Latest Updates
-
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
బీపీ, కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టే నల్ల వెల్లుల్లి.. దీని ప్రయోజనాలు అదుర్స్! -
దాబా స్టైల్ వెజ్ కీమా కర్రీ.. గ్రేవీలో ఈ రెండూ కలిపారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే.!
మామకోడళ్ళ అనుబంధం-మమతానురాగాలకు ప్రతి రూపం!
సాధారణ ఆడపిల్లలు నాన్నతో, అబ్బాయిలు అమ్మతో ఎక్కువ చనువుగా ఉంటారన్న విషయం మనందరికీ తెలుసినదే. అయితే చాలా మంది ఆడపిల్లలు పుట్టింట్లో నాన్నగారితో ఎంత చనువుగా, ప్రేమగా ఉంటారో..అదే చనువును మెట్టినింట్లో మామగారితో కొనసాగించలేకపోతారు. దీనికి కొత్త వాతావరణం, వారి ప్రవర్తన, అభిరుచులు....మొదలగునవి తెలియకపోవడమే కారణం కావచ్చు.
అలాగే మామగారితో కూడా నాన్నగారితో ఉన్నట్లుగా ఉంటే, ఆయన ఏమనుకుంటారోనన్న భయం, మొహమాటం, కూడా చాలా మంది కోడళ్లలో ఉంటుంది. కానీ తండ్రి తర్వాత తండ్రంతటి వారు మామగారు...కాబట్టి ఆయనను నాన్నలాగే భావించి..ఓ కూతిరిలా ఆయన ప్రేమను పొందాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం...

విందుకు ఆహ్వానించండి...
మీ మామగారి ఇష్టాయిష్టాల గురించి మీకు తెలియకపోవచ్చు. తెలియదు కదా అనికొని, ఇలాంటి చిన్న విషయాలను దాటవేయకుండా మీ వారిని అడిగి తెలుసుకోండి. అలాగే వారానికోసారి లేదంటే పదిహేను రోజులకోసారైనా వారిని మీ ఇంటికి పిలవడం, మీరు వారింటికి వెళ్లడం...మీ మామగారికి ఇష్టమైన పదార్థాలు తయారుచేసి, దగ్గరుండి ఆయనకు వడ్డించడం.. వంటివి చేయాలి. అలాగే భోజనం తర్వాత కాసేపు సమయం కేటాయించి ఆయనతో మాట్లాడడం, అందరూ కలిసి గేమ్స్ ఆడుకోవడం.. వంటివి చేయడం వల్ల బంధాలు మెరుగుపడటం మాత్రమే కాదు, వారి మనసుకు సరదాగా, ఆహ్లాదంగా అనిపించి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

ఎప్పుడూ టచ్ లోనే ఉండాలి:
ప్రస్తుత రోజుల్లో పెళ్ళి చేసుకొన్న తర్వాత చాలా మంది జంటలు ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండటం కంటే విడిగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే విడిగా ఉన్నా సరే మీ పుట్టింటివారితో ఎలాగైతే ఫోన్ల ద్వారా టచ్ లో ఉంటారో...మెట్టినింటి వారితో కూడా అలాగే ఎప్పుడూ మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకుంటుండాలి. అయితే మాట్లాడమన్నాం కదా అని అత్తగారితోనే మాట్లాడి పెట్టేయకుండా...కొంచెం సమయం కేటాయించి మామగారితోనూ మాట్లాడాలి. ముఖ్యమైన విషయాలు పంచుకోవడం, ఆయా విషయాల్లో ఆయన సలహా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. దాంతో ఆయనకు కూడా మీపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మామకోడళ్ల మధ్య మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది.

అప్పుడప్పుడు పొగడాలి:
భార్యభర్తలన్న తర్వాత అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న తగాదాల, పొరపొచ్చాలు రావడం సహజం. అంత మాత్రానికే మీ ఇద్దరూ మీ అత్తమామల ముందు ఒకరినొకరు దూషించుకోవడం చేయకూడదు. అలాగే వారి ముందు మీ వారిని నిందించడం, చులకన చేసి మాట్లాడటం మంచిది కాదు. ఏవైనా సమస్యలుంటే మీ ఇద్దరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం మంచిది.
మీ ఇద్దరి వల్ల సమస్య పరిష్కరం కాకపోతేనే వారి ద్రుష్టికి తీసుకెళ్లి నెమ్మదిగా విచారించడం ఉత్తమం. అంతే కానీ ఆయన ముందు మీరు చులకనైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త ఓపికతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ముఖ్యం. వీలైతే మీ భర్త విషయంలో మీరు గ్రహించిన మంచి విషయాలు, ఆయన మిమ్మల్ని కేరింగ్ గా చూసుకునే విధానం, ఆయన తన ఉద్యోగం విషయంలో పొందిన విజయాలు....ఇలా మీ భర్త గురించి పొగుడుతూ మీ మామగారితో చెప్పండి. ఆయన చాలా సంతోషిస్తారు.

సరైన సమయంలో :
మామగారి ఆహారపు అలవాట్లు, ఫిట్ నెస్...అనారోగ్య సమస్యలు వంటి విషయాల్లో మీరు మరింత శ్రద్ద తీసుకోవడంతో పాటు వాళ్లు సమయానికి మాత్రలు వేసుకుంటున్నార? లేదా? అని కూడా తెలుసుకోవాలి. వారు మీకు దగ్గరగా ఉన్నట్లయితే మీరే స్వయంగా సంబంధిత మాత్రలు అందించాలి. లేదంటే ఫోన్ చేసి మరీ ‘మామయ్యా...రోజు మందులు క్రమంగా వాడుతున్నారా ? మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెబితే చాలు వారు ఆంనదంతో పొంగిపోతారంటే ఆశ్చర్యం కలగక మానదు...
బాధ్యత తీసుకోవాలి:
పెద్దవయస్సులో ఉండే వారికి కొన్ని తీరని కోరికలు కూడా ఉంటాయి. అవి కొందరికి షష్టిపూర్తి వంటివి కావచ్చు. మరికొందరికి ఏదైనా టూర్ వెళ్లడం...లాంటివి కావచ్చు. కాబట్టి కోడలిగా ఆ భాధ్యత మీరు తీసుకుని...బంధువులందరి సమక్షంలో అత్తమామలకు షష్టిపూర్తి వేడుక ఘనంగా నిర్వహించడం, ఈ సందర్బంగా వారికి ప్రత్యేకంగా కొన్ని కానుకలు ఇవ్వడం...వంటివి చేయాలి. ఈ ట్రిప్ కోసం మీరే ప్లాన్ చేసి వారిని సర్ ఫ్రైజ్ చేయవచ్చు. దీంతో వారి మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుంది.
అలాగే మీ మామగారి పుట్టిన రోజును తెలుసుకొని...ఇలాంటి సందర్భాల్లో మీరు మీ ఆయనతో కలిసి వారికి తెలియకుండా ఓ మంచి హోటళ్లో విందు ఏర్పాటు చేసి వారిని సర్ ఫ్రైజ్ చేయవచ్చు. అలాగే మీ మామగారు పదవీ విరమణ పొందినప్పుడు వారికి కృతజ్ఝతలు చెబుతూ మంచి గిఫ్టులివ్వడం..ఇలాంటివన్నీ ాయన జీవితాంతం చెరిగిపోని జ్ఝాపకాలుగా ఉండిపోతాయి. అలాగే మీ మామగారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీకు బహుమతులు, కానుకలు ఇచ్చినప్పుడు వాటిని తిరస్కరించకుండా ఆనందంగా స్వీకరించండి...వారి ముందే వాటిని ధరించండి...దాంతో ఆయన మరింత ఆనందపడతారు. ఫలితంగా మీ ఇద్దరి మద్య ఉండే మమతానురాగాలు కూడా మరింతగా రెట్టింపు అవుతాయి.



Click it and Unblock the Notifications