ఉంటే మీ జుట్టును శుభ్రంగా ఉంచడం, మీ జుట్టును దువ్వడాన్ని మరచిపోవద్దు. అంతేకాకుండా జుట్టు, గడ్డం యొక్క ఆరోగ్యంపైనా మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి.

మాట్లాడే విధానం..
మగవారు మాట్లాడే విధానాన్ని బట్టి కూడా అమ్మాయిలు వారి గురించి ఒక అంచనాకు వస్తారు. అబ్బాయిల్లో లుక్స్, మరియు డ్రెస్ తో పాటు వారి మాట్లాడే విధానాన్ని కూడా ఎక్కువగా గమనిస్తారు. మీరు మరీ సున్నితంగా మాట్లాడితే వారిని ఆకట్టుకోలేరు. మీరు మాట్లాడే ప్రతి మాట చాలా సింపుల్ గా ఉండాలి. వారిని ఇంప్రెస్ చేయడానికి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అదేవిధంగా చాలా స్పష్టంగా మాట్లాడాలి. అప్పుడే మీకు వారి మనసును గెలుచుకునే అవకాశం వస్తుంది. మరికొందరు అవసరం లేకున్నా గడగడ మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వారి వల్ల అమ్మాయిలు కాస్త అసహనానికి గురవుతారు.

తప్పులో కాలేసినట్టే..
చివరిగా, అమ్మాయిలందరూ ఒకేలా ఆలోచిస్తారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఒక్కో అమ్మాయి ఒక్కోలా ఆలోచిస్తారు. కాబట్టి వారి ఇష్టయిష్టాలను తెలుసుకుని ప్రవర్తించాలి. అయితే ప్రస్తుతం చాలా మందికి మగవారికి ఏవైతే తప్పు అనిపిస్తాయో అలాంటి అంశాలే బాగా నచ్చుతున్నట్లు పలు సర్వేల ద్వారా తెలిసింది. ఇక్కడ చెప్పిన చిట్కాలు కూడా అవే. కాబట్టి మీరు ఇష్టపడే అమ్మాయి మనసు గెలవాలంటే ఈ చిట్కాలను ఓ సారి ట్రై చెయ్యండి. అంతేకానీ సినిమాల్లో హీరోలా ఎక్కువ ప్రయోగాలు చేయకండి.



Click it and Unblock the Notifications
