రతి కోరికలు మరీ ఎక్కువైతే వ్యసనమని అనుకోవాలా? నిపుణులు ఏమంటున్నారంటే...

ఇలాంటి వాటి పట్ల కొందరు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అనవసరంగా లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటారు.

మనం ఇంతవరకు మద్యపాన బానిసలను మరియు ధూమపాన వ్యసన పరులను చూసే ఉంటాం. లేదా వారి గురించి ఎక్కడో ఒక దగ్గర కనీసం విని ఉంటాం. అలా వాటికి బానిసలుగా మారి అనారోగ్యాల బారిన పడే వారిని చూస్తూ ఉంటాం. అందుకే మనకు ప్రతి సినిమాలో పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని, సినిమాల మధ్యలో ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రకటనలు వస్తూనే ఉంటాయి.

What are the Most Common Indicators of Love Addiction?

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఇవన్నీ దాదాపు బంద్ కావడంతో చాలా మంది మరో కొత్త దానికి బానిసలు మారుతున్నారు. అదే లైంగిక వ్యసనం. ఇటీవల కాలంలో చాలా మంది దీని బారిన పడిపోతున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తాజాగా తేలింది. అంతేకాదు అలాంటి కోరికలకు సంబంధించి అనేక మంది ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వింత ప్రవర్తన..

వింత ప్రవర్తన..

ప్రస్తుతం మద్యం దుకాణాలు బంద్ కావడంతో తాగుడుకు బానిసగా మారిన వారంతా వింతగా ప్రవర్తించడాన్ని పలు ప్రాంతాల్లో మనం చూశాం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే ఏకంగా ఎర్రగడ్డ ఆసుపత్రికి చేరిన వారి గురించి కూడా విన్నాం. అయితే ప్రస్తుతం చాలా మంది ఇంటికే పరిమితమవ్వడంతో విపరీతంగా అలాంటి వీడియోలను చూస్తూ, లైంగిక బానిసగా మారుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ కోరికలుంటే..

ఎక్కువ కోరికలుంటే..

అయితే యవ్వనంలో ఉన్న వారికి కోరికలు ఎక్కువగా ఉండటం అనేది సహజమే. అయితే అవి మరీ ఎక్కువగా ఉంటే అది మానసిక సమస్యనా లేదా లైంగిక వ్యసనమా అన్న అపొహ మాత్రమేనా? అనే దానిపై నిపుణులు ఇలా అంటున్నారు.

పరితపిస్తూ...

పరితపిస్తూ...

మద్యం, డ్రగ్స్ కు బానిసలు మారిన వారు అవి లేకుండా ఎలాగైతే రోజును గడపలేరో.. కోరికలు ఎక్కువైనప్పుడు వారు రతి క్రీడలో పాల్గొనకపోతే వారు అస్సలు తట్టుకోలేరు. అందుకోసం వారి పరితపించి పోతుంటారు.

రతి బానిసలు..

రతి బానిసలు..

సాధారణంగా రతి క్రీడను చాలా మంది ఆస్వాదించడం, ఆ తర్వాత సుఖంగా, సంతోషంగా ఉండటం.. ఉత్సాహంగా విశ్రాంతి తీసుకోవడం వంటివి చేస్తారు. అయితే రతి క్రీడా బానిసలు మాత్రం ఒక రకమైన న్యూనతా భావంలోకి వెళ్లిపొతారని అంటున్నారు నిపుణులు. వారికి కలయిక కావాలనిపించినప్పుడు, దాని కోసం వారు ఎంత పని చేయడానికైనా వెనుకాడరు. దేనికైనా తెగించి ముందుకు వెళతారు.

కంట్రోల్ లో ఉండలేరు...

కంట్రోల్ లో ఉండలేరు...

ఒక్కసారి వారి అందుకు బానిసలు అయితే మాత్రం వారు మంచి, చెడు గురించి అస్సలు ఆలోచించరట. అంతేకాదు వారి కంట్రోల్ కూడా వారు ఉండలేరట. డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో.. దాదాపు ఇలాగే ప్రవర్తిస్తారట లైంగిక బానిసలు. ఇదంతా చూసేవారికి వారిని ఎవరో వశీకరణం చేసుకుని ఇదంతా చేయిస్తున్నారని అనిపిస్తుంది.

ఆ వ్యసనం నుండి బయట పడేందుకు..

ఆ వ్యసనం నుండి బయట పడేందుకు..

2013 నుండి ఇప్పటివరకూ బ్రిటన్ రాజ్యానికి చెందిన దాదాపు 21 వేల మంది ఆ వ్యసనం నుండి బయటపడేందుకు తమ సైట్ సాయం తీసుకున్నారని ఆ సర్వే సంస్థ ప్రకటించింది.

పురుషులే ఎక్కువ..

పురుషులే ఎక్కువ..

ఇలాంటి వ్యసనపరుల్లో ఎక్కువగా పురుషులే ఉన్నారట. అది కూడా దాదాపు 91 శాతం మంది ఉన్నారట. అయితే ఇలాంటి బాధితుల్లో కేవలం 10 శాతం మంది వైద్యులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకున్నారట.

మానసిక రుగ్మతల జాబితాలో..

మానసిక రుగ్మతల జాబితాలో..

ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటిని కూడా ముఖ్యంగా లైంగిక వ్యసనాన్ని మానసిక రుగ్మతల జాబితాలో చేర్చాలని 2013 సంవత్సరంలోనే బ్రిటన్ మరియు అమెరికా వంటి దేశాలు భావించాయట.

సరైన ఆధారం లేక..

సరైన ఆధారం లేక..

అయితే అలాంటి వాటిని ఓ వ్యసనంగా గుర్తించేందుకు సరైన ఆధారం లేకపోవడంతో దీన్ని రుగ్మతల జాబితాలో చేర్చలేదట. అయితే ‘‘కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్‘‘ను ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించే అంతర్జాతీయ రోగాల వర్గీకరణలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయట.

ఇప్పుడు చేరుతుందని..

ఇప్పుడు చేరుతుందని..

అయితే గతంలో జూదాన్ని మరియు అదే పనిగా తినడాన్ని కూడా కంపల్సివ్ బిహేవియర్స్ లో చేర్చారు. అయితే ఇప్పుడు దీనికి కూడా అందులో చేర్చుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వైద్యుల సూచనలే ఉత్తమం..

వైద్యుల సూచనలే ఉత్తమం..

సాధారణంగా రతి క్రీడలో పాల్గొనాలని అందరిలో ఉన్నప్పటికీ, చాలా మందికి కోరికలన్నీ ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కోలా కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ప్రయత్నించి తమ కాపురాలను చేతులారా నాశనం చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అందుకే ఇలాంటి సమస్యలు ఉన్నవారు వైద్యులను కలిసి వారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించడమే ఉత్తమ మార్గం.

Story first published: Thursday, April 16, 2020, 14:23 [IST]
Desktop Bottom Promotion