Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
దాంపత్య జీవితంలో భార్యభర్తల మద్య అన్యోన్యతను దెబ్బతీసేవేవీ!
భార్యభర్తలంటే సీతారాముల్లాగా చూడముచ్చటగా, అన్యోన్యంగా ఉండాలంటారు పెద్దలు. కానీ, ఈ కాలంలో దంపతుల్లో చాలా మంది చిన్న చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, భాగస్వామిని సూటిపోటి మాటలతో హింసించడం, తరచూ కోపబడటం, మొదలగునవి చేస్తుంటారు. దీనికి అవతలివారికంటే తాము ఎందులోనూ తక్కువ కాకూడదనే భావమే కారణమని చెప్పుకోవచ్చు.
ఏదేమైనా ఇలాంటివి భార్యాభర్తలిద్దరి బంధాన్నిక్రమంగా క్షీణించేలా చేస్తాయి. మరి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఎలాంటి సందరాల్లో ఏలా ఉంటే వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందో చూద్దాం...

చులకనగా చూడకూడదు:
భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చులకన చేసి మాట్లాడుకోవడం మంచిది కాదు. అది కేవలం నలుగురిలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. మీ ఇద్దరూ ఉన్నప్పుడ కూడా వర్తిస్తుంది. కొంతమంది తమ భాగస్వామి గురించి నలుగురిలో చెడుగా చెప్పడం, వాళ్ల మీద జోక్స్ వేయడం చేస్తుంటారు. మీరు అలా చెడుగా చెప్పిన వాళ్లలో ఎవరైనా మీరు మాట్లాడిన తీరును మీ భాగస్వామితో పంచుకుంటే వాళ్లు చాలా బాధపడుతారు. ఇలా చేయడం వల్ల మీ మీద ఉండే గౌరవం, ప్రేమ కూడా క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి అనవసరమైన పనులతో టైమ్ వేస్ట్ చేసుకోకపోవడమే మంచిది.

నిస్వార్థంగా :
స్వార్థం, అపనమ్మకం...ఈ రెండూ కూడా ఎంత అన్యోన్యమైన సంబంధాలనైనా దూరం చేసేస్తాయి. కొంత మంది తమ భాగస్వామి మనోభావాలను గురించి ఆలోచించకుండా, కేవలం తమలోని ఉంచుకొని ఆలోచించి స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటారు. తమకు ఏదైతే ప్రయోజనం కలిగేలా చేస్తుందో దాన్నే పాటిస్తారు. ఇది దీర్ఘకాలంలో మీకు ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మరికొంతమంది తమ భాగస్వామి మీద లేనిపోని అపనమ్మకం పెంచుకుంటారు. వారిని అనుమానిస్తూ ప్రతి కదిలికనూ పరిశీలిస్తుంటారు. ఇది వారికీ తెలీనంత కాలం పర్వాలేదు. అవతలివారికి తెలిస్తే వారి మనో భావాలు దెబ్బతింటాయి. ఇలాంటివాటి వల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత పూర్తిగా నశిస్తుంది.

ఒత్తిడి పెరిగితే:
పనిలో కలిగే ఒత్తిడి, ఒతర సమస్యల వల్ల సహనాన్ని కోల్పోవడం సహజం. మీ భర్త కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారా?అయితే ఇలాంటి సమయంలో మీ భాగస్వామినిన కాసేపు ఒంటరిగా వదిలేయడం మీకు మరియు అతనికి ఇద్దరికీ మంచిది. అలాకాకుండా కోపంతో ఉన్న వాళ్ల దగ్గర మీ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ల కోపం మరింత పెరిగి, మీపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. దీంతో ఇద్దరి మద్య గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడితో బాధపడుతున్నవారిని అర్ధం చేసుకుని మసలుకోవడం మంచిది.

అబద్దాలు అనర్ధం:
అబద్దాలు మాట్లాడితే అతికినట్లుండాలి...అంటుంటారు పెద్దవాళ్లు. ఇక్కడ వారి ఉద్దేశం అబద్దాలాడాలని మాత్రం కాదు. ఎందుకంటే అన్యోన్యంగా ఉండే బంధాల్లో కలతలు రేపేవి అబద్దాలే. చాలామంది చిన్న చిన్న విషయాల్లో కూడా భాగస్వామికి అబద్దాలు చెబుతుంటారు. ఇలా మీరు మీ భాగస్వామికి సరదాగా ఓ చిన్న అబద్దం చెప్పారనుకోండి. అది నిజం కాదని తేలిసిన రోజున ఇద్దరి మద్య దూరం పెరిగిపోతుంది. కాబట్టి సరదాగా అయినా, సీరియస్ గా అయినా దంపతుల మధ్య అబద్దాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. బంధంలో ఎంత నిజాయితీ ఉంటే ఆ సంబంధం అంత దృడంగా తయారవుతుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వైవాహిక జీవితంలో ప్రేమకు ముఖ్యమైన ఆధారం సెక్స్:
అది రోజు రోజుకూ పరస్పర ఆకర్షణను పెంచుతుంది. దాంపత్య బంధాన్ని దడంగా మార్చుతుంది. పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం వ్యక్తిగత జీవితంపై పడకుండా చూసుకోవాలి. భార్యా భర్తల మధ్య ఎంత గొడవ జరిగినా వారు రాత్రి పూట ఒకే బెడ్ పై నిద్రపోతారు. తమ సెక్స్ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తారు. దాంతో వారి దాంపత్యంలో సంతోషం నిలిచి ఉంటుంది. భార్యా భర్తలు పరస్పరం తోడుగా ఉన్నామని ఆనందిస్తారు. ఈ శారీరక బంధం ఆత్మీయ సంబంధాన్ని పటిష్టం చేస్తుంది.
ఇవన్నీ దాంపత్య జీవితాన్ని నాశనం చేసే కొన్ని ప్రాధమిక విషయాలు, వీటిని కనుక గుర్తుంచుకొన్నట్లైతే మీ దాంప్యత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు.....



Click it and Unblock the Notifications