For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకుంటే... తర్వాత మీరే బాధపడతారట...

|

మన దేశంలో ప్రస్తుతం కలయిక అనేది ఒక సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది. ఒకప్పుడు ఈ విషయం గురించి బయట అస్సలు మాట్లాడేవారు కాదు. ఇలాంటివి చాలా రహస్యంగా మాట్లాడేవారు.

అయితే పరిస్థితులు వేగంగా మారిపోతుండటంతో ఇది కూడా ఒక యాంత్రికంగా, శారీరకంగా చేసే ఒక ప్రక్రియగా భావిస్తున్నారు. అయితే ఎవరైనా సరే మనస్ఫూర్తిగా కలయికలో పాల్గొంటే వారికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయట.

ఈ కలయిక అనేది మానవ అవసరం. అయితే మీరు ఎవరితో ఇలాంటి సంబంధంలో ఉన్నారనేది దానిపై కచ్చితమైన క్లారిటీతో ఉండాలట. ఎందుకంటే ప్రస్తుతం అమ్మాయిలు చాలా మారిపోయారు. వారి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో వారికి బాగా తెలుసు. అయితే పురుషుల కంటే మహిళలు ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారనే అభిప్రాయం మాత్రం లేదు.

అయితే మీరు ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలనే దానిపై తప్పులు మాత్రం చేయకూడదు. మీరు మీ భాగస్వామిని పూర్తిగా నమ్మితేనే అలాంటి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే మీరు తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇంతకీ ఎలాంటి వారిని కలయిక వంటి విషయాలలో నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

మీ వివరాలను చెప్పొద్దు..

మీ వివరాలను చెప్పొద్దు..

ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుతారు. కానీ తన గురించి ఏదైనా సమాచారం అడిగితే మాత్రం చెప్పరు. అలాంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారిని అస్సలు నమ్మకూడదు. వీలైనంత మేరకు వారిని మీ నుండి దూరంగా పెట్టాలి. ఇలాంటి వారు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఏవైనా సంఘటనలు జరిగితే, వాటికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి వారు కలయిక కోసం బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి వారికి మీరు ఒక ఆటబొమ్మగా మాత్రమే ఉపయోగపడతారని గుర్తుంచుకోవాలి.

కోరిక తీర్చుకునేందుకు..

కోరిక తీర్చుకునేందుకు..

కొందరు వ్యక్తులు ఒక నిర్దిష్ట వ్యక్తి ఉన్న అమ్మాయితో శారీరక సంబంధం లేదా ఆమె సెక్స్ ఫాంటసీని నెరవేర్చడానికి ఒక నిర్దిష్ట స్థానాన్ని ఎంచుకుంటారు. మీరు

దీనికి సుముఖంగా ఉన్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోరు. వారు కేవలం తమ కోరిక తీర్చుకునేందుకు మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు.

మీ మాట వినరు..

మీ మాట వినరు..

చాలా మంది వ్యక్తులు కలయిక విషయంలో తమ భాగస్వామి మాట వినడానికి ఇష్టపడరు. అయితే అలా దూకుడుగా ఉన్న మరీ బలవంతం చేస్తే, మీరు అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాలి. వారు కేవలం కలయిక కోసం వారి ప్రతాపాన్ని చూపిస్తారు.

వాడుకొని వదిలేయడం..

వాడుకొని వదిలేయడం..

కొంతమంది వ్యక్తులు మొదటి నుండి మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. మీరు ఎప్పుడైతే వారిని నమ్ముతారో, అప్పడు వారు కలయిక వంటి విషయాలపై శ్రద్ధ పెడతారు. మీతో కలయికను కోరుకునే వారు మీపై ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇలాంటి వారు మీరు చేసే ప్రతి పనినీ అంగీకరిస్తారు. అయితే ఇలాంటి వారితో మీరు ఒక్కసారి శారీరక సంబంధం పెట్టుకుంటే.. అప్పుడు వారి ప్రేమ అంతా ముగిసిపోతుంది. ఇలాంటి వారు కేవలం మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు.

