Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అవి ఎక్కువుంటాయనే పొడుగు కాళ్ల సుందరాంగులను మగాళ్లు లైక్ చేస్తారా?
కొందరు పురుషులు తమ కంటే ఎక్కవు ఎత్తు ఉండే అమ్మాయిలను ఎందుకని ఇష్టపడతారు.
మనలో చాలా మంది మగాళ్లు ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ముందుగా గమనించేది వారి అందం. ఆ తర్వాతే వారి ఎడ్యుకేషన్, పర్సనాలిటీ ఇతర విషయాల గురించి ఆలోచిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే వీటితో పాటు చాలా మంది పురుషులు పొడుగు కాళ్ల సుందరాంగులను ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. అలాంటి అమ్మాయిలంటే వీరికి చాలా ఇష్టమట.

తమ కంటే ఎత్తుగా ఉండే అమ్మాయిలతో ప్రేమ జీవితం అయినా.. వివాహ జీవితం అయినా చాలా హ్యాపీగా ఉంటుందని భావిస్తారట. ఈ సందర్భంగా పురుషులు పొడుగు కాళ్ల సుందరులను ఎందుకిష్టడపతారు.. దాని వెనుక ఉన్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎక్కువ ఆకర్షణ..
మనలో చాలా మంది పొడుగు కాళ్ల సుందరీ అంటే బాలీవుడ్ లో దీపికా పదుకొనే.. పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భామలు టక్కున గుర్తొస్తారు. అయితే ఇలా పొడవు ఎక్కువగా ఉండే అమ్మాయిలను చూస్తే చాలా మంది మగాళ్లు సులభంగా ఆకర్షణకు గురవుతారట. ఎందుకంటే వారి పొడవు కారణంగా.. వారు ఏ డ్రస్ వేసుకున్నా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారట. అంతేకాదు పొడవు ఎక్కువగా ఉండటం వల్ల వారి బాడీలోని కొన్ని ముఖ్యమైన పార్ట్స్ చాలా అట్రాక్ట్ చేస్తాయట.

పొడుగు కాళ్లు..
పొడుగు కాళ్ల సుందరీలంటే కొందరు పురుషులు పిచ్చెక్కిపోతారట. వారి బ్యూటీతో పాటు ఇంకా ఎన్నో పాజిటివ్ అంశాలు ఉన్నాయని భావిస్తారట. హైట్ ఎక్కువగా ఉండే లేడీస్ లో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా ఉంటాయని భావిస్తారట. వారు ఏ పని ప్రారంభించినా అందులో కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఎక్కువ మంది మగాళ్లు నమ్ముతారట.

తమ కంటే ఎత్తు..
చాలా మంది మగాళ్లకు పొడుగు కాళ్ల సుందరాంగులను మోడల్స్ లా ఊహించుకుంటారట. అయితే వారు అందానికి ప్రాధాన్యత పెద్దగా ఇవ్వరట. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే చాలని భావిస్తారట. అయితే వాస్తవానికి చాలా మంది పురుషులు తమ కంటే తక్కువ పొడవు ఉండే మహిళలనే ఎక్కువగా వివాహం చేసుకుంటున్నారు.

నిజమైన ప్రేమలో..
అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ బంధం లేదా వివాహ బంధం బలపడాలంటే కేవలం ఎత్తు మాత్రమే సరిపోదు. ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక స్త్రీని లైక్ చేయడానికి కేవలం పొడవు అనే రీజన్ ఏ మాత్రం కరెక్ట్ కాదు. వారికి మంచి మనసు ఉండాలి. అందుకే ఒక పురుషుడికి, మహిళకు ఆకర్షణకు పొడవుతో ఏ మాత్రం సంబంధం లేదు. ఇలా కలిగే ఆకర్షణ, ప్రేమ ఎక్కువ రోజులు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఫిట్ గా ఉండలేరు..
అయితే మరీ పొడవు ఎక్కువగా ఉండే మహిళలు ఎక్కువ కాలం ఫిట్ గా ఉండలేరట. అందుకే వీరు జీవితంలో అనేకసార్లు వేధించడం అనేది పొడవాటి స్త్రీగా ఉండటం యొక్క మరో ప్రతికూలత. అలాగే ఇబ్బందిక పరిస్థితులలో పరుగెత్తడం కూడా కష్టమవుతుందట. ఇక బట్టల విషయంలోనూ మహిళలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయట.



Click it and Unblock the Notifications