Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
మీ భర్త మిమ్మల్ని మోసగిస్తున్నాడో లేదో తెలుసుకోవడం ఎలా
మీరు కనుక మీ భర్త విచిత్ర ప్రవర్తన, ఆయన్లో వచ్చిన కొత్త మార్పులూ, మీ మధ్య పెరిగిన దూరం, అతని రహస్య పద్ధతుల గురించి భయపడుతున్నట్లయితే ఈ కింద ఇచ్చినవి చదివి కేవలం మీరు ఈర్ష్య పడుతున్నారో లేదా మీ భర్త మిమ్మల్ని నిజం గా మోసగిస్తున్నాడో తెలుసుకోండి.


ప్రైవేటు ఫోను సంభాషణలు
కొన్ని ఫోను కాల్స్ గోప్యం గా మాట్లాడటం ముఖ్యమే కానీ ఫోను రింగవగానే ఒక రూము నుండి మరొక గదిలోకి వెళ్ళిపోతున్నారా?? ఇది కొత్తగా వచ్చిన లక్షణమా?? తరచ్చుగా ఇలా చేస్తుంటే కనుక ఆయన మీద ఒక కన్ను వేసి ఉంచాల్సిందే.మిమ్మల్ని మీ భర్త మోసం చేస్తున్నారనడానికి ఇది ఒక సంకేతం.

.ఫోనులో మెసేజిలు తొలగించడం
చాలా మంది తమ ఫోను మెసేజ్ ఇన్ బాక్స్ నిండి పోయేవరకూ మెసేజిలని పట్టించుకోరు.ఇన్ బాక్స్ నిండిపోతే ఏవో కొన్నింటిని మాత్రం తొలగిస్తారు.కానీ మీ భర్త ఎస్సెమ్మెస్ ఇచ్చిన వెంటనే లేదా అందుకున్న వెంటనే దానిని ఫోను నుండి డిలీట్ చేసున్నట్లయితే కనుక ఏదో ఉన్నట్లే లెక్క.

పార్టీలూ ఫంక్షన్లని తప్పించుకోవడం
ఇంతకుముందులాగ కాకుండా మీ భాగస్వామి ఫ్యామిలీతో,ఫ్రెండ్స్ తో తక్కువ సమయాన్ని గడుపుతున్నారా??ఆయన తరచుగా ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితులతో కలవడాన్ని తప్పించుకు తిరుగుతున్నారా??ప్రతీ రోజూ ఇంటి నుండి త్వరగా వెళ్ళి లేటు గా వస్తూ ప్రాజెక్టు వర్కు అని చెప్తున్నారంటే ఆయన మీకు కాకుండా మరొకరికి ఫోను ద్వారానో కంప్యూటర్ ద్వారానో తన సమయాన్ని వెచ్చిస్తున్నట్లే.

వేరొకరితో గంటలు గంటలు గడపడం
ఆకస్మాత్తుగా ఆయన గంటల తరబడి తన ఫ్రెండు, కొలీగ్ లేదా తనతో పని చేసే వ్యక్తితో ముఖ్యం గా ఆపోజిట్ సెక్స్ తో గడుపుతున్నారంటే వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మీరు కనుక్కోవాలి.

ఇంటికి ఫ్రెష్ గా వస్తుంటే
ఆయన నుండి వేరొక పెర్ ఫ్యూం వాసన వస్తోందా??ఆయన బయటెక్కడో స్నానం చేసి పొద్దున్న ఇంటి నుండి ఎలా వెళ్ళారో అంతే ఫ్రెష్ గా వస్తున్నారా గంటల తరబడి ఆఫీసు వర్క్ చేసిన తరువాత కూడా??అంటే ఆయన వేరొకరితో గడుపుతున్నారనడానికి ఇది సంకేతం.

ఆప్యాయత తగ్గిపోతుంటే
దంపతుల మధ్యలో పోట్లాటల వల్ల కానీ, ఏమైనా పరిష్కారం కాని సమస్య వల్ల కానీ, ఇద్దరి మధ్యా ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కానీ ఆప్యాయత తగ్గుతుంది.కానీ ఇవేమీ లేకుండా అకస్మాత్తుగా ఆయన మిమ్మల్ని దూరం పెడుతున్నా లేదా,వింత కారణాలతో మిమ్మల్ని అసహ్యించుకుంటున్నా ఆయన మీకు తన కొత్త బంధం గురించి సంకేతం ఇస్తున్నట్లే అని గ్రహించండి.

మీతో పొడి పొడిగా మాట్లాడుతుంటే
ఒకప్పుడు తన రోజువారీ కార్యకలాపాల గురించి పూస గుచ్చినట్లు వివరించిన మనిషి పొడి పొడిగా మాట్లాడుతుంటే కనుక మరింత వివరం గా చెప్పమనండి.అలా అడిగినప్పుడు ఆయన సాకులు వెతుక్కుని ఆ విషయాన్ని దాటెద్దామని ప్రయత్నిస్తుంటే ఆయన మీద మీరొక కన్ను వెయ్యాల్సిందే.

తరచూ పోట్లాడటం
చిన్న చిన్న తప్పులు లేదా సంభాషణలు పోట్లాటలు, అరుపులకి దారితీస్తున్నాయా?? అలాగే ఆయన బట్టలేమయినా మిస్స్ అయ్యయేమో కూడా ఓసారి చెక్ చెయ్యండి.

అతిగా రహస్యాలని దాస్తుంటే
ఎప్పుడూలేనట్లు మీ నుండి దూరం గా ఉంటున్నా, మీ బర్త్ డేలూ, పెళ్ళి రోజులూ, మర్చిపోతున్నా, ఫోను కాల్స్ విషయం లో రహస్యం గా ఉంటున్నారంటే మీరు ఆయన సంబంధాలు, కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని మా సలహా.



Click it and Unblock the Notifications