Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
మీ అత్యుత్తమ బంధాన్ని సైతం బలహీనం చేసే కారణాలేంటో తెలుసా..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న మనోవేదనలను మరిచిపోవాలి. ఎందుకంటే కోపం పెంచుకుంటే మీరు ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
ప్రేమలో కానీ, పెళ్లిలో కానీ కొంత దూరం ప్రయాణం చేశాక ఏ ఇద్దరిలో అయినా అభిప్రాయాలలో గానీ, ఆలోచనలలో గానీ మార్పులు రావచ్చు. అందుకునే అనేక కారణాలు ఉంటాయి. ఇది ప్రియుడికి లేదా ప్రియురాలికి ఇద్దరికీ సమాన స్థాయిలో ఉంటాయి.

ఇద్దరిలో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, తప్పులను ఒప్పుకోకపోవడం, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు కావాలనే వాయిదా వేయడం, ఏదైనా పనికి ఆటంకం కలిగించడం వంటివి చేస్తే మీరు మీ రిలేషన్ షిప్ ను కోల్పోతారు. అంతవరకు మీ రిలేషన్ షిప్ ఎంత బలంగా ఉన్నా, మీరు కొన్నింటిని తేలికగా తీసుకుంటే అది సంబంధాన్ని చాలా దారుణంగా దెబ్బ తీస్తుంది. ఈ స్టోరీలో బలమైన బంధాన్ని లేదా మీ ప్రేమ విచ్ఛిన్నమవ్వడానికి గల విషయాలేంటో చూడండి..

సాన్నిహిత్యం లేకపోవడం..
సాన్నిహిత్యం అంటే కేవలం శృంగారం గురించి మాత్రమే కాదు. మానసికంగా దగ్గరగా ఉండటం కూడా అవసరం. అంటే మీ భాగస్వామితో ముచ్చట్లు కలపడం. మీ ప్రియమైన వారు చెప్పే మాటలను వినడం.. చిన్న చిన్న చిలిపి ఆటలు ఆడుకోవడం వంటివి ఉంటే మీ ఇద్దరిలో సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. కానీ ఇవన్నీ మీ రిలేషన్ షిప్ లో మిస్సయితే మీ ప్రేమ బంధం విచ్ఛిన్నమవుతుంది.

కోపం పెంచుకుంటే..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న మనోవేదనలను మరిచిపోవాలి. ఎందుకంటే కోపం పెంచుకుంటే మీరు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అందుకే పాత గొడవలను మరచిపోవాలి. మీరు మీ మనోవేదనలను మరచిపోతేనే మీరు మీ రిలేషన్ షిప్ ను కొనసాగించండి. లేకపోతే మీ రిలేషన్ షిప్ నాశనమయ్యే అవకాశం ఉంది.

భాగస్వామిని పట్టించుకోకపోవడం..
మీ జీవిత భాగస్వామితో మీకు అవసరం ఉంటే మీరు మీ భాగస్వామికి గౌరవం ఇవ్వాలి. అంతే కాదు వారికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలపాలి. ఇవన్నీ చేయకుండా మీరు మీ జీవిత భాగస్వామిపై క్రష్ పెట్టుకుంటే, మీ భాగస్వామిని పట్టించుకోకపోతే మీ రిలేషన్ షిప్ క్రాష్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

మీ గుర్తింపును కోల్పోకండి..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు మీ భాగస్వామి యొక్క అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సంఘటన. అలాగే తనను తాను చూసుకోవాలి. రిలేషన్ షిప్ లో తమ గుర్తింపును కోల్పోయే భాగస్వామిని ఎవరూ కోరుకోరు. కాబట్టి మీ గుర్తింపును కోల్పోకండి.

అస్థిరంగా ఉండటం..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ప్రతిరోజూ సంతోషంగా ఉండటానికి మీ భాగస్వామి సహకారం తప్పకుండా ఉంటుందన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. ఇలా కాకుండా ఒక్కరోజూ ఒక్కోలా ఉంటే మీరు అస్థిరంగా ఉన్నట్టే లెక్క. ఇలాంటి ప్రవర్తన వల్ల మీ భాగస్వామికి భయం మరియు అసురక్షితంగా అనిపించవచ్చు.

కలయికను తిరస్కరించడం..
శృంగారం అనేది ప్రతి జంటకు ఆరోగ్యకరమైనది. అంతేకాదు మీ రిలేషన్ షిప్ లో ఇదొక పార్ట్ అని తెలుసుకోవాలి. మీ ఇద్దరిలో దీనిపై ఎవరో ఒకరికి ఆసక్తి లేదా కోరిక లేనప్పుడు, కలయికను తిరస్కరించినప్పుడు మీ రిలేషన్ షిప్ లో చీలికలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

నమ్మకం కోల్పోయినప్పుడు..
ఏ ఇద్దరు వ్యక్తులు రిలేషన్ షిప్ లో ఉన్నా కూడా నమ్మకం అనేది చాలా ముఖ్యం. మీ భాగస్వామితో మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ప్రేమ అనేది చాలా కీలకం. ఈ ప్రేమలో నమ్మకం అనేది కోల్పోతే మీరు తిరిగి బంధాన్ని కొనసాగించడం చాలా కష్టం.

స్వార్థపూరితంగా ఉండటం..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో మీరిద్దరూ ఒక్కటే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకరితో ఒకరు అన్ని విషయాలను షేర్ చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు స్వార్థపూరితంగా ఉంటే మీ సంబంధంలో కచ్చితంగా చీలికలు వచ్చేస్తాయి.

ప్రతీకారం తీర్చుకోవడం..
మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం అనేది అత్యంత సహజం. అయితే దీన్ని మెల్లగా మరచిపోయేందుకు ప్రయత్నించాలి. కానీ మీరు వాటినే మనసులో ఉంచుకుని ప్రతీకారం వంటివి తీర్చుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పగలు, ప్రతీకారాలు ఎలాంటి రిలేషన్ షిప్ ను అయినా బాగా దెబ్బ కొడుతుంది.



Click it and Unblock the Notifications