Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
ముసలోళ్లే కానీ మహానుభావులు.. ఈ వయసులోనే డేటింగులు చేస్తున్నారు...!
మన కన్నా ఎక్కువ వయసు ఉన్న వారితో డేటింగుకు వెళితే మనం ఏమి ఆశించొచ్చో తెలుసుకుందాం.
మన తెలుగు సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ప్రేమ విషయంలో లేదా పెళ్లి విషయంలో వయసును అస్సలు పట్టించుకోరు. అది కేవలం శరీరానికే కానీ.. మనసుకు కాదు అనే డైలాగులను మనం వినే ఉంటాం.

అయితే ప్రస్తుత జనరేషన్ లోని కొంతమంది అమ్మాయిలు ఇదే తరహా పద్ధతిని ఫాలో అవుతున్నారు. కొంతమంది మహిళలు యువకులతో కాకుండా ముసలొళ్లతో డేటింగ్ చేయడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు.

మీరు నిజంగా ఓ వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని ఉంటే, మీ మనిషి వయసు ఎంత అన్నది పట్టింపు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సంబంధంలో మంచి మరియు చెడు సంబంధాలు అనేవి సాధారణంగా ఉంటాయి.

ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు తమ జీవితాన్ని ముసలివారితో గడపడం అవసరమని గ్రహించారు. అయితే అలాంటి వారితో డేటింగ్ చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ముసలోళ్లతో డేటింగ్ చేస్తే ప్రయోజనాలేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవేంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లాభాలేంటో ఇప్పుడే చూసేయండి...

తగాదాలు తక్కువ..
పెద్ద వయసు వారితో డేటింగుకు వెళితే తగాదాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వారితో వాదనలు, అపార్థాలు అనేవే ఉండకపోవచ్చు. అలాగే పెద్ద వయసులో ఉన్న వారు ఒకే సమయంలో ఒకరితోనే రిలేషన్ షిప్ మెయింటెన్ చేసేందుకు ఇష్టపడతాడు. నిజం చెప్పాలంటే అలాంటి వారు చాలా సమాచారాన్ని గుర్తు పెట్టుకుంటారు. అంతేకాదు మిమ్మల్ని ఎలా సంతోషపెట్టాలో అనే దానికి సమయం కేటాయిస్తారు. చివరగా మిమ్మల్ని ఎప్పుడు సర్ ప్రైజ్ చేస్తుంటారు.

మీతోనే ఎక్కువగా..
ఒక ముసలాడితో డేటింగ్ చేయడమంటే అతను ఒక నిర్దిష్ట మార్గాన్ని కనుగొంటాడు. అలాగే అతని భాగస్వాములకు కూడా దాన్ని విస్తరిస్తాడు. అయితే మీకు కొన్ని సమయాల్లో నియంత్రణ మరియు మరియు అంతరాయం కలిగించేదిగా అనిపించవచ్చు. అతను మీరు చేస్తున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడొచ్చు. అంతేకాదు మీతోనే ఎక్కువగా గడిపేందుకు ఆసక్తి చూపుతాడు.

లైంగిక జీవితం..
మీ కన్న వయసులో పెద్దగా ఉండే వ్యక్తి కొంత పరిశోధన చేస్తారు. వారి భాగస్వాముల అవసరాలను అర్థం చేసుకునే కళలో ప్రావీణ్యం సంపాదించే ఉంటారు. కాబట్టి పడకగదిలో బెడ్ పై మిమ్మల్ని ఎలా సుఖపెట్టాలో అనే విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. మీరు పడకగదిలో ఏమి కోరుకుంటున్నారో, అతనికి చెప్పడానికి వెనుకాడరు.

డేటింగులో అనుభవాలు..
మీలాగే వారికి కూడా డేటింగ్ చరిత్ర ఉండొచ్చు. వారు కూడా మాజీ స్నేహితులతో కాంటాక్టులో ఉంటారని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ సమయంలో మీరిద్దరూ మీ గతం గురించి వాస్తవాలను అంగీకరించాలి. ఒకరికొకరు ఒకేలా సంతోషంగా ఉండటానికి ఒకే అంశంపై మాట్లాడుకుంటే మంచిది.

కమిట్మెంట్..
వయసులో మీకన్నా పెద్దగా ఉండే ప్రేమ విషయంలో అస్సలు భయపడరు. వారు వారి ప్రేమ మరియు శ్రద్ధతో మిమ్మల్ని సంతోషపెడతారు. ఇలాంటి సమయంలో మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు ఎక్కువ కాలం ఇందులో ఉండటానికి ఇష్టపడకపోతే వారికి ముందే తెలియజేయండి. ఎందుకంటే వృద్ధులు రిలేషన్ విషయంలో కమిట్ అవ్వాలనుకుంటారు. అలా చెప్పడానికి కూడా ఏ మాత్రం భయపడరు.

ధైర్యసాహసాలు..
వృద్ధులలో ఉండే ధైర్యసాహసాలు కూడా మిమ్మల్ని ఆకర్షించవచ్చు. అతను మిమ్మల్ని రాణిలా చూసుకుంటాడు. కాబట్టి మీరు అతని నుండి ఎక్కువ రక్షణ పొందవచ్చు. అంతేకాదు మీరు కోరుకున్న వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తాడు. అయితే మీరు అమోదయోగ్యమైనవి కోరాల్సి ఉంటుంది.

తప్పులు చేసినప్పుడు..
మీరు ఏవైనా పొరపాట్లు లేదా తప్పులు చేసినప్పుడు అతను కోప్పడటం అనేది చాలా తక్కువ. మీరు ఏదైనా తప్పు చేసినా.. దాన్ని సరిదిద్దుకునేలా మీకు సర్దిచెబుతాడు. ఒకవేళ తప్పు జరిగిందని మీరు బాధపడితే, అతనే మీకు సారీ చెబుతాడు. అతనిలో ఉండే లోపాలను పరిష్కరించుకుంటాడు.



Click it and Unblock the Notifications