Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఈ రాశుల వారు లవ్ లో ఈజీగా సక్సెస్ అవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...
ఈ రాశి చక్రాల వారు కష్టమైన పరిస్థితులను అధిగమించి ప్రేమలో సక్సెస్ అవుతారట. ఆ రాశులేవో మీరూ చూడండి.
ప్రేమ అనేది రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంటుంది. అది ఎప్పుడు.. ఎలా మొదలవుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ప్రేమలో పడిన వారంతా కచ్చితంగా సక్సెస్ అవుతారా అంటే ఎవ్వరూ చెప్పలేరు.

ఎందుకంటే అది వారిద్దరి నమ్మకం, ప్రవర్తన, ఇతర విషయాలపై అవగాహనపై ఆధారపడి ఉంటుంది. అయితే మనకు నచ్చిన వారికి తమ ప్రేమ విషయాన్ని చెప్పాలని తహతహలాడుతూ ఉంటారు. తాము లవ్ చేస్తున్న వారిని అట్రాక్ట్ చేసేందుకు ఏవేవో పాట్లు పడుతుంటారు. అయితే కొందరు వ్యక్తలు వారి ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

తమకు కావాల్సిన ప్రేమను దక్కించుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎన్ని కష్టాలు పడినా ఫలితం శూన్యంగానే ఉంటుంది. ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మగవారు తమకు నచ్చిన మగువలను దక్కించుకునేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా ఇష్టపడితే.. వారిని సులభంగా దక్కించుకుంటారు. ఎందుకంటే వీరు కోరుకున్నది సాధించుకునేంత వరకు ఎంత దూరమైనా వెళ్తారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా కష్టపడకుండానే తక్కువ ప్రయత్నాలతోనే తమ ప్రేమను దక్కించుకుంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. వారి నుండి తమకేంటి ప్రయోజనం అనే విషయాలను ఆలోచిస్తారు. తమకు గనుక లాభం వస్తుందనుకుంటే.. మాత్రం తమ ప్రేమను దక్కించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. అదే వారి నుండి ఎలాంటి లాభం లేదనుకుంటే.. అస్సలు వారిని పట్టించుకోరు.

మిధున రాశి..
ఈ రాశి వారు చాలా సరదాగా ఉంటారు. వీరు చాలా మందిపై మనసు పడతారు. వీరు ఒకరి కంటే ఎక్కువ మంది ప్రేమిస్తారు. అంతేకాదు వీరు ఫ్లర్టింగ్ వంటివి చేస్తూ ప్రేమ విషయంలో ఇతరులను మోసం చేసే అవకాశం ఉంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే.. మాత్రం తమ మనసు చెప్పిన మాట కూడా వినరు. అయితే వీరు ప్రేమించిన వారు తిరస్కరిస్తే మాత్రం చాలా బాధపడతారు. అందుకే వీరు ప్రేమలో ఆశించినంతగా విజయం సాధించలేరు.

సింహ రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయలో ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. వారిని ఆకట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు. అంతేకాదు వారిని ఆకర్షించడానికి కొన్ని వెరైటీ ఫీట్లు కూడా చేస్తుంటారు.

కన్య రాశి..
ఈ రాశి వారు ప్రేమ, పెళ్లి వంటి వాటికి ఎక్కువ విలువనిస్తారు. వీరు ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరు బంధాలకు, కుటుంబసభ్యుల పట్ల చాలా బాధ్యతతో ఉంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలో పాజిటివ్ గా ఆలోచిస్తారు. వీరు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. వారిని తమ దారిలోకి తెచ్చుకునేందుకు కొన్ని ట్రిక్స్ ఉపయోగిస్తారు. వీరు పాజిటివ్, నెగిటివ్ రెండింటిని ఒకేలా చూస్తారు. వీరు ప్రేమను దక్కించుకోవడానికి ఎక్కువ ఫోకస్ చూపుతారు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు ప్రేమ విషయంలోనే కాకుండా.. ఏ విషయంలో అయినా ఏదైనా కోరుకుంటే.. దాన్ని దక్కించుకోవడానికి చాలా కష్టపడే స్వభావం కలవారు. వీరు ప్రేమ విషయంలో చాలా ఫోకస్ పెడతారు.

ధనస్సురాశి..
ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమిస్తే.. అలాంటి వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టరు. ప్రేమను చాలా లైట్ తీసుకుంటారు. ఎందుకంటే వీరికి ప్రేమ అనే దానిపై నమ్మకం తక్కువగా ఉంటుంది. అయితే అమ్మాయిలతో సరదాగా గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు.

మకర రాశి..
ఈ రాశివారు తమ లైఫ్ లో ఏదైనా కావాలనుకుంటే.. దాన్ని చేరుకునేంత అస్సలు నిద్రపోరు. అది ప్రేమైనా.. ఇంకేదైనా తమ కోరికను నెరవేర్చుకునేందుకు చాలా ఫోకస్ పెడతారు. అయితే వీరు ప్రేమ వంటి విషయాలకు చాలా దూరంగా ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. వారి కోసం ఎన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. అలా చాలా సందర్భాల్లో కాంప్రమైజ్ అయితేనే వీరికి ప్రేమలో విజయం లభిస్తుంది. ఈ రాశి మగవారు సాధ్యమైనంత వరకు చాలా కూల్ గా ఉంటారు. కాబట్టి వీరు ఎవరినైనా ప్రేమిస్తే చాలా సులభంగా ప్రేమలో విజయం సాధిస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారికి ప్రేమించడానికి సమయం లేదని ఫీలవుతుంటారు. అందుకే ప్రేమించడానికి పెద్దగా ఫోకస్ పెట్టరు. కాబట్టి.. వీరు లవ్ విషయంలో విజయం సాధిస్తారనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేం.



Click it and Unblock the Notifications