Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Valentine's Week 2023: ప్రామీస్ డే ఎప్పుడు? పార్ట్నర్ కు ఎలాంటి ప్రామీస్ చేస్తే ఫిదా అవుతారో తెలుసా...
2023లో వాలెంటైన్ వీక్ లో భాగంగా ఐదో రోజైన ప్రామీస్ డే యొక్క విశేషాలేంటో ఇప్పుడే చూసెయ్యండి.
వాలెంటైన్స్ వీక్ లో ఐదోరోజును ప్రామీస్ డేగా జరుపుకుంటారు. ఈరోజు ప్రేమికులకు అత్యంత ప్రత్యేకమైన రోజులలో ఒకటి. ఫిబ్రవరి 11వ తేదీ ప్రామీస్ చేయడానికి అంకితం ఇవ్వబడింది.

రోజ్ డే, చాక్లెట్ డే, ప్రపోజ్ డే, టెడ్డీ డే తర్వాత ప్రామీస్ డేకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే హ్యాపీ, హెల్దీ రిలేషన్ షిప్ కు ప్రామీస్ లు చాలా ముఖ్యమైనవి. మనలో చాలా మంది చిన్ననాటి నుండే ప్రతి చిన్న విషయానికి ప్రామీస్ చేయడం మనలో అనేక మందికి ఉన్న అలవాటు

కొందరికి ప్రామీస్ ఒక మాటగా మిగిలితే.. మరికొందరు తమ ప్రామీస్ ను నిలబెట్టుకోవడానికి ఎంతదూరమైనా.. ఎంతవరకైనా.. ఎవ్వరిదగ్గరికైనా ధైర్యంగా దూసుకెళ్తుంటారు. అయితే స్వార్థం, ద్రోహం, వంటి వాటిని పక్కనబెట్టి నిజాయితీ, నిబద్ధతతో ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్లు మాత్రం అరుదుగా ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ప్రామీస్ డేను ఎందుకు జరుపుకుంటారు.. ఈరోజుకు ఉన్న ప్రాధాన్యత మరియు ప్రత్యేకతలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రామీస్ డే ప్రాముఖ్యత..
వాలెంటైన్స్ డే వీక్ లో భాగంగా ఐదో రోజున ప్రామీస్ డే జరుపుకుంటారు. ఈరోజు చాలా ఆసక్తికరంగా రొమాంటిక్ సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ముందుగా ప్రేమ ప్రతిపాదన వస్తుంది. ఆ తర్వాత అది తియ్యగా మారి బహుమతుల వరకు వెళ్తుంది. ఇక రెండు ప్రేమ పావురాల మధ్య సంబంధంలో మరింత సాన్నిహిత్యం పెరిగినప్పుడు వాగ్దానాలు చేయడం ప్రారంభమవుతుంది. అప్పుడే ఇలాంటి ప్రమాణాలు ఎక్కువగా చేస్తుంటారు.

ఎంతలా ప్రేమిస్తున్నారో..
ప్రేమ, పెళ్లి అనేది నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన రిలేషన్. ఇందులో ప్రామీస్ అనేది రిలేషన్ ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున తమ పార్ట్ నర్ ఎంతలా ప్రేమిస్తున్నామో, వారితో తమకు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిపేలా ఆ ప్రామీస్ లు ఉంటాయి. ఈ ప్రామీస్ లలో ప్రేమపట్ల వారికి ఉన్న నిజాయితీ, నిబద్ధత తెలుస్తుంది. దీని వల్ల ప్రేమికుల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.

వాటిని గుర్తు చేసుకుంటూ..
ప్రామీస్ డే అంటే మీ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకుంటానని ఒకరికి ఒకరు వాగ్దానం చేసుకోవడం. ఈరోజున ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చుకున్న మాటలను కూడా గుర్తు చేసుకుంటారు.

వీలైనంత ఎక్కువగా..
వాలెంటైన్ వీక్ లో భాగంగా ప్రామీస్ డేరోజున ఇలా వాగ్దానం చేయండి. వీలైనంత సమయం వారితోనే గడుపుతామని.. సంతోషంలో అయినా.. బాధలో అయినా వారిని ఒంటరిగా వదిలి వెళ్లనని, అబద్ధం చెప్పనని.. వ్యసనాలను వదిలేస్తానని, కుటుంబ బాధ్యతలు తీసుకుంటానన్న ప్రమాణాలు వారిని ఆలోచింపజేస్తాయి.

నిజాయితీగా ఉంటూ..
మీ భాగస్వామికి ప్రేమ, నవ్వు, సంరక్షణతో కూడిన జీవితాన్ని వాగ్దానం చేయడానికి విశ్వవ్యాప్తంగా ప్రజలు ప్రామీస్ డేను జరుపుకుంటారు. మీ భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను, ఆప్యాయతను వ్యక్తపరచడానికి, ఎల్లప్పుడూ మీరు వారికి అండగా ఉంటారన్న నమ్మకం ఇవ్వడానికి ఇదే మంచి సందర్భంగా అని వారికి తెలియజేయండి. అయితే మీరు ఎలాంటి ప్రామీస్ చేసినా.. అందులో నిజాయితీగా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి.
ప్రేమ, పెళ్లి అనేది నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన రిలేషన్. ఇందులో ప్రామీస్ అనేది రిలేషన్ ను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన ప్రామీస్ డేను జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున తమ పార్ట్ నర్ ఎంతలా ప్రేమిస్తున్నామో, వారితో తమకు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలిపేలా ఆ ప్రామీస్ లు ఉంటాయి. ఈ ప్రామీస్ లలో ప్రేమపట్ల వారికి ఉన్న నిజాయితీ, నిబద్ధత తెలుస్తుంది. దీని వల్ల ప్రేమికుల మధ్య బంధం మరింత బలంగా మారుతుంది.



Click it and Unblock the Notifications
