మగాళ్లతో డేటింగుకు వెళ్లే ముందు.. ఈ విషయాలను అస్సలు మరువకండి... లేదంటే మీరే చింతిస్తారు...!

డేటింగుకు వెళ్లేటప్పుడు అబ్బాయిల గురించి తెలుసుకోవాల్సిన విషయాలేటంటే..

ఒకప్పుడు డేటింగ్ అంటే మనలో చాలా మంది వామ్మో అని నోరెళ్లబెట్టేవారు. కానీ ఇప్పుడు మాత్రం డేటింగ్ అంటే మాత్రం చాలా కామన్ అని లైట్ తీసుకుంటున్నారు. ఈ డేటింగ్ కల్చర్ ఒకప్పుడు మెట్రో నగరాల్లో ఎక్కువగా ఉండేంది.

Things to Know about a guy before dating him

ఇప్పుడు ఈ కల్చర్ నగరాలకు, పట్టణాలకు కూడా వ్యాపించిందట. విదేశాల్లో అయితే డేటింగ్ పేరిట తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి తెలుసుకునేందుకు ఈ కల్చర్ ను అలవాటు చేశారు. వెస్ట్రన్ దేశాల్లో ఇలాంటి కల్చర్ ఎప్పటినుండో ఉంది.

Things to Know about a guy before dating him

అయితే ఈ మధ్య డేటింగ్ అనే మాట టీనేజ్ పురుషుల్లో, స్త్రీల మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు తమకు నచ్చిన వారితో డేటింగ్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని పలు అధ్యయనాలలో సైతం తేలింది.

Things to Know about a guy before dating him

అయితే ఇలా మగవారితో డేటింగ్ చేయాలనుకుంటున్న మహిళలు కొన్ని విషయాలను మాత్రం ఎప్పటికీ మరచిపోకూడదు. లేదంటే మీరే నష్టపోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

రిలేషన్ విషయంలో..

రిలేషన్ విషయంలో..

ఆడ, మగవారి మధ్య రిలేషన్ షిప్ చాలా భిన్నంగా ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయిని ఇష్టపడినప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ తో లేదా అప్పటికే రిలేషన్ లో ఉన్న ఫ్రెండ్ సలహ తీసుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వారి రిలేషన్ గురించి భిన్నమైన అంచనాలు మరియు ప్రాధాన్యతలు ఉంటాయి. కాబట్టి మీరు పాల్గొనే డేటింగ్ విషయంలో ఇతరుల సలహా మాత్రం అస్సలు కరెక్ట్ కాదు.

మగవారి గురించి..

మగవారి గురించి..

మీకు ఎవరైతే నచ్చుతారో.. అలాంటి వారితో మీరు డేటింగ్ చేయాలనుకుంటు.. ముందుగా అతని గుణగణాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా మీరు ఏమైనా ప్రత్యేక లక్షణాలను ఆ అబ్బాయిలో చూశారా లేదా అని గమనించాలి. అప్పుడు మీరు తనతో రిలేషన్ పెంచుకోవచ్చు.

డేటింగ్ అంటే..

డేటింగ్ అంటే..

మీరు ఇష్టపడే వ్యక్తితో డేటింగ్ చేయాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే, తనతో మీరు దీర్ఘకాలిక సంబంధం కొనసాగించాలనుకుంటే.. ముందుగా డేటింగ్ విషయంలో తన అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అతను ఈ కార్యమంటే భయం లేకుండా ఉన్నాడా లేదా తెలుసుకోవాలి. మిమ్మల్ని తన భాగస్వామిగా చేసుకోవడంలో తనకు ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది తెలుసుకోవాలి.

అహంకారం విషయంలో..

అహంకారం విషయంలో..

ఆత్మగౌరవం మరియు అహంకారం మధ్య చాలా తక్కువ తేడా ఉంది. సాధారణంగా మగవారు తమ అహంకారాన్ని తమ ఆత్మగౌరవంగా భావిస్తారు. కాబట్టి, మీరు అబ్బాయి దగ్గరికి వెళ్తుంటే, అతను అహంకారంగా ఉంటారా లేదా అనే విషయాలను కచ్చితంగా చూడాలి. ఎందుకంటే అలాంటి కుర్రాళ్లు ఎప్పటికీ సంతోషకరమైన సంబంధాన్ని పెంచుకోలేరు. అలాంటి వారితో మీరు రిలేషన్ షిప్ కొనసాగిస్తే, మీరు ఆనందాన్ని కోల్పోతారు.

ఇతరులను గౌరవించడం..

ఇతరులను గౌరవించడం..

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కేవలం ప్రేమ ఒక్కటే కాదు.. భాగస్వాములు ఇద్దరూ ఒకరినొకరు సమానంగా గౌరవించుకోవడం చాలా అవసరం. దీని కంటే ముందు మీరు డేటింగుకు వెళ్లాలనుకునే వ్యక్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో, వారికి ఎంత గౌరవం ఇస్తారో చూడాలి. దీంతో భవిష్యత్తులో మీ సంబంధం ఎలా ఉంటుందో మీరు చాలా వరకు ఊహించగలుగుతారు.

రహస్యాల విషయంలో..

రహస్యాల విషయంలో..

ఈ లోకంలో ఎవరి గురించి అయినా.. రహస్యాలను తెలుసుకోవడం అనేది అంత సులభం కాదు. అయితే మీరు కొన్ని పద్ధతుల్లో అలాంటి వాటిని గుర్తించొచ్చు. మీరు తనతో డేటింగ్ చేస్తున్నప్పుడు తను వేరొకరితో డేటింగ్ చేయొచ్చు లేదా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి మీరు డేటింగ్ చేస్తున్న వ్యక్తి మీ నుండి ఇలాంటి రహస్యాలను దాచడం లేదని నిర్ధారణ చేసుకోండి. ఇలాంటి వాటి గురించి వారి ప్రవర్తనను బట్టి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు తను మిమ్మల్ని రద్దీగా ఉండే రెస్టారెంట్ కు తీసుకెళ్లడం మానేయడం లేదా తన ఫోన్ ఎప్పటికీ లాక్ వేసుకోవడం.. తన ఫోన్ చూడటానికి అస్సలు అనుమతించకపోవడం వంటి విషయాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి.

Story first published: Monday, November 23, 2020, 22:15 [IST]
Desktop Bottom Promotion