మీ జీవితం నాశనం చేసేందుకు..

మీ జీవితం నాశనం చేసేందుకు..

ఇంకా కొందరు వ్యక్తులు తమ జీవితంలో ఇప్పటిరవకు ఎవ్వరితోనూ అలాంటి కార్యకలాపాలలో పాల్గొనలేదని చెబుతారు. వీరు కెరీర్, ఉద్యోగం, కుటుంబం వంటి ప్రతిచోటా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అబద్ధాలు చెబుతారు. ఇలా మిమ్మల్ని నమ్మించి మీతో తప్పుగా ప్రవర్తిస్తారు. అయితే మీతో రొమాన్స్ విషయానికొచ్చేసరికి వారి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆ సమయంలో మాత్రం అన్నీ సక్రమంగా జరుగుతున్నట్లు నటిస్తారు. ఇలాంటి వారు మీ జీవితాన్ని నాశనం చేయడానికే వస్తారు.

ఇతరులతో సంబంధం..

ఇతరులతో సంబంధం..

మీ భాగస్వామితో ఇంకొకరికి సన్నిహిత సంబంధం ఉందని మీకు తెలిసిన మరు క్షణం నుండే వారికి దూరంగా ఉండటం మొదలుపెట్టాలి. అంతేకాదు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండాలి.

మిమ్మల్ని గౌరవించే వారితో..

మిమ్మల్ని గౌరవించే వారితో..

మీ జీవితంలో ఎవరైతే కేవలం కలయిక కోసం మాత్రమే వచ్చి, అలాంటి విషయాల గురించి ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడి, మీ ప్రతిష్టను, గౌరవాన్ని తగ్గించే వారితో మీరు దూరంగా ఉండాలి. అలాంటి వారితో మీరు సంబంధం కొనసాగించాల్సిన అవసరం లేదు.

శుభ్రత లేని వారిని..

శుభ్రత లేని వారిని..

మీరు ఏ వ్యక్తితో అయినా శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఆ వ్యక్తికి పరిశుభ్రత, నోటి వాసన పట్ల ప్రత్యేకించి ఆసక్తి లేకపోతే లేదా స్నానం చేయడానికి సంకోచించే వారు ఎలాంటి వారో.. వారి బట్టలు మరియు బెడ్ షీట్లు ఎంత మురికిగా ఉంటాయో మీరు ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కండోమ్ లేదని చెప్పడం..

కండోమ్ లేదని చెప్పడం..

మీరు కలయిక విషయంలో ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా కొందరు సరిగ్గా కలయిక సమయంలో కండోమ్ లేదని.. అయినా దానిని ఆస్వాదిస్తామని నటిస్తారు. అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకోవద్దు.

తొందరపడితే..

తొందరపడితే..

మీకు నచ్చిన వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు. అయితే మీరు ఒకసారి శారీరకంగా సంబంధం పెట్టుకుంటే, అది కూడా ఇష్టపడేలా చేస్తుందని మీకు తెలుసు. అయితే ఇలాంటి సంబంధాలను పెట్టుకోకపోవడమే మంచిది. వాస్తవానికి ప్రేమ విషయంలో శారీరక సంబంధం అనేది ఒక భాగం మాత్రం మాత్రమే. అయితే మీరు తొందరపడితే వారు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది.

ఇవి ముఖ్యం..

ఇవి ముఖ్యం..

మీరు ఎవరితో అయినా శారీరక సంబంధంలో ఉన్నప్పుడు మీ సంతృప్తిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ మీ భాగస్వాములు దీన్ని చేయరు. వారి సంతృప్తిని మాత్రమే చూసుకుంటారు. ఇలాంటి విషయాలను మీరు బాగా ఆలోచించాలి.

English summary

You Should not have sex with these type of people

It’s important to be careful about who you share your body with. Here are 10 types of people you should never have sex with.
Story first published: Friday, May 8, 2020, 17:38 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more