Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ప్రతి ఒక్క రాశివారు బ్రేకప్ బాధ నుండి ఎలా బయటపడతారంటే...!
బ్రేకప్ తర్వాత రాశిచక్రాల వారు అలాంటి వాటి నుండి ఎలా బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాం...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలోని ప్రతి ఒక్క రాశి చక్రం భిన్నమైన నాణ్యత మరియు విభిన్నమైన లోపాలను కలిగి ఉంటాయి. చాలా సందర్భాలలో రాశిచక్రాలు భిన్నంగా ప్రవర్తిస్తాయి.

ప్రతి ఒక్క రాశిచక్రం వారు గాఢమైన ప్రేమలో ఉండి అకస్మాత్తుగా బ్రేకప్ చెప్పాల్సి వస్తే.. అది వారి జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో కొందరు చాలా కాలం బాధపడతారు. మరికొందరు అతి తక్కువ సమయంలోనే కోలుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతి రాశిచక్రం వారికి బ్రేకప్ అనేది.. వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ఆ బాధను అధిగమించడానికి వారు ఏమి చేస్తారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి భావోద్వేగాలు చాలా తక్కువగా ఉంటాయి. వీరు బ్రేకప్ బాధ నుండి చాలా త్వరగా కోలుకుంటారు. కుజుడి యొక్క అనుగ్రహంతో వీరు బ్రేకప్ వంటి కఠినమైన బాధతో పోరాటం చేస్తారు. అందువల్ల వీరిని బాధపెట్టడం అంత సులభం కాదు. వీరికి బ్రేకప్ తర్వాత పెద్దగా ఆశ్చర్యకరంగా అనిపించదు. వీరు ఈ బాధ నుండి కోలుకోవడానికి కుటుంబసభ్యులతో మరియు స్నేహితులతో తమ భావాలను పంచుకోవడం ద్వారా తమను తాము త్వరగా కోలుకోనేలా చేసుకుంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ అయిన సమయంలో చాలా బాధపడతారు. అప్పటి నుండి ఇతరులను అంత తేలిగ్గా నమ్మరు. అలాగే ఇతరులతో ఇంకోసారి అంత సులభంగా ప్రేమలో పడరు. ఎందుకంటే ఒకసారి ప్రేమలో పడిన తర్వాత వారు మోసపోయిన లేదా విడిపోయినా వీరు అలాంటి సంఘటనలను తట్టుకోలేరు. చాలా కాలం దుఃఖంలో ఉంటారు.

మిధున రాశి..
ఈ రాశి వారికి భావోద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు విడిపోయిన తర్వాత.. వీరు త్వరగానే నిలదొక్కుకుంటారు. అయితే, వీరి మనసు మాత్రం నియంత్రణలో ఉండదు. వీరు బ్రేకప్ తర్వాత నిరంతరం ఆలోచించడం మరియు తిరోగమన వైఖరితో బాధపడతారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు వారికి ఓ మెడిసిన్ లా పని చేస్తుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ప్రేమలో పడితే అన్నింటినీ సమర్పించుకుంటారు. అయితే బ్రేకప్ వంటి పరిస్థితి వస్తే మాత్రం వీరు చాలా చెడ్డగా ఫీల్ అవుతారు. అయితే వీరు త్వరలో ఆ దుఃఖం నుండి బయటపడతారు. బ్రేకప్ సమయంలో వీరు చాలా అహంకారంతో ఉంటారు. వీరు తమ బాధను మరో వ్యక్తి ముందు అస్సలు ఒప్పుకోరు. ఈ రాశి వారికి బ్రేకప్ వంటి భావోద్వేగాలను ఎలా అధిగమించాలో బాగా తెలుసు.

సింహ రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ వంటి విషయాలను తేలిగ్గా తీసుకుంటారు. వీరు తమ భాగస్వామిపై ఆసక్తి తగ్గించుకుంటే.. వీరు విడిపోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. ఈ బ్రేకప్ వంటి బాధ వీరిపై ఎలాంటి ప్రభావం చూపదు. వీరు ఇలాంటి బాధకరమైన విషయాలను అత్యంత త్వరగా బయటపడతారు.

కన్య రాశి..
ఈ రాశి చక్రం వారు బ్రేకప్ తర్వాత చాలా ఒత్తిడికి గురవుతారు. వీరు ఎవరిరైనా ప్రేమిస్తే.. చాలా నిజాయితీగా ఉంటారు.. అందుకే వీరు బ్రేకప్ విషయాలను అంత తేలిగ్గా మరచిపోలేరు. వీరు తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు బ్రేకప్ వంటి విషాద సంఘటన వీరి వ్యక్తిగత జీవితంపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇంకొకరు తమ జీవితంలోకి వచ్చినప్పుడు.. బ్రేకప్ వంటి బాధను మరచిపోతారు.

తుల రాశి..
ఈ రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. అయితే వీరు బ్రేకప్ వంటి సంఘటనలతో గందరగోళ పడతారు. ఒకవేళ బ్రేకప్ జరిగితే వీరు చాలా నిరాశకు గురవుతారు. వీరు పుస్తకాలు చదవడం లేదా స్నేహితులతో కలిసి తిరగడం వల్ల ఈ దుఃఖాన్ని అధిగమించొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఎవరితో అయిన ప్రేమలో పడినప్పుడు ప్రతి విషయాన్నీ అంగీకరిస్తారు. అయితే వీరు విడిపోవడం అనేది వీరిపై చాలా ప్రభావం చూపుతుంది. బ్రేకప్ తర్వాత వీరు చాలా కోపంగా మరియు చిరాకుగా మారిపోతారు. బ్రేకప్ ప్రభావం వీరిపై చాలా కాలం ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ తర్వాత వేగంగానే కోలుకుంటారు. వీరు పార్ట్ టైమ్ ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరు ఎప్పటికీ విడిపోవడానికి ఇష్టపడరు. కానీ సరైన కారణం దొరికితే.. వీరు విడిపోయేందుకు సిద్ధంగా ఉంటారు. ఇలాంటి సమయంలో వీరు అస్సలు గందరగోళానికి గురికారు.

మకర రాశి..
ఈ రాశి వారు చాలా పరిణితి చెందిన వారు. కాబట్టి బ్రేకప్ వంటి బాధను చాలా త్వరగా అధిగమిస్తారు. విడిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. తమను తాము నిరూపించుకుంటారు. బ్రేకప్ తర్వాత జీవితాన్ని ఆనందంగా మలచుకుంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ వంటి బాధను సులభంగా మరచిపోలేరు. వీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడం ద్వారా తమ బాధను మరచిపోయే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా చాలా నిరాశగా ఉంటారు. బ్రేకప్ తర్వాత అందరికంటే ఎక్కువగా బాధపడేది వీరేననే భావనలో ఉంటారు.

మీన రాశి..
ఈ రాశి వారు బ్రేకప్ వంటి ఘటనలతో చాలా ఇబ్బందులు పడతారు. వీరు ఇలాంటి సమయంలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటారు. దీని వల్ల బ్రేకప్ బాధ నుండి బయటపడొచ్చని నమ్ముతారు. అందుకే వీరు విడిపోయిన తర్వాత దాని నుండి బయటపడటానికి ఎక్కువ సమయం తీసుకోరు. తమ భాగస్వామి అర్హులు కాదని భావిస్తే, వారు చాలా త్వరగా విడిపోతారు.



Click it and Unblock the Notifications