Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మొగుడు వద్దు ప్రియుడే ముద్దు అని వెళ్లిన ఆంటీ..ఊహించని ఎండింగ్..పాపం చివరికి
ఉత్తరప్రదేశ్ లో ఓ భర్త తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన వార్త గత వారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. భర్త దగ్గరుండి తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. మొగుడు వద్దు నాకు ప్రియుడే కావాలి అంటూ వెళ్లిన మహిళకు ఊహించని షాక్ తగలింది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లాకు చెందిన బబ్లూ, రాధిక భార్యాభర్తలు. 2017లో వీరికి పెళ్లికి జరగ్గా. 7 ఏళ్లు వయస్పు, 9 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబపోషణ కోసం బబ్లూ తరుచుగా బయటకు వెళ్లి పనులు చేస్తూ ఉండేవాడు. అయితే కామంతో రగిలిపోయిన భార్య తమ గ్రామంలోనే తనకంటే వయస్సులో చాలా చిన్నవాడితో ఎఫైర్ పెట్టుకుంది. బబ్లూ ఇంటి నుంచి వెళ్లడం..కుర్రాడితో రాధిక కులకడం కొన్నాళ్ల పాటు కొనసాగింది. అయితే రాధిక ఎఫైర్ విషయం ఊర్లోని మిగతావాళ్లతో పాటు బబ్లూ కుటుంబానికి కూడా తెలిసింది. వెంటనే వారు ఈ విషయాన్ని బబ్లూకి చెప్పారు. దీంతో బబ్లూ పెళ్లానికి ఇలాంటి పనులు చేయవద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.

రాధిక ఎఫైర్ విషయం ఊర్లోని మిగతావాళ్లతో పాటు బబ్లూ వరకు చేరింది. అయితే ఇటీవల ప్రియుడి కోసం ఓ భార్య తన భర్తను దారుణంగా చంపి సిమెంట్ డ్రమ్ లో కప్పెట్టిన విషయం దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారిన క్రమంలో బబ్లూ భయపడ్డాడు. తనను కూడా ప్రియుడితో కలిసి తన పెళ్లాం హత్య చేస్తుందేమోనని భయపడి తన భార్యకు ఆమె కోరుకున్న ప్రియుడితోనే పెళ్లి జరిపించాడు. ధన్ ఘటాలోని బాబా ధనినాథ్ శివ టెంపుల్ లో భర్త దగ్గరుండి ఊరందరి సమక్షంలో భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
బిగ్ ట్విస్ట్
పిల్లల బాధ్యత తానే చూసుకుంటానని బబ్లూ చెప్పిన మాటలకు రాధిక కూడా అంగీకరించింది. దీంతో పెళ్లి తర్వాత మార్చి 24న కొత్త మొగుడు ఇంటికి వెళ్లింది. అయితే మంగళవారం బబ్లూ తన ఇద్దరు పిల్లలతో కలిసి రాధిక కొత్త ఇంటికి వెళ్లాడు. తనతో పాటు వచ్చేయాలని బబ్లూ రాధికను కోరాడు. తనతో రాకుంటే తాను పిల్లలు కూడా ఇక్కడే ఉంటాం అని చెప్పాడు. పిల్లలు కూడా అమ్మా మాతో వచ్చెయ్ అని పిలవడంతో రాధిక కరిగిపోయి రాధిక బబ్లూ పిల్లలో కలిసి వెళ్లింది. రాధిక లవర్ మాత్రం ఇప్పటికీ ఆమె తిరిగిస్తొదనే ఆశతోనే ఉన్నట్లు సమాచారం..కానీ రాధిక మాత్రం తన మాజీ భర్త,పిల్లలతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది.
ఈ విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. తప్పు తెలుసుకొని వచ్చింది కాబట్టి ఆమెను భర్త ఇకపై ఇబ్బంది పెట్టకూడదని కొందరు కామెంట్ చేయగా..ప్రియుడే ముద్దు అని వెళ్లినదాన్ని అసలు నమ్మకూడదు ఏ రోజైనా ఈమెతో డేంజరే అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే డీజే టిల్లు సినిమాలోని రాధిక క్యారెక్టర్ తో ఈమెను పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. రాధిక కొత్త మెగుడి పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తోందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